ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉధంపూర్‌లో బస్సు ప్రమాదం.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 20 APR 2026 1:02PM by PIB Hyderabad

జమ్మూకాశ్మీర్‌.. ఉధంపూర్‌లో బస్సు దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిందిదీనిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపాన్ని తెలిపారుఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
మృతుల దగ్గరి సంబంధికులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్ఎఫ్నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారుగాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందిస్తారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది
:
‘‘
జమ్మూ కాశ్మీర్‌.. ఉధంపూర్‌లో బస్సు దుర్ఘటన కారణంగా ప్రాణనష్టం జరగడం విచారకరంఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపానుక్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
పీఎంఎన్‌ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను  మృతుల దగ్గరి సంబంధికులకు అందిస్తారుగాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందిస్తారు:  ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ’’.

 

***


(రిలీజ్ ఐడి: 2253712) సందర్శకుల సూచీ సంఖ్య : : 10