ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్లెయిము చేయని నగదు…. కామన్ ల్యాండింగ్ పోర్టల్‌ను ప్రారంభించిన ఆర్థిక సేవల విభాగం


క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, బీమా క్లెయిములు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లను పౌరులు మొత్తం ఆర్థిక వ్యవస్థలో సులభంగా వెతికి గుర్తించేందుకు ఒకే సమగ్ర ఆన్‌లైన్ వేదిక

క్లెయిమ్ చేయని నగదు సమాచారాన్ని సులభంగా చేరువ చేయడానికి “ఆప్కీ పూంజీ, ఆప్కా అధికార్ (మీ డబ్బు, మీ హక్కు)” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం

పోర్టల్ ద్వారా పౌరులకు మరింత సౌకర్యంతో పాటు వ్యక్తులను, వారి అర్హత కలిగిన నగదునూ తిరిగి అనుసంధానించే ప్రయత్నాలు బలోపేతం: ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి

నాడు పోస్టు చేయడమైనది: 29 MAY 2026 6:02PM by PIB Hyderabad

క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల కోసం కామన్ ల్యాండింగ్ పోర్టల్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్ఈ రోజు ప్రారంభించిందిపీఎస్బీ అలయన్స్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ పోర్టల్‌  క్లెయిమ్ చేయని నగదుకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా పొందేందుకు ఉపయోగపడుతుంది.

www.unclaimedassetsportal.in లో  అందుబాటులో ఉన్న ఈ పోర్టల్ మొత్తం ఆర్థిక వ్యవస్థలో క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లుబీమా క్లెయిమ్లుషేర్లుడివిడెండ్లుమ్యూచువల్ ఫండ్లను సులభంగా వెతికి గుర్తించేందుకు సమగ్ర వేదికగా పనిచేస్తుందిఈ పోర్టల్‌ను 2026 మే 29న జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సమీక్షా సమావేశంలో ఆర్థిక సేవల విభాగ కార్యదర్శి శ్రీ ఎమ్నాగరాజు ప్రారంభించారు.

ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలుబ్యాంకులుఇతర భాగస్వామ్య సంస్థల సమన్వయంతో ఆర్థిక సేవల విభాగం చేపట్టిన దేశవ్యాప్త ప్రచారం “ఆప్కీ పూంజీఆప్కా అధికార్ (మీ డబ్బుమీ హక్కు)” ప్రచార కార్యక్రమానికి ఈ వేదిక మరింత బలం చేకూరుస్తోందిక్లెయిమ్ చేయని నగదుపై అవగాహన కల్పించడంవాటిని గుర్తించడంయజమానులకు తిరిగి అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు.

క్లెయిమ్ చేయని నగదు కోసం ఒకే వేదికపై వెతుక్కునే సౌలభ్యం కల్పించడం ద్వారా ఈ పోర్టల్ పౌరుల సౌకర్యాన్ని మెరుగుపరుస్తుందనివ్యక్తులను వారి అర్హత కలిగిన ఆర్థిక ఆస్తులతో తిరిగి అనుసంధానించడానికి ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ప్రముఖంగా పేర్కొన్నారు.

ఈ సమగ్ర వేదిక (కామన్ ల్యాండింగ్ పోర్టల్మరింత సులభమైనపారదర్శకమైనప్రజా కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే  దిశగా ఒక ముఖ్యమైన అడుగుమెరుగైన ఆర్థిక సాధికారతసమ్మిళితంఆర్థిక వ్యవస్థపై నమ్మకం ద్వారా వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం ప్రజలలో అవగాహనను పెంచుతుందనిసమాచారాన్ని సులభంగా పొందే వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2266847) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी