భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తీరప్రాంత వాతావరణ

పరిశోధన ప్రయోగశాల (సీ - ఏఆర్టీ) బహిరంగ క్షేత్ర పరిశీలనా కేంద్రానికి ప్రారంభోత్సవం

నాడు పోస్టు చేయడమైనది: 01 MAY 2026 4:46PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎంవిశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సముద్ర తీర వాతావరణ పరిశోధన ప్రయోగశాల (సీఏఆర్టీ)ను ఏర్పాటు చేసిందినిరంతరసమగ్ర పరిశీలనలుపరిశోధన భాగస్వామ్యాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం తన ప్రాంగణంలో బహిరంగ క్షేత్ర  పరిశీలనా కేంద్రం  స్థాపనకు భూమిని కేటాయించింది.

భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎంరవిచంద్రన్ మే 1, 2026న  విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ జి.పిరాజశేఖర్ఐఐటిఎం డైరెక్టర్ డాక్టర్ సూర్యచంద్రరావు సమక్షంలో తీర ప్రాంత వాతావరణ పరిశోధన ప్రయోగశాల (సీఏఆర్టీకు చెందిన బహిరంగ క్షేత్ర పరిశీలనా కేంద్రాన్ని ప్రారంభించారుపరిశీలన వ్యవస్థనునమూనా అంచనాలను మెరుగుపరిచే లక్ష్యంతో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ చేపట్టిన 'మిషన్ మౌసమ్లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.

ముఖ్య అతిధి భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎంరవిచంద్రన్గౌరవ అతిధి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ జిపిరాజశేఖర్ఐఐటీఎం డైరెక్టర్ డాక్టర్ ఎసూర్యచంద్రరావుఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ,  సముద్ర శాస్త్ర విభాగాల ఆధిపతి ప్రొఫెసర్ సి.వినాయుడుఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం వి.ఆర్ రాజుఐఐటీఎం ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ బిపద్మ కుమారిలకు స్వాగతం పలకడంతో ఈ కార్యక్రమం మొదలైంది.

ఐఐటిఎం డైరెక్టర్ డాక్టర్ ఎసూర్యచంద్రరావు స్వాగత ఉపన్యాసం చేస్తూ ఐఐటిఎం పరిశోధనలు గురించితూర్పు తీరంలోని విశాఖపట్నంలో ఈ సముద్ర తీర వాతావరణ పరిశోధన ప్రయోగశాల ఏర్పాటు ప్రాముఖ్యతను గురించి వివరించారుఆంధ్ర విశ్వవిద్యాలయ వాతావరణ శాస్త్రసముద్ర శాస్త్ర విభాగంలో మొదటి దశలో అమర్చిన పరికరాలుతీరప్రాంత వాతావరణ పరిశోధనలో భాగంగా రానున్న అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ప్రొఫైలింగ్ఇన్-సిటు పరికరాల గురించి ఆయన తెలియజేశారు.

భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎంరవిచంద్రన్ఇతర ప్రముఖులు "సముద్ర తీర వాతావరణ పరిశోధన ప్రయోగశాలసమాచార పత్రాన్ని విడుదల చేశారుఈ పత్రంలో పరిశోధన లక్ష్యాలుఅమలు వ్యూహంసంస్థాగత భాగస్వామ్యంఅధునాతన వాతావరణ పరికరాలుప్రాంతీయ ప్రభావం వంటి అంశాలు ఉన్నాయివిశాఖపట్నంలోని "సముద్ర తీర వాతావరణ పరిశోధన ప్రయోగశాల"పై రూపొందించిన ఒక లఘు చిత్రాన్ని కూడా ఆయన విడుదల చేశారు

ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ జిపిరాజశేఖర్ ప్రారంభోపన్యాసం చేశారువిశాఖపట్నంలో ఈ పరిశోధన ప్రయోగశాల స్థాపనలో ఆంధ్ర విశ్వవిద్యాలయంఐఐటిఎం ఉమ్మడి కృషి ఎంతో కీలకమని ఆయన అన్నారుఐఐటిఎంఆంధ్ర విశ్వవిద్యాలయం మధ్య దీర్ఘకాలిక విజ్ఞాన భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో ఈ సదుపాయం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.

అన్ని వాతావరణ పరిస్థితులనుముఖ్యంగా తీవ్రమైన వాతావరణ మార్పులను పర్యవేక్షించడానికి 'మిషన్ మౌసమ్కింద ప్రస్తుత పరిశీలనా సామర్థ్యాన్ని (ప్రాంతీయకాలక్రమ పద్ధతులలోమెరుగుపరచడానికి భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ప్రణాళికలుకార్యక్రమాలను కార్యదర్శి ఎంరవిచంద్రన్ వివరించారుదీనివల్ల వాతావరణ అంచనాలు మరింత కచ్చితంగా అందుతాయని ఆయన పేర్కొన్నారుభూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సంస్థలురాష్ట్ర విశ్వవిద్యాలయాల మధ్య మరింత సహకారం అవసరాన్ని ఆయన ప్రముఖంగా తెలిపారు.  

ఈ ప్రయోగశాల నుంచి  మొదటి పరిశీలన ప్రారంభ సంకేతంగా భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శిఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ఐఐటిఎం డైరెక్టర్ కలిసి ఒక వాతావరణ బెలూన్‌ను ఆకాశంలోకి వదిలారుఈ ప్రాంగణంలో ఇంపాక్ట్ డిస్డ్రోమీటర్, 2-డైమెన్షనల్ వీడియో డిస్డ్రోమీటర్ (2డీవీడీ), 3డీ ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (3 డీపీఏడబ్ల్యూఎస్), కన్వెన్షనల్ ఏడబ్ల్యూఎస్ఎడ్డీ కోవేరియన్స్ టవర్ వంటి ఇతర పరికరాలను కూడా అమర్చారువిశాఖపట్నంలో నేడు కురిసిన తొలి ఉరుములతో కూడిన జల్లుల వివరాలను ఈ పరికరాలు నమోదు చేశాయిఇలాంటి పరికరాలు వర్షపు బిందువుల పరిమాణాలుఆకారాలు సహా వాటి పంపిణీని అధిక రిజల్యూషన్‌లో పరిశీలించడానికివర్ష సూక్ష్మభౌతిక లక్షణాలుటర్బ్యులెన్స్ ఫ్లక్స్‌లుగాలి సమాచారాన్ని స్పష్టంగా  సేకరించడానికి సహాయపడతాయిఇవి ప్రక్రియల అవగాహనను మెరుగుపరచడంలోనే కాకుండాసంఖ్యాత్మక నమూనాల ద్వారా కచ్చితమైన అంచనాలు రూపొందించడానికి ఈ సమాచారం ఎంతో కీలకం.

ఈ ప్రయోగశాల కోసం భవిష్యత్తులో సమకూర్చబోయే స్కానింగ్ విండ్ లైడార్పోలారిమెట్రిక్ క్లౌడ్ ప్రెసిపిటేషన్ డాప్లర్ రాడార్లుఫేజ్ అరే రాడార్లుప్రోటాన్ ట్రాన్స్‌ఫర్ రియాక్షన్ మాస్ స్పెక్ట్రోమీటర్ వంటి పరికరాలు వాతావరణాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికే కాకుండాప్రకృతి వైపరీత్యాలను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేయడానికి సహాయపడతాయి.

ఈ తీర ప్రాంత వాతావరణ పరిశోధన ప్రయోగశాల  జాతీయ వినియోగదారుల సదుపాయంగా సేవలందిస్తుందిఇది వేడి గాలి మేఘంగా మారి వర్షం కురిసే ప్రక్రియ నిర్ధారణకు తోడ్పడే పరిశోధనా పరిశీలనను అందిస్తుందివాతావరణ అంచనా నమూనాలలో పారామీటరైజేషన్ విధానాలను మెరుగుపరుస్తుందిముందస్తు అంచనా సామర్థ్యాన్ని పెంచడానికినమూనా మూల్యాంకనం కోసం డేటా అసిమిలేషన్ ప్రయోగాలను సాధ్యం చేస్తుందితుపాన్లుతీవ్రమైన వాతావరణ పరిస్థితులపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా విపత్తు నిర్వహణకు  ఎంతగానో సహకరిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2257414) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी