వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ధోలేరా సెజ్‌లో మొదటి చిప్ తయారీ ప్లాంట్ ఏర్పాటును అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
16 APR 2026 4:53PM by PIB Hyderabad
గుజరాత్‌లోని ధోలేరాలో మెసర్స్ టాటా సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఐటీ, ఐటీఎస్ సేవల కోసం ప్రత్యేకంగా సెజ్ ఏర్పాటును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సుమారు 66.166 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ సెజ్ ద్వారా దాదాపు 21,000 మందికి ఉపాధి లభించనుంది. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఐటీ అనుబంధ సేవలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కార్యకలాపాలు, రవాణాను సులభతరం చేయటానికి వేగవంతమైన అనుమతుల వ్యవస్థను అందించటానికి ఈ సెజ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది భారతదేశంలోనే తొలి చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్.
గతంలో ప్రత్యేక ఆర్థిక మండలాల (సెజ్) చట్టంలో అభ్యుదయ సంస్కరణలు, నిర్దిష్ట రంగాలకు అనుగుణంగా సెజ్‌ల ఆమోదాల ద్వారా భారత సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను బలోపేతం చేయటానికి ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధిక విలువ గల భారీ మూలధన పెట్టుబడులను ప్రోత్సహించటం, ఆవిష్కరణలకు ఊతమివ్వటం, అంతర్జాతీయంగా పోటీతత్వం గల సెమీకండక్టర్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచటమే ఈ సంస్కరణల ఉద్దేశం.
సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల ప్రత్యేక అవసరాలను తీర్చేందుకు 03.06.2025 నాటి నోటిఫికేషన్ ద్వారా సెజ్ నియమావళి-2006లో కీలక సవరణలు చేశారు. ఇందులో భాగంగా కనిష్ఠంగా భూమి అవసరాన్ని 50 హెక్టార్ల నుంచి 10 హెక్టార్లకు తగ్గించటం, ఆస్తుల తాకట్టుకు సంబంధించిన నిబంధనలను సరళీకరించటం, నికర విదేశీ మారకద్రవ్య గణనలో ఉచిత సరఫరాలను చేర్చటం, సుంకాలను చెల్లించటం ద్వారా దేశీయ వాణిజ్య పరిధిలో (డీటీఏ) విక్రయాలకు అనుమతించటం వంటి మార్పులు చేశారు.
ఈ సంస్కరణలకు కొనసాగింపుగా సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించి సెజ్‌లను ఏర్పాటు చేసేందుకు కీలక ప్రతిపాదనలను అప్రూవల్ బోర్డు ఆమోదించింది. ముఖ్యంగా మైక్రాన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గుజరాత్‌లోని సనంద్‌లో సెమీకండక్టర్ల అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ కోసం సుమారు రూ.13,000 కోట్ల అంచనా పెట్టుబడితో ఒక సెజ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఏకస్ గ్రూప్.. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీకి ప్రత్యేక సెజ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టులు స్వదేశీ విలువ వ్యవస్థల అభివృద్ధిని వేగవంతం చేస్తాయని, నైపుణ్యం గల వారికి ఉపాధిని కల్పిస్తాయని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు. నిబంధనల సడలింపు తర్వాత ఆమోదం పొందిన సెజ్‌ల వివరాలు:
|
క్రమ సంఖ్య
|
సంస్థ పేరు
|
నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ
|
భూమి విస్తీర్ణం (హెక్టార్లలో)
|
ప్రతిపాదిత పెట్టుబడి (రూ.కోట్లలో)
|
ప్రతిపాదిత ఉపాధి (ప్రత్యక్షంగా, పరోక్షంగా)
|
కార్యకలాపాలు
|
|
1.
|
మెసర్స్ మైక్రాన్ సెమీకండక్టర్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
|
23 జూన్ 2025
|
37.64
|
13,000
|
20,786
|
అసెంబ్లీ, టెస్టింగ్, మార్కెటింగ్, ప్యాకేజింగ్ యూనిట్
|
|
2.
|
మెసర్స్ హుబ్బళ్లి డ్యూరబుల్ గూడ్స్ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్
|
23 జూన్ 2025
|
11.549
|
100
|
4,360
|
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ, సేవలు
|
|
3.
|
మెసర్స్ సీజీ సెమీ ప్రైవేట్ లిమిటెడ్
|
23 సెప్టెంబర్ 2025
|
11.541
|
2150
|
1,911
|
సెమీకండక్టర్ చిప్ ల కోసం అవుట్‌సోర్డ్స్ అసెంబ్లీ, టెస్టింగ్ సేవలు
|
|
4.
|
మెసర్స్ కేన్స్ సెమికాన్ ప్రైవేట్ లిమిటెడ్
|
26 సెప్టెంబర్ 2025
|
18.44
|
681
|
2,020
|
అవుట్‌సోర్డ్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్ (ఓఎస్ఏటీ)
|
|
5.
|
మెసర్స్ టాటా సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్
|
9 ఏప్రిల్ 2026
|
66.166
|
91,000
|
21,000
|
ఏఐ ఆధారిత సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సదుపాయం
|
పటిష్టమైన, పోటీతత్వంతో కూడిన, స్థితిస్థాపకత గల, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే సెమీకండక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేయటంలో ఈ సెజ్‌లు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాలు.. పరిశ్రమల భాగస్వామ్యం, ప్రభుత్వ విధానపరమైన మద్దతుతో సమీకృత తయారీ క్లస్టర్ల ఏర్పాటునకు, స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయటానికి, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ కేంద్రంగా నిలిపేందుకు మార్గం సుగమం చేస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2252933)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15