రక్షణ మంత్రిత్వ శాఖ
మొరాకో కాసాబ్లాంకా నుంచి బయల్దేరిన ఐఎన్ఎస్ సుదర్శిని
प्रविष्टि तिथि:
20 APR 2026 4:01PM by PIB Hyderabad
భారతీయ నౌకాదళంలోని శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని 2026 ఏప్రిల్ 18న మొరాకోలోని కాసాబ్లాంకా సందర్శన పూర్తయింది. లోకయాన్-26 యాత్రలో భాగంగా.. ఇండో-మొరాకో నౌకా దళ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన ఓ ముఖ్యమైన విజయంగా నిలిచింది.
ఈ సందర్భంగా పరస్పర శిక్షణ, నౌకావాణిజ్య సహకారంపై మొరాకో నౌకాదళ అధికారులతో ఐఎన్ఎస్ సుదర్శిని కమాండింగ్ అధికారి చర్చలు జరిపారు. సహృద్భావ సందర్శనలు, స్నేహపూర్వక క్రీడా పోటీల్లో రాయల్ మొరాకన్ నేవల్ స్కూల్ క్యాడెట్లతో భారతీయ నౌకాదళ శిక్షణార్ధులు సంభాషించారు. ఇలాంటి చురుకైన శిక్షణ కార్యక్రమాల ద్వారా లోకయాన్ స్ఫూర్తి ప్రతిబింబిస్తుంది. ఐఎన్ఎస్ సుదర్శినిలో ఆతిథ్యమిచ్చిన విందు, రాయల్ మొరాకన్ నౌకాదళం ఏర్పాటు చేసిన విందు వృత్తిపరమైన, సాంస్కృతిక పరమైన సంబంధాలు బలోపేతమయ్యాయి.
ఉమ్మడి నౌకా దళాల ఆసక్తులు, వ్యూహాత్మక సంబంధాల ఆధారంగా రెండు దేశాల మధ్య ఉన్న నౌకా రక్షణ సంబంధాలను ప్రస్తుత పర్యటన బలోపేతం చేస్తుంది. వసుధైక కుటుంబం అనే సందేశాన్ని, సముద్రాల ఆవలి వరకు సద్భావనను ముందుకు తీసుకెళుతూ.. స్పెయిన్లోని పల్మాస్‌కు ఐఎన్ఎస్ సుదర్శిని బయలుదేరింది.
(3)KVGN.jpeg)
(3)QG7A.jpeg)
(3)Z6QL.jpeg)
(रिलीज़ आईडी: 2253825)
आगंतुक पटल : 83