పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీ విమానాశ్రయంలో మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన ఆసక్తిదారులతో ఉన్నత స్థాయి సమావేశం


హబ్ అండ్ స్పోక్ కార్యకలాపాల సన్నద్ధతను సమీక్షించిన పౌర విమానాయాన శాఖ మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 APR 2026 10:04PM by PIB Hyderabad

ఢిల్లీ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ కార్యకలాపాల అమలుపై పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఈ రోజు సమీక్షించారుఆయన అధ్యక్షతన విమానయాన రంగానికి చెందిన వివిధ సంస్థలతో విమానాశ్రయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో.. పౌర విమానయాన శాఖ కార్యదర్శితోపాటు హోం శాఖపౌర విమానయాన శాఖఇమ్మిగ్రేషన్ బ్యూరో (బీవోఐ), పౌర విమానయాన భద్రతా బ్యూరో (బీసీఏఎస్), కస్టమ్స్భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ), పౌర విమానయాన డైరెక్టొరేట్ జనరల్ (డీజీసీఏ), సీఐఎస్ఎఫ్డిజియాత్రఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్

(డీఐఏఎల్), ప్రముఖ విమానయాన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రయాణికుల రాకపోకల స్థితిగతులను మంత్రి పరిశీలించారు. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-3లోని సెక్యూరిటీ హోల్డ్ ఏరియాను కూడా తనిఖీ చేసిఅక్కడి కార్యకలాపాల సన్నద్ధతను సమీక్షించారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నేతృత్వంలో జాతీయ పౌర విమానయాన విధానం (ఎన్‌సీఏపీ)-2016ను ప్రభుత్వం రూపొందించింది. 2030 నాటికి భారతీయ ప్రయాణికులకుఅలాగే 2047 నాటికి ప్రపంచానికి భారత్‌ను ఒక అగ్రశ్రేణి వైమానిక కేంద్రంగా నిలపడం లక్ష్యంగా స్పష్టమైన ప్రణాళికను ఈ విధానం సిద్ధం చేసిందిఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో.. అంతర్జాతీయ విమానయాన కేంద్ర వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించిందిదీని కింద పలు కీలక చర్యలు చేపట్టిందివిదేశీ విమానయాన సంస్థలకు పాయింట్స్ ఆఫ్ కాల్‌ల మంజూరులో (ముఖ్యంగా మెట్రోయేతర నగరాల్లోక్రమబద్ధమైన విధానాన్ని అనుసరించడంభారతీయ విమానయాన సంస్థలను బలోపేతం చేస్తూ.. దేశీయ వైమానిక కేంద్రాలను ప్రోత్సహించేలా ద్వైపాక్షిక ఒప్పందాలను పునఃసమీక్షించడంభారతీయ విమానాయాన సంస్థలు తమ అంతర్జాతీయ పరిధిని విస్తరించుకునేందుకు వీలుగా దేశీయ కోడ్-షేర్ ఒప్పందాలను సరళీకరించడం వంటివి ఇందులో ఉన్నాయి.

 

 

చర్చల సందర్భంగా మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘‘తూర్పుపశ్చిమార్థ గోళాల నడుమ విశిష్టమైన భౌగోళిక స్థానంలో భారత్ ఉందిఅంతర్జాతీయ రవాణా కేంద్రంగా ఎదగడానికి మనకిది సహజసిద్ధమైన సానుకూలతను అందిస్తోందిభాగస్వామ్య పక్షాలన్నింటితో విస్తృతంగా చర్చించి ఈ వ్యూహాన్ని రూపొందించాంఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లడంలో క్రియాశీలకమైన మద్దతును అందించిన గౌరవ కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని అన్నారు.

 

 

హబ్ అండ్ స్పోక్ నమూనా ప్రాధాన్యాన్ని మంత్రి వివరించారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో రూపొందించిన ‘ఉడాన్’ పథకం ద్వారా ద్వితీయతృతీయ శ్రేణి నగరాల్లో అభివృద్ధి చేసిన విమానాశ్రయాలను.. అంతర్జాతీయ గమ్యస్థానాలతో అనుసంధానించడానికి ఈ విధానం వీలు కల్పిస్తుందన్నారుదీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండాదేశవ్యాప్తంగా ఇప్పటికే అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడానికి ప్రయాణికులకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

తుది గమ్యస్థానంగా కాకుండా అంతర్జాతీయ రవాణా కేంద్రంగా ఎదిగే దిశగా భారత వైమానిక రంగంలో వస్తున్న మార్పును ఈ హబ్ అండ్ స్పోక్ వ్యూహం స్పష్టం చేస్తోందితద్వారా ప్రస్తుతం విదేశీ కేంద్రాల ద్వారా జరుగుతున్న ప్రయాణికుల రాకపోకల్లో గణనీయమైన వాటాను భారతీయ విమానాశ్రయాలు పొందేందుకు అవకాశం లభిస్తుంది.

 

హబ్‌గా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని స్పష్టం చేస్తూ.. మంత్రి రామ్మోహన్ నాయుడు ఇలా పేర్కొన్నారు: ‘‘ప్రస్తుతం భారత్ నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారిలో దాదాపు 35 శాతం మంది దుబాయ్లండన్సింగపూర్ వంటి విదేశీ విమానయాన కేంద్రాల మీదుగా ప్రయాణిస్తున్నారుఢిల్లీముంబయిబెంగళూరుహైదరాబాద్కలకత్తాచెన్నై వంటి భారతీయ ప్రధాన కేంద్రాలను ప్రపంచస్థాయిలో పోటీ పడే విమానయాన కేంద్రాలుగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ధోరణిలో పూర్తిగా మార్పును తీసుకురావడమే మా లక్ష్యం”

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదాహరణగా పేర్కొంటూ... ‘‘ఏడాదికి 100 మిలియన్లకు పైగా ప్రయాణికుల సామర్థ్యంతో ఢిల్లీ విమానాశ్రయం ప్రత్యేకతను చాటుకుంటోందిఉత్తర ప్రాంతంలోని మొత్తం ప్రయాణికుల రాకపోకల్లో దాదాపు 50 శాతం వాటాఅలాగే రోజూ దాదాపు 50,000 ప్రయాణికులతో సహజంగానే అది ఒక ‘కేంద్రీయ (హబ్విమానాశ్రయం’గా నిలుస్తోంది’’ అని మంత్రి చెప్పారు.

 

ప్రయాణికుల సౌకర్యాలతోపాటు.. విమానాల్లో సరుకు రవాణాకు అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ను బలోపేతం చేయడంపై ఈ వ్యూహం ప్రధానంగా దృష్టి సారిస్తుందిఒక విమానం నుంచి మరో విమానానికి మార్చే చేసే సరుకును మళ్లీ మళ్లీ తనిఖీలు చేయాల్సిన అవసరం లేకుండా నిబంధనలను తొలగించడంకార్గో సంబంధిత అనుమతులు పత్రాల ప్రక్రియను డిజిటలీకరించడం వంటి చర్యలు.. సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడమే కాకుండాసరుకు నిర్వహణ సమయాన్నీ తగ్గిస్తాయని భావిస్తున్నారు.

 

‘‘హబ్ అండ్ స్పోక్ నమూనా ద్వారా ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడమే కాకుండాదీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలనూ కలిగిస్తుందిదీనివల్ల 2047 నాటికి ప్రత్యక్షంగాపరోక్షంగా దాదాపు 1.6 ఉద్యోగాలు లభిస్తాయనీభారత ఆర్థిక వ్యవస్థకు దాదాపు 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఇది దోహదపడుతుందనీ అంచనా వేస్తున్నాం’’ అంటూ ఈ నమూనా ప్రాధాన్యాన్ని మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు వివరించారు.

 

హబ్ అండ్ స్పోక్ నమూనా అమలు ద్వారా విమానయాన సంస్థలు తమ విమానాలను అంతర్జాతీయ కార్యకలాపాల కోసం మరింత సమర్థంగా వినియోగించుకోవడానికి వీలవుతుందిఅలాగే కస్టమ్స్ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను ప్రాంతీయ కేంద్రాలకు వికేంద్రీకరించడం ద్వారా.. ప్రధాన విమానాశ్రయాల్లో రద్దీని తగ్గించడానికి కూడా ఈ విధానం దోహదపడుతుంది.

 

సంబంధిత విభాగాల క్రియాశీల భాగస్వామ్యాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారుభారతీయ విమానయాన సంస్థలు భారీ (వైడ్ బాడీవిమానాల కోసం గణనీయంగా ఆర్డర్లు ఇవ్వడాన్ని స్వాగతించారుఇవి సుదూర ప్రయాణ అనుసంధానాన్ని మెరుగుపరచడంతోపాటు హబ్ కార్యకలాపాలకూ తోడ్పడతాయన్నారుఅదే సమయంలో ప్రయాణికులు వేగంగాసమర్థంగా విమానాలు మారేందుకు వీలుగా.. స్లాట్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియను ఢిల్లీ విమానాశ్రయం ప్రారంభించిందని తెలిపారుడిజియాత్ర వంటి సాంకేతిక మార్గాలను వినియోగించడం ద్వారా.. ముఖ్యంగా దేశీయఅంతర్జాతీయ విభాగాల మధ్య మారే ప్రయాణికుల రాకపోకలను మరింత క్రమబద్ధీకరించవచ్చని మంత్రి పేర్కొన్నారు.

 

హబ్ అండ్ స్పోక్ నమూనాలో భాగంగా.. వివిధ చిన్న నగరాల నుంచి వచ్చే ప్రయాణికులను ఒక క్రమబద్ధమైన పద్ధతిలో సమీకరించిఢిల్లీ వంటి ప్రధాన హబ్ విమానాశ్రయాల ద్వారా అంతర్జాతీయ ప్రయాణాల కోసం పంపిస్తారుఇక్కడి నుంచి బయల్దేరే విమానాల్లో దేశీయ ప్రయాణికులతోపాటు అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు కూడా ఉంటారు.

 

ప్రయాణం ప్రారంభించే విమానాశ్రయంలోనే వారికి రెండు వేర్వేరు బోర్డింగ్ పాస్‌లను జారీ చేస్తారువీటిపై ‘డీ’ (దేశీయ), ‘ఐ’ (అంతర్జాతీయఅని స్పష్టంగా పేర్కొంటారువిదేశాలకు వెళ్లే ప్రయాణికులకు కస్టమ్స్ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు.. వారు దేశం నుంచి బయటకు వెళ్లే మొదటి పాయింట్ వద్దఅంటే పరిధీయ (స్పోక్విమానాశ్రయంలో పూర్తవుతాయిఆ ప్రయాణికులకు ప్రయాణ సమయంలో కస్టమ్స్ డిక్లరేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉండవు.

 

దేశంలోకి తిరిగి వచ్చే ప్రయాణికుల విషయానికి వస్తే.. కస్టమ్స్ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు వారు దేశంలోకి వచ్చిన తుది పాయింట్ వద్దఅంటే స్పోక్ విమానాశ్రయంలో జరుగుతాయిఈ నమూనా ప్రకారం.. లోనికి వచ్చేబయటికి వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికుల లగేజీని కేంద్రీయ (హబ్విమానాశ్రయంలోని అంతర్గత కార్యకలాపాల (ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ద్వారా సజావుగా బదిలీ చేస్తారుదీంతో ప్రయాణికుల ప్రమేయం అవసరముండదుకార్యకలాపాల సమర్థతనిబంధనల్లో స్పష్టత కోసం.. కాంబినేషన్ విమానాలను అనుమతించబోరుహబ్ అండ్ స్పోక్ కార్యకలాపాల్లో దేశీయఅంతర్జాతీయ విభాగాల కోసం వేర్వేరు విమానాలను కేటాయిస్తారు.

 

భారతదేశ వ్యూహాత్మక భౌగోళిక ప్రాధాన్యాన్ని, వేగంగా పెరుగుతున్న విమానయాన సామర్థ్యాన్ని గుర్తించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2255218) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी