రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కిర్గిస్థాన్‌లోని బిష్కెక్‌లో ఎస్సీవో రక్షణ మంత్రుల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించనున్న రక్షణ మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 APR 2026 11:14AM by PIB Hyderabad

కిర్గిస్థాన్‌లోని బిష్కెక్‌లో 2026 ఏప్రిల్ 28న జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవోరక్షణ మంత్రుల సమావేశానికి భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి భారత ప్రతినిధి బృందం హాజరుకానుంది. వివిధ సభ్య దేశాల రక్షణ మంత్రులు ఈ ప్రాంత రక్షణభద్రతకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అంతర్జాతీయ శాంతి, ఉగ్రవాద నిరోధక చర్యలు, రక్షణ సహకారానికి సంబంధించిన అంశాలపై కూడా ఎస్సీవో సభ్య దేశాలు చర్చిస్తాయి.

పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ గందరగోళం నేపథ్యంలో ఈ ఏడాది ఎస్సీవో సమావేశం జరుగుతోంది. ఈ ప్రాంత అతిపెద్ద రాజకీయ, ఆర్థిక సంస్థల్లో ఒకటైన ఎస్సీవోలో... ప్రస్తుత ఘర్షణ ప్రభావాన్ని తగ్గించే చర్యలపై చర్చించే అవకాశముంది.

ప్రస్తుత అంతర్జాతీయ భద్రతా సవాళ్ల నేపథ్యంలో... ప్రపంచ శాంతికి భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి ఈ సమావేశంలో స్పష్టం చేస్తారు. ఉగ్రవాదాన్నితీవ్రవాదాన్ని ఎంతమాత్రమూ సహించబోమన్న భారత్ స్థిరమైన వైఖరిని వివరిస్తారు. సమావేశం సందర్భంగా... సమావేశంలో పాల్గొంటున్న వివిధ దేశాల రక్షణ మంత్రులతో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించే అవకాశముంది.

చైనాలోని షాంఘైలో 2001 జూన్ 15న స్థాపించిన ఒక అంతర్జాతీయ ప్రభుత్వాంతర్గత సంస్థ ఎస్సీవో. భారత్, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, పాకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్, బెలారస్ ఇందులో సభ్యదేశాలు. భారత్ 2017లో ఇందులో పూర్తిస్థాయి సభ్య దేశంగా మారింది. ఏటా ఒక్కో దేశం అధ్యక్షత వహించే ఎస్సీవోకు 2023లో భారత్ అధ్యక్షత వహించింది.

***


(రిలీజ్ ఐడి: 2255974) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati