రక్షణ మంత్రిత్వ శాఖ
ఉపయోగానికి సిద్ధంగా సుల్తాన్‌పూర్ - పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే - ఈఎల్ఎఫ్
నాడు పోస్టు చేయడమైనది:
23 APR 2026 1:39PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని (ఈఎల్ఎఫ్) భారత వైమానిక దళం ఉపయోగానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 22వ తేదీన ఈ మేరకు అవసరమైన పరీక్షలను నిర్వహించారు.
ఈఏఎఫ్ విమానాల అత్యవసర ల్యాండింగ్ విన్యాసాలను వీక్షించేందుకు యూపీ పంచాయతీ రాజ్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఓం ప్రకాశ్ రాజ్‌భర్, సీఏసీ, ఏఓసీ-ఇన్-సీ ఎయిర్ మార్షల్ బి. మణికంఠన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
భారత వైమానిక దళ కార్యాచరణ వైవిధ్యాన్ని జగ్వార్, మిరాజ్-2000, సుఖోయ్-30 ఎంకేఐ, సీ-295, ఏఎన్-32 వంటి భిన్న రకాల విమానాలతో పాటు ఎంఐ-17 వీ5 హెలికాప్టర్, గరుడ్ కమాండో బృందాల ద్వారా ప్రదర్శించింది. ఐఏఎఫ్, యూపీఈఐడీఏ, స్థానిక పౌర పరిపాలన విభాగాలతో కలిసి రాత్రింబవళ్లు సాధ్యమైనంత తక్కువ సమయంలో అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా అవసరమైన ప్రామాణిక కార్యాచరణ విధానాలను విజయవంతంగా పరీక్షించింది.
సాధారణ రన్‌వేలు అందుబాటులో లేనప్పుడు కూడా ఆటంకం లేకుండా కార్యకలాపాలను చేపట్టగల ఐఏఎఫ్ సామర్థ్యాన్ని ఈ ఆపరేషన్ భారీగా పెంచింది. దాని కార్యాచరణ స్థితిస్థాపకతను ప్రదర్శించింది. స్వల్ప వ్యవధిలోనే ఇటువంటి ఎక్స్‌ప్రెస్‌వే ఎయిర్‌స్ట్రిప్‌లను అందుబాటులోకి తీసుకురావటంలో వైమానిక సిబ్బంది వృత్తిపరమైన నైపుణ్యాలను, క్షేత్రస్థాయి సిబ్బంది సామర్థ్యాన్ని ఇది నిరూపించింది. జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసిన ఈ ఎయిర్‌స్ట్రిప్‌లు అత్యవసర సమయాల్లోనూ కార్యాచరణ సౌలభ్యాన్ని గణనీయంగా పెంచుతాయి. జాతీయ భద్రత, విపత్తు ప్రతిస్పందన సామర్థ్యాలను బలోపేతం చేస్తూ, కీలక బలగాల కోసం ఇవి ఉపయోగపడతాయి.
***
(రిలీజ్ ఐడి: 2254878)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8