గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కీలక ఖనిజాల భద్రతలో భారత్ ముందడుగు… రీసైక్లింగ్ పథకానికి అర్హత పొందిన 58 కంపెనీలు

నాడు పోస్టు చేయడమైనది: 30 APR 2026 5:03PM by PIB Hyderabad

భారత కీలక ఖనిజాల భద్రతను బలోపేతం చేయడంపునరుపయోగ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం దిశగా కీలక ముందడుగు పడిందికీలక ఖనిజాల రీసైక్లింగ్ ప్రోత్సాహక పథకం కింద గనుల మంత్రిత్వ శాఖ అర్హత మదింపును పూర్తి చేసిందిఈ పథకంలో పాల్గొనడానికి 58 కంపెనీలు అర్హత పొందాయి.

జాతీయ కీలక ఖనిజాల మిషన్ కింద మొత్తం రూ. 1,500 కోట్ల వ్యయంతో కూడిన ఈ పథకాన్ని వివరణాత్మక కార్యాచరణ మార్గదర్శకాల జారీతో 2025 అక్టోబర్ 2న ప్రకటించారులిథియం-అయాన్ బ్యాటరీలు-వ్యర్థాలుపారిశ్రామిక స్క్రాప్ నుంచి కీలక ఖనిజాల దేశీయ రీసైక్లింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం దీని లక్ష్యందీని ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గడం సహా... పరిశుద్ధ ఇంధన రంగానికిఅధునాతన తయారీ రంగాలకు మద్దతు లభిస్తుంది.

అక్టోబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు చేపట్టిన దరఖాస్తుల స్వీకరణకు పరిశ్రమ భాగస్వాముల నుంచి మంచి స్పందన లభించిందిఅందిన ప్రతిపాదనల పరిశీలనను ఈ పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీజవహర్‌లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ డిజైన్ సెంటర్‌లు పూర్తి చేశాయి.

ఈ పరిశీలనల ఆధారంగాకార్యనిర్వాహక కమిటీ (ఈసీమొత్తం 58 సంస్థలను అర్హత గలవిగా ఆమోదించిందివీటిలో 30.03.2026న 20 సంస్థలు29.04.2026న జరిగిన సమావేశంలో 38 సంస్థలు ఆమోదం పొందాయిసుమారు 850 కేటీపీఏ హామీ సామర్థ్యంసుమారు రూ. 5,000 కోట్ల పెట్టుబడి హామీతో... ఎంపికైన ఈ సంస్థలు బ్యాటరీ రీసైక్లింగ్-వ్యర్థాల ప్రాసెసింగ్ఇతర వ్యర్థాల నుంచి రికవరీ వంటి కీలక రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయిఇది భారత కీలక ఖనిజాల రీసైక్లింగ్ వ్యవస్థను నిర్మించడంలో పరిశ్రమల బలమైన ఆసక్తినిఊపును ప్రతిబింబిస్తుంది.

ఈ పథకం తదుపరి దశ ప్రాజెక్టు అమలులో... ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించడం కోసం అర్హత కలిగిన సంస్థల సామర్థ్య వృద్ధినిఉత్పత్తి ప్రారంభాన్ని పరిగణిస్తారు.

 

***


(రిలీజ్ ఐడి: 2257137) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी