ఉప రాష్ట్రపతి సచివాలయం
మాజీ ప్రధానమంత్రి శ్రీ చంద్రశేఖర్ 99వ జయంతి.. నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
17 APR 2026 11:47AM by PIB Hyderabad
మాజీ ప్రధానమంత్రి శ్రీ చంద్రశేఖర్ 99వ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ న్యూఢిల్లీలోని జన్‌నాయక్ స్థల్‌లో శ్రీ చంద్రశేఖర్‌కు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రార్థన సభలో ఉపరాష్ట్రపతి పాల్గొని, దివంగత నేత సమాధి వద్ద పుష్పాంజలి సమర్పించారు.
శ్రీ చంద్రశేఖర్‌ను ఉపరాష్ట్రపతి స్మరించుకుంటూ, ఆయనో దార్శనిక నేత, నిర్భయ పార్లమెంటేరియన్ అని, ప్రజాస్వామ్య విలువలను గట్టిగా సమర్థించారని ప్రశంసించారు. శ్రీ చంద్రశేఖర్ ప్రజా జీవితంలో నైతిక నిష్ఠకు ప్రతీకగా నిలిచారని, సామాజిక న్యాయంతో పాటు జాతీయ ఏకత.. ఈ ఆదర్శాలకు పూర్తిగా నిబద్ధతను కనబరిచారని శ్రీ రాధాకృష్ణన్ అన్నారు.
ఈ సందర్భానికున్న ప్రాధాన్యాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, దేశం శ్రీ చంద్రశేఖర్ శతాబ్ది సంవత్సరాన్ని మొదలుపెడుతోందని, ఇది ఆయన ఎంతో ప్రాణంగా చూసుకున్న సిద్ధాంతాలైన.. సాహసం, నిరాడంబరత్వం, దేశ సంక్షేమం విషయంలో మొక్కవోని నిబద్ధతలను పరిరక్షిస్తామన్న సామూహిక సంకల్పాన్ని పునర్నవీకరించుకోవాల్సిన తరుణమన్నారు.
దేశానికి నిజాయితీతో, దృఢవిశ్వాసంతో సేవ చేసేందుకు భావి తరాల వారికి శ్రీ చంద్రశేఖర్ వారసత్వం స్ఫూర్తినివ్వగలదన్న ఆశాభావాన్ని ఉపరాష్ట్రపతి వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2252972)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10