బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత ఇంధన భద్రత బలోపేతం: చారిత్రాత్మక తొలి అడుగు - అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ నిబంధనలతో బొగ్గు గని అభివృద్ధి ఒప్పందాలపై సంతకాలు

నాడు పోస్టు చేయడమైనది: 28 APR 2026 6:20PM by PIB Hyderabad

భారతదేశ ఇంధన మార్పుస్వయం సమృద్ధి దిశలో ఒక మైలురాయిగాబొగ్గు మంత్రిత్వ శాఖ ఈరోజు నాలుగు బొగ్గు గనులకు ఎంపికైన బిడ్డర్లతో బొగ్గు గని/బ్లాక్ ఉత్పత్తి అభివృద్ధి ఒప్పందాల (సీఎండీపీఏపై సంతకాలు చేసిందిఇది భారతదేశంలో అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీనిబంధనలను అంతర్గతంగా కలిగి ఉన్న వాణిజ్య బొగ్గు గనుల మొదటి విడతగా చరిత్ర సృష్టించిందిఈ చారిత్రాత్మక అడుగుభారతదేశం తన విస్తారమైన బొగ్గు నిల్వల పూర్తి విలువను ఎలా ఆవిష్కరించుకోవాలనే దృష్టిలో ఒక మార్పుదాయక ముందడుగును సూచిస్తోంది.

పద్నాలుగో విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రక్రియలో భాగంగా ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నారురెచర్లచింతలపూడి సెక్టార్ ఏ-వన్ గనులను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దక్కించుకోగాబెల్పహార్ డిప్ ఎక్స్‌టెన్షన్తంగర్దిహి ఈస్ట్ బొగ్గు గనులను యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేజిక్కించుకుందిఈ గనులు ఆంధ్రప్రదేశ్ఒడిశా రాష్ట్రాల్లో ఉన్నాయివీటిలో రెండు గనులు పాక్షికంగారెండు గనులు పూర్తిగా అన్వేషణ జరిపినవి.   

యూసీజీ బొగ్గు వినియోగంలో విప్లవాత్మక పద్ధతిసాంప్రదాయ గనుల తవ్వకం అవసరం లేకుండాబొగ్గు పొరలలోనే బొగ్గును కృత్రిమ వాయువుగా మారుస్తుందిసాంప్రదాయ వెలికితీత పద్ధతులతో ఆర్థికంగా సాధ్యపడని లోతైనపలుచనిపనికిరాని బొగ్గు పొరల నుంచి ఈ సాంకేతికత ఇంధనాన్ని వెలికితీస్తుందిఇది భారత ఇంధన వనరుల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.

బొగ్గు గని ఉత్పత్తిఅభివృద్ధి ఒప్పందాలలో మొదటిసారిగా యూసీజీ నిబంధనలను చేర్చడం ద్వారాబొగ్గు మంత్రిత్వ శాఖ ఈ గనులను భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేసిందితద్వారా నిర్వాహకులు సాంప్రదాయ వెలికితీతతో పాటుస్వచ్ఛమైనమరింత సమర్థవంతమైన ఇంధన ఉత్పత్తి కోసం ఈ అత్యాధునిక మార్గాన్ని అనుసరించడానికి వీలు కలుగుతుంది.

యూసీజీ నిబంధనలను ప్రవేశపెట్టడం దేశీయ బొగ్గు ఉత్పత్తిని గరిష్ఠం చేయటమే కాకుండాబొగ్గులో ఉండే ఉత్పన్న పదార్థాల సామర్థ్యాలకు ప్రత్యామ్నాయం చూపడం ద్వారా బొగ్గు ఆర్థిక వ్యవస్థకు విలువను పెంచాలనే భారత నిబద్ధతను ప్రతిబింబిస్తుందియూసీజీ ద్వారా తయారయ్యే వాయువుయూరియా అమ్మోనియా తయారీకి దేశీయ ముడి సరుకుగా ఉపయోగపడుతుందిఇది ఎరువుల దిగుమతిపై భారత్ ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించి ఆహార భద్రతను బలోపేతం చేస్తుంది.

రసాయన,  పెట్రోరసాయన  రంగాలలో యూసీజీ సింథసిస్ గ్యాస్ (సింగ్యాస్దిగుమతి చేసుకునే సహజ వాయువు,  నాఫ్తా స్థానంలో ప్రాథమిక ముడి పదార్థంగా దేశంలోనే  మెథనాల్,  డైమిథైల్ ఈథర్ సింథటిక్ ఇంధనాల ఉత్పత్తిని సాధ్యమయ్యేలా చేస్తుంది.

ఈ నాలుగు బొగ్గు గని/బ్లాక్ ఉత్పత్తి అభివృద్ధి ఒప్పందాలతో వాణిజ్య బొగ్గు వేలం కింద సంతకం చేసిన మొత్తం ఒప్పందాల సంఖ్య 138 గనులకు చేరుకుందిఇవి 331.544 ఎంపీటీఏ గరిష్ట రేటెడ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయిఈ 138 గనులు సుమారు రూ. 42,980 కోట్ల వార్షిక రాబడిని ఆర్జిస్తాయనిరూ. 48,231 కోట్ల మూలధన పెట్టుబడులను ఆకర్షిస్తాయనిసుమారు 4,34,175 మందికి ప్రత్యక్షపరోక్ష ఉపాధిని కల్పిస్తాయని అంచనా.

దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంపొందించడానికిదీర్ఘకాలిక ఇంధన భద్రత కల్పించడానికి పారదర్శకమైనపెట్టుబడిదారులకు అనుకూలమైన వేలం ప్రక్రియల ద్వారా సామాజికఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ దృఢ నిశ్చయంతో ఉందిఇందుకోసం ప్రపంచ ఇంధన రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు యూసీజీ వంటి అధునాతన సాంకేతికతలను కూడా స్వీకరిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2256397) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi