శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ దిశగా సమూల మార్పులను చూస్తున్న ప్రపంచం.. కనుమరుగవుతోన్న వ్యర్థాలు: డాక్టర్ జితేంద్ర సింగ్

స్వచ్ఛతా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ-వ్యర్థాలతో పాటు పాత సామాను అమ్మటం ద్వారా ప్రభుత్వానికి రూ.4,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్న మంత్రి

రీసైక్లింగ్, బయో టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణల మద్దతుతో అభివృద్ధి చెందుతున్న పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ నమూనా.. వివిధ రంగాల్లో పారిశ్రామిక వృద్ధి, స్థిరత్వానికి కొత్త అర్థాన్నిస్తుందన్న మంత్రి

భారత పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ మార్పును వేగవంతం చేస్తున్న విధానపరమైన మద్దతు, అంకుర సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యం

నాడు పోస్టు చేయడమైనది: 20 APR 2026 6:11PM by PIB Hyderabad

కేంద్ర శాస్త్రసాంకేతికభూవిజ్ఞాన శాఖ (స్వతంత్ర బాధ్యతసహాయమంత్రిఎంఓఎస్ పీఎంసిబ్బందిప్రజా ఫిర్యాదుల శాఖ, పెన్షన్లుఅణుశక్తి అంతరిక్షయాన శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ దిశగా సమూల మార్పును చూస్తోందన్నారుఆర్థిక పరంగా ఆలోచనా దృక్పథంలో నిర్ణయాత్మక మార్పు వచ్చిందనిదీనిద్వారా వ్యర్థాలు కనుమరుగవుతాయని పేర్కొన్నారుప్రతి నిరుపయోగ వస్తువును ఆర్థిక విలువ సృష్టించే వనరుగా చూడటం పెరుగుతోందని తెలిపారుస్వచ్ఛతా ప్రచారంలో భాగంగా సేకరించిన ఈ-వ్యర్థాలుపాత సామాగ్రిని విక్రయించటం ద్వారా ప్రభుత్వానికి రూ.4,000 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆయన ఉదహరించారు.

రీసైక్లింగ్బయో టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణ తోడ్పాటుతో రూపుదిద్దుకుంటున్న ఈ పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ నమూనా వివిధ రంగాల్లో పారిశ్రామిక వృద్ధిసుస్థిరతకు కొత్త రూపమివ్వనుందని మంత్రి తెలిపారు.

వనరుల సామర్థ్యంపునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించిన రెండో అంతర్జాతీయ సదస్సుఅవార్డుల కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారుఈ కార్యక్రమంలో ప్రభుత్వంపరిశ్రమలుపరిశోధనా సంస్థలుఅంతర్జాతీయ ప్రతినిధులతో పాటు యూరోపియన్జర్మనీ రాయబార కార్యాలయ ప్రతినిధులురిసోర్స్ ఎఫిషియన్సీ అండ్ సర్క్యులర్ ఎకానమీ ఇండస్ట్రీ అలయన్స్‌కు చెందిన కీలక భాగస్వాములు పాల్గొన్నారు.

కొన్నేళ్లుగా పర్యావరణ సంబంధిత చర్చల్లో గణనీయమైన మార్పులు వచ్చాయనిపర్యావరణ పరిరక్షణ దృక్పథం నుంచి దాన్ని బలమైన ఆర్థిక కోణంతో చూసే స్థాయికి మారిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారుసుస్థిరత ద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చనే అవగాహన పెరగటం వల్లఈ ఉద్యమం పట్ల మరింత శ్రద్ధ పెరగటమే కాక ప్రజల భాగస్వామ్యం కూడా విస్తృతమైందన్నారు.

పారిశ్రామిక అభివృద్ధి తదుపరి దశ ఎక్కువగా పునర్వినియోగంబయో-టెక్నాలజీజన్యు ఆధారిత ప్రక్రియల ద్వారా సాగుతుందని మంత్రి అన్నారుఈ మార్పును ప్రపంచవ్యాప్త నిపుణులు తదుపరి పారిశ్రామిక విప్లవానికి నాందిగా పరిగణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రయోగాత్మక ఉదాహరణలను వివరిస్తూ.. ఒకప్పుడు వ్యర్థాలుగా భావించిన ప్లాస్టిక్వాడిన వంట నూనెఉక్కు వ్యర్థాల వంటి పారిశ్రామిక ఉప-ఉత్పత్తులను ఇప్పుడు విలువైన వనరులుగా మారుస్తున్నారువీటిని రోడ్ల నిర్మాణంజీవ ఇంధనాలువాణిజ్యపరంగా లాభదాయకమైన పారిశ్రామిక ఉత్పత్తులుగా మారుస్తున్నారుగతంలో ఇటువంటి వ్యర్థాల నిర్వహణకు ఖర్చులు భరించిన పరిశ్రమలు.. ఇప్పుడు వాటి నుంచే ఆర్థిక లాభాలను పొందుతున్నాయని వెల్లడించారు.

నిరంతర స్వచ్ఛతపునర్వినియోగ ప్రక్రియలు ఇప్పటికే ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారుప్రత్యేక దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రస్తావిస్తూ.. కేవలం ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ ద్వారానే ప్రభుత్వానికి రూ.4,000 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారుఇది వనరుల పునర్వినియోగంలోని అవకాశాలకు నిదర్శనమన్నారు.

పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కేవలం పెద్ద పరిశ్రమలకే కాక.. గృహాలుఅసంఘటిత రంగాలుఅంకుర సంస్థలుఎంఎస్ఎంఈల వంటి ఆర్థిక వ్యవస్థలకు విస్తరిస్తాయని తెలిపారుదీనివల్ల వివిధ స్థాయుల్లో జీవనోపాధివ్యాపార అవకాశాలు కలుగుతాయన్నారు.

విస్తృత స్థాయిలో మార్పునకు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఉమ్మడి భాగస్వామ్యంప్రవర్తనలో మార్పులు అవసరమని మంత్రి అన్నారువివిధ రంగాలను ప్రోత్సహిస్తూసహకారానికి ప్రభుత్వం మద్దతిస్తున్న తరుణంలో పెట్టుబడిఆవిష్కరణలుభాగస్వామ్యం కోసం పరిశ్రమలుఅంకుర సంస్థలుపౌరులు క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

మారుతున్న ఆర్థిక విధానాల గురించి ప్రస్తావిస్తూ.. కీలక మార్పును భారత్ చూస్తోందన్నారుఇందులో భాగంగా విలువ వ్యవస్థలు కొత్తరూపుని సంతరించుకుంటున్నాయని.. వ్యర్థాల నిర్వహణగ్రీన్ టెక్నాలజీస్పునర్వినియోగ ఉత్పాదక వ్యవస్థల్లో నూతన అవకాశాలు పుట్టుకొస్తాయని అన్నారు. 2070 నాటికి కర్బన రహితంగా మారాలన్న భారత నిబద్ధతకు ఈ మార్పు దోహదపడుతుందని తెలిపారు.

భారత సంస్కృతివ్యవసాయ రంగాల్లో సంప్రదాయ పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ గురించి బీఐఆర్ఏసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జితేంద్ర కుమార్ ప్రస్తావించారు. ఈ వారసత్వాన్ని ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలతో అనుసంధానించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారుగ్రీన్ టెక్నాలజీస్సుస్థిర పరిష్కారాలపై పనిచేసేందుకు అంకుర సంస్థలకు బీఐఆర్ఏసీ నిరంతరం మద్దతిస్తుందని తెలిపారుకార్బన్ క్రెడిట్స్ వంటి జీవనాధారిత విధానాలుచర్యలను ప్రోత్సహిస్తుందన్నారు.

వనరుల సామర్థ్యంభారత పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశ పరివర్తనను వేగవంతం చేయటానికి విధానపరమైన వ్యవస్థలుభాగస్వామ్యాలుఅమలు వ్యూహాలపై చర్చలకు వేదికగా ఈ సదస్సు నిలిచింది.

 

***


(రిలీజ్ ఐడి: 2254110) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी