సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఎంఎస్‌ఎంఈ రంగంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్, దక్షిన కొరియా మధ్య అవగాహన ఒప్పందం

నాడు పోస్టు చేయడమైనది: 21 APR 2026 7:20PM by PIB Hyderabad

రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యూంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉంది. ఈ సందర్భంగా ఎంఎస్‌ఎంఈ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ.. కొరియా ఎంఎస్ఎంఈలు,  స్టార్టప్‌ల మంత్రిత్వ శాఖతో ఏప్రిల్‌ 20, 2026న ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం రెండు మంత్రిత్వ శాఖల మధ్య సహకారం కోసం ఒక నిర్మాణాత్మక విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఎంఎస్‌ఎంఈ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై నిరంతర చర్చలకు వీలు కల్పిస్తుంది. పరస్పర ప్రయోజనకరమైన అవకాశాలను అన్వేషించడంలో తోడ్పడుతుంది. ఇరు దేశాల ఎంఎస్‌ఎంఈ వ్యవస్థలపై లోతైన అవగాహనను పెంపొందించడానికి, సంబంధిత వాటాదారుల మధ్య భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తుంది.

సమాచారం, నిపుణుల మార్పిడి, ఉత్తమ విధానాల భాగస్వామ్యం, వ్యాపార అనుసంధానాలు, సాంకేతిక-ఆర్థిక సహకారం ద్వారా వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడం ఈ ఒప్పంద లక్ష్యం. ఇది ఇరు దేశాల ఎంఎస్‌ఎంఈల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఉమ్మడి కార్యక్రమాలకు కూడా మద్దతు ఇస్తుంది.

భారత్-కొరియా ఆర్థిక సహకారాన్ని మరింత పెంపొందించే దిశగా ఈ భాగస్వామ్యం కీలక ముందడుగు. సమగ్ర వృద్ధి, ఆవిష్కరణలు, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించే ఎంఎస్‌ఎంఈలకు సాధికారత కల్పించడంలో ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2254336) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी