నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అవార్డింగ్ బాడీగా (ఏబీ - డ్యూయల్) ఎన్‌సీవీఈటీ గుర్తింపు కోసం ఒప్పందం చేసుకున్న తెలంగాణ ఉపాధి-శిక్షణ శాఖ, ఎన్‌సీవీఈటీ

నాడు పోస్టు చేయడమైనది: 24 APR 2026 6:39PM by PIB Hyderabad

తెలంగాణ విద్యా-శిక్షణ సంస్థ (డీఈటీ)కి అవార్డింగ్ బాడీ (ఏబీ - డ్యూయల్)గా ఎన్‌సీవీఈటీ గుర్తింపు ఇవ్వడం కోసం 24.04.2026న జాతీయ వృత్తి విద్యా-శిక్షణ మండలి (ఎన్‌సీవీఈటీ), తెలంగాణ ఉపాధి-శిక్షణ శాఖ, తెలంగాణ సంస్థలు, ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ గుర్తింపు ద్వారా, తెలంగాణ రాష్ట్రంలో డీఈటీ ఆమోదించిన, స్వీకరించిన అర్హతల కోసం, దాని యాజమాన్యంలో, పూర్తి నిర్వహణలో ఉన్న క్యాంపస్‌లు, శిక్షణా కేంద్రాల్లో అవార్డింగ్ బాడీ ద్వారా నేరుగా శిక్షణ అందిస్తున్న సంస్థల్లోని అభ్యాసకులకు అవార్డులు ప్రదానం చేయడానికి, మూల్యాంకనం చేయడానికి, ధ్రువీకరించడానికి డీఈటీ అర్హత పొందుతుంది.

ఈ ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమానికి ఎమ్ఎస్‌డీఈ కార్యదర్శి, ఎన్‌సీవీఈటీ ఛైర్‌పర్సన్ శ్రీమతి దేబాశ్రీ ముఖర్జీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్‌సీవీఈటీ కార్యనిర్వాహక సభ్యులు ప్రొఫెసర్ అశోక్ కుమార్ గాబా, ఎన్‌సీవీఈటీ రికగ్నిషన్ డైరెక్టర్, లెఫ్టినెంట్ కల్నల్ విక్రమ్ సింగ్ భాటి హాజరయ్యారు.

అవార్డింగ్ బాడీ (ఏబీ - డ్యూయల్)గా ఎన్‌సీవీఈటీ గుర్తింపు పొందిన డీఈటీ తెలంగాణ సంస్థ... ఐటీఐలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు), ఎంప్యానెల్డ్ శిక్షణా భాగస్వాముల ద్వారా స్వల్పకాలిక, పరిశ్రమకు అనుగుణమైన కోర్సుల్లో శిక్షణార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఐఓటీ ఆధారిత స్మార్ట్ అగ్రికల్చర్, ఐఓటీ హెల్త్‌కేర్, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డ్రోన్ టెక్నాలజీ, ఏఆర్/వీఆర్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ వంటి రంగాలు ఈ కార్యక్రమాల ప్రధాన ప్రాధాన్యతా రంగాలుగా ఉంటాయి.

రోబోటిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్, విద్య, ఐఓటీ వంటి రంగాల్లో గణనీయ పురోగతిని కలిగి ఉన్న ఎలక్ట్రానిక్స్-హార్డ్‌వేర్ రంగంలోని “ఇంటిగ్రేటెడ్ స్టెమ్ సిస్టమ్స్ డిజైన్ - ప్రోటోటైపింగ్ జూనియర్ టెక్నీషియన్” అనే డీఈటీ అర్హతను ఎన్‌సీవీఈటీ ఇప్పటికే ఆమోదించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2255511) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी