ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లోక్‌సభలో తన ప్రసంగం ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 APR 2026 10:28PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లోక్‌సభలో తన ప్రసంగం ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ  మోదీ వరుసగా  సందేశాలను పొందుపరుస్తూ:..
‘‘మనమందరం అదృష్టవంతులం.. దేశ జనాభాలో సగమున్న వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేసే సౌభాగ్యం  మనకు దక్కుతోంది. దేశ విధాన రూపకల్పనలో మన మహిళా శక్తి పాలుపంచుకోవాలని వర్తమానం కోరుకుంటోంది.’’
‘‘గత 25-30 సంవత్సరాల్లో, లక్షలాది మహిళలు క్షేత్ర స్థాయిలో లీడర్లుగానూ, ఒపీనియన్ మేకర్లుగానూ మారారు. ఈ కారణంగా వారిని వ్యతిరేకించే వ్యక్తులు చాలా కాలం పాటు ఇందుకు మూల్యాన్ని చెల్లించకోవలసి వస్తుంది.’’
‘‘దేశంలో మహిళా శక్తికి రిజర్వేషన్ కల్పించడం జాతికి మేలు చేసే నిర్ణయం. దీనిలో  మన సంకల్పాన్ని తల్లులు, అక్కచెల్లెళ్లు, కుమార్తెలు గమనిస్తారు. ఇందువల్ల, దీనిని రాజకీయాల దృష్టికోణంలో నుంచి చూడకండి.’’
‘‘దేశంలోని మహిళాశక్తికి ఏదో అప్పగిస్తున్నామనే భ్రమను మనం పెంచుకోవద్దు. అంతకన్న,  అది వారి హక్కుగా చూడండి. ఖ్యాతిని చేజిక్కించుకోవాలనేది మా అభిప్రాయం కాదు.. మహిళలకు మరింత సాధికారతను కల్పించాలనే భావనే మాకుంది.’’
 ‘‘మన దేశంలో అనుభవం కలిగిన మహిళా శక్తికి లోటు లేదు. సభతో పాటు దేశాన్ని కూడా సమృద్ధం చేయడానికి  మహిళలు అమూల్య తోడ్పాటును అందిస్తారన్న నమ్మకం మనకుంది’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2252854) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Gujarati , Kannada , Malayalam