మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యువ సంఘం ప్రతినిధి బృందంతో తెలంగాణ గవర్నర్ ముఖాముఖి


జాతీయ సమగ్రతను బలోపేతం చేయడంలో యువత పాత్ర కీలకం: గవర్నర్

జాతీయ ఐక్యతకు రాయబారులుగా మారాలని యువ సంఘం ప్రతినిధులకు పిలుపునిచ్చిన గవర్నర్

నాడు పోస్టు చేయడమైనది: 20 MAY 2026 8:17PM by PIB Hyderabad

యువ సంఘం  కార్యక్రమంలో భాగంగా తిరుపతి లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సందర్శనకు వచ్చిన మహారాష్ట్ర యువ ప్రతినిధి బృందం మే 18, 2026న తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లాతో  సమావేశమయ్యారు. 

పుణే లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( ఐఐఎస్ఈఆర్) ఆధ్వర్యంలోని ఈ ప్రతినిధి బృందం అంతర్ రాష్ట్ర అవగాహనను, భారతదేశమంతటా యువత మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో విద్యా, సంస్కృతి,  అనుభవపూర్వకమైన విభిన్న కార్యక్రమాలలో పాల్గొంటోంది.

 

విద్యార్థులను ఉద్దేశించి శ్రీ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తూ, దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశ వైవిధ్యంలో ఏకత్వాన్ని బలోపేతం చేయడంలో సాంస్కృతిక అవగాహన, రాష్ట్రాల మధ్య సహకారం ఎంతటి పాత్ర పోషిస్తాయో కూడా ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. యువ సంఘం వంటి కార్యక్రమాలు వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, సంప్రదాయాలతో యువత అనుసంధానమవడానికి అర్థవంతమైన అవకాశాలను కల్పిస్తాయని, తద్వారా భావోద్వేగ సమైక్యతను, జాతీయ సామరస్యాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడంలో, భారత సంస్కృతి గొప్పతనాన్ని, అభివృద్ధి రంగంలో సాధించిన విజయాలను విద్యార్థులు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చేయడంలో యువ సంఘం పోషిస్తున్న పాత్రను గవర్నర్ అభినందించారు. పరస్పర గౌరవం, అభ్యసనం, సహకార స్ఫూర్తిని జాతీయ సమగ్రతకు రాయబారులుగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రతినిధులను కోరారు. 

 

ఈ పర్యటనలో భాగంగా, ప్రతినిధి బృందం ఐఐటీ తిరుపతిలోని అధ్యాపకులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు, విద్యార్థులతో ముఖాముఖి ద్వారా అత్యాధునిక శాస్త్రీయ పరిశోధనలు, విద్యారంగంలో ప్రతిభ,  సాంకేతిక పురోగతిపై అవగాహన పెంపొందించుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యకలాపాల ద్వారా దక్షిణ భారతదేశ శక్తిమంతమైన సాంస్కృతిక వారసత్వాన్ని, సంప్రదాయాలను కూడా వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.

 

ఉన్నత విద్యా శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ప్రారంభించిన యువ సంఘం ఆరో దశ అనుభవపూర్వక విద్య, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత, సాంస్కృతిక సామరస్యం, భావోద్వేగ సమైక్యతను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ఈ చొరవ 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారిని ఒకచోటకు చేర్చడం ద్వారా భారతదేశ వైవిధ్యం, ఆవిష్కరణల వ్యవస్థలు,  దేశ నిర్మాణం పట్ల భాగస్వామ్య ఆకాంక్షలపై లోతైన అవగాహనను పెంపొందించడానికి మార్గాలను సుగమం చేస్తోంది.

 

 

*****


(రిలీజ్ ఐడి: 2263519) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी