మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ఏర్పాటు చేసిన ఉప్పునీటి ఆక్వాకల్చర్ క్లస్టర్ పురోగతిని సమీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరాన్ని సందర్శించిన కేంద్ర మత్స్యశాఖ కేంద్ర కార్యదర్శి

నాడు పోస్టు చేయడమైనది: 16 APR 2026 3:54PM by PIB Hyderabad

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వైకింద ఏర్పాటు చేసిన ఉప్పునీటి ఆక్వాకల్చర్ క్లస్టర్ పురోగతిని పర్యవేక్షించేందుకు ఏప్రిల్ 16న కేంద్ర మత్స్యపశుసంవర్ధకపాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారుఈ పర్యటనలో భాగంగా ఆయన స్థానిక రొయ్యలచేపల రైతులను స్వయంగా కలిసి మాట్లాడారుక్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులుసవాళ్లువసతుల కొరతను అడిగి తెలుసుకున్నారుఈ సమీక్షా సమావేశం హైబ్రిడ్ విధానంలో జరిగిందిఇందులో కేంద్రరాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ అధికారులువివిధ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల మత్స్య క్లస్టర్ ప్రతినిధులుఐసీఏఆర్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారువీరితోపాటు ఎన్ఎఫ్‌డీబీసీఏఏఎంపీఈడీఏనాబార్డ్ వంటి సంస్థల ప్రతినిధులుచేపలరొయ్యల రైతులుమత్స్య సహకార సంఘాలు, సముద్ర ఆహార ఎగుమతిదారులుమత్స్య విశ్వవిద్యాలయాలుకళాశాలల ప్రతినిధులు ఈ చర్చా వేదికలో భాగస్వాములయ్యారు.

 

 

చేపల పెంపకందారులతో కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి మాట్లాడారుఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వారందరినీ ఆయన అభినందించారురైతులు ఇచ్చిన విలువైన అభిప్రాయాలు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల విధాన రూపకల్పనకు ఎంతో కీలకమని పేర్కొన్నారుసుమారు 64 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించిఆక్వా రంగంలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారుభీమవరం క్లస్టర్‌కు కేంద్రం నుంచి నిరంతర మద్దతు ఉంటుందని తెలిపారుఉత్పత్తికి ముందుఉత్పత్తి సమయంలోఉత్పత్తి తర్వాత ఎదురయ్యే అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారుచేపల వినియోగాన్ని పెంచేందుకు రక్షణ శాఖఇతర ప్రభుత్వ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలని సూచించారుమన రైతులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి దేశ విదేశాల్లో పర్యటించేలా ప్రోత్సహిస్తామని తెలిపారుచేపల్లో ఏ భాగాన్ని వృధా చేయకుండా సంపూర్ణ వినియోగ విధానాన్ని అవలబించాలనిచేపల వ్యర్థాల నిర్వహణతో సహా ఐస్‌లాండ్ దేశంతో కుదుర్చుకోబోయే త్రైపాక్షిక ఒప్పందం గురించి వివరించారుఅత్యాధునిక సాంకేతికతఉత్తమ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు భీమవరంలో సీఐబీఏ ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలని సూచించారురొయ్యలుచేపల ఎగుమతులను పెంచడానికి మార్కెట్ సంబంధాలను బలోపేతం చేయాలని.. ధ్రువీకరణట్రేసబిలిటీపై రైతులకు అవగాహన కల్పించాలని ఎంపీఈడీఏ ను కోరారుభీమవరం క్లస్టర్ అభివృద్ధి కోసం ఈ రంగంలోని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బిరాజశేఖర్ మాట్లాడుతూ.. దేశ సముద్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్య రంగం కేంద్ర బిందువు అనిస్థిరమైన వృద్ధిని సాధించడంలోఎగుమతి ఆదాయాన్ని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారుఅంతర్జాతీయ మార్కెట్లో నిలబడాలంటే ట్రేసబిలిటీ,  ప్రపంచ ప్రమాణాలను పాటించడం ఇప్పుడు పాటించడం ఐచ్ఛికం కాదనిఅవి తప్పనిసరి అని స్పష్టం చేశారుఆంధ్రప్రదేశ్‌కు ఉన్న విస్తారమైన తీరప్రాంతంసముద్ర వనరులను దృష్టిలో ఉంచుకునిసముద్రపు నాచు సాగుకృత్రిమ సముద్ర దిబ్బల ఏర్పాటులో పెట్టుబడులు పెంచాలని పిలుపునిచ్చారుఇవి ఎగుమతుల అభివృద్ధికివనరుల సుస్థిరతకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

 

కేంద్ర మత్స్యపశుసంవర్ధకపాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (అంతర్గత మత్స్యశాఖసంయుక్త కార్యదర్శి శ్రీ సాగర్ మెహ్రా మాట్లాడుతూ.. ఉత్పత్తిప్రాసెసింగ్మార్కెట్ సంబంధాలు,  ఎగుమతుల వరకు అన్నింటినీ అనుసంధానిస్తూ..  దేశవ్యాప్తంగా 34 మత్స్య క్లస్టర్లను అభివృద్ధికి ప్రధాన కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారుక్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనిఇందుకోసం ఐఓటీబయోఫ్లాక్ఆర్ఏఎస్ వంటి ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని సూచించారుశీతలీకరణ సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటుమత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికిసాన్ క్రెడిట్ కార్డువంటి పథకాలను మార్కెట్ వ్యవస్థతో అనుసంధానించిరైతులకు రుణ సదుపాయం అందడంలో ఉన్న అడ్డంకులను తొలగించాలని తెలిపారు.

ప్రపంచంలోనే చేపల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (మత్స్య శాస్త్రండాక్టర్ జేకే జెనా తెలిపారుజాతీయ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న సహకారాన్ని ఆమె అభినందించారుసీఐబీఏతో సహా ఐసీఏఆర్ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంవ్యాధి నిర్ధారణ పరీక్షలుపర్యవేక్షణ కార్యక్రమాల ద్వారా పూర్తి మద్దతు ఇవ్వడం ద్వారా భీమవరం క్లస్టర్ దేశంలోనే అగ్రగామి ఆక్వాకల్చర్ జోన్‌గా ఎదిగే అవకాశం ఉందని తెలిపారుభవిష్యత్తులో ఈ రంగం సుస్థిరంగా ఎదగాలంటే రైతులుపరిశోధనా సంస్థలుప్రభుత్వ-ప్రైవేటు భాగస్వాముల మధ్య బలమైన సమన్వయం అవసరమని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ శ్రీ రామశంకర్ నాయక్ మాట్లాడుతూ... అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూవిలువ ఆధారిత సముద్రపు ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారానే రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారుసాగు నీటి నాణ్యతను కాపాడటానికివ్యాధుల ప్రభావాన్ని తగ్గించి ఉత్పాదకతను పెంచడానికి ఉప్పునీటి కాలువలుడ్రైనేజీ వ్యవస్థల్లో పూడికతీతశుభ్రపరచడం వంటి పనులు అత్యంత కీలకమని తెలిపారుఉత్తమ ఆక్వా సాగు పద్ధతులను పాటించాలనిమత్స్య రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుప్రయోగశాల సౌకర్యాల కల్పన అవసరమని తెలుపుతూ.. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ఏరేటర్లపై జీఎస్టీని తగ్గించాలని ఆయన కోరారు.

భీమవరం క్లస్టర్ కోసం రాబోయే పంచవర్ష ప్రణాళికపై జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ బిజయ్ కుమార్ బెహెరా ప్రజెంటేషన్ ఇచ్చారువిలువ ఆధారిత వ్యవస్థలోని భాగస్వాములందరి నుంచి ఆశిస్తున్న అంశాలను ఆయన ప్రస్తావించారు.

సాంకేతికతమౌలిక సదుపాయాలుమార్కెట్ ఆధారిత చర్యల ద్వారా భీమవరం మత్స్య క్లస్టర్‌ను బలోపేతం చేయడంపై కీలక భాగస్వాములు తమ అభిప్రాయాలను పంచుకున్నారుహేచరీ (చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం)జన్యు మెరుగుదల సాంకేతికతలలో పురోగతిసమీకృత రొయ్యలు-సముద్రపు నాచు సాగు నమూనాలుమెరుగైన జీవ-భద్రతతో కూడిన అత్యధిక సాంద్రత గల రొయ్యల పెంపకంవ్యాధి నిఘాట్రేసబిలిటీ వ్యవస్థలుచేపల వ్యర్థాల వినియోగంలో సాధించిన పురోగతిని సీఐబీఏ వివరించిందిఎగుమతులకు మద్దతుగా భీమవరంలో ఒక ప్రాంతీయ కార్యాలయంరెండు పరీక్షా ప్రయోగశాలల ఏర్పాటుతో పాటుధ్రువీకరణట్రేసబిలిటీపై క్రమం తప్పకుండా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాల గురించి ఎంపీఈడీఏ పేర్కొందిక్లస్టర్లలో మత్స్య రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటులో సాధించిన పురోగతినిఆర్థిక సమ్మిళితాన్ని మెరుగుపరచడానికి ప్రాంతీయ బ్యాంకులతో రుణ సంబంధాలను బలోపేతం చేయడం వంటి అంశాలను నాబార్డ్‌ వివరించిందికీలకమైన ఉప్పునీటి జాతుల కోసం హేచరీ సాంకేతికతల అభివృద్ధిసముద్రపు నాచు విలువ ఆధారిత ఉత్పత్తులపై చేపట్టిన కార్యక్రమాలుకృత్రిమ దిబ్బల ఏర్పాటుబహుళ జాతుల ఆక్వాకల్చర్నర్సరీలుబతికున్న చేపల రవాణాను ప్రోత్సహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల మద్దతు వంటి అంశాలను సీఎంఎఫ్‌ఆర్‌ఐ తెలిపింది.

ఈ సమావేశంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అందుతున్న ప్రత్యక్ష మద్దతును చేపల రైతులు అభినందించారుఅయితే ప్రత్యేక దృష్టి సారించాల్సిన పలు సవాళ్లను వారు ప్రస్తావించారుబలహీనమైన మార్కెట్ అనుసంధానందేశీయ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం వంటి కీలక ఆందోళనలను వ్యక్తం చేశారుప్రభుత్వ క్యాంటీన్లుఆసుపత్రులుమధ్యాహ్న భోజన పథకాల్లో చేపలుసముద్రపు ఆహారాన్ని చేర్చాలని సూచించారువ్యాధులువైరస్ ల వ్యాప్తిని నిరోధించడానికి బ్రూడ్‌స్టాక్విత్తన నాణ్యతపై కఠినమైన నియంత్రణపర్యవేక్షణ ఉండాలని రైతులు చెప్పారువ్యాధిని తట్టుకోగల బ్రూడ్‌స్టాక్‌ను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేశారుసంస్థాగత రుణాల అందుబాటు పరిమితంగా ఉండటం ఒక ప్రధాన అడ్డంకిగా పేర్కొన్నారుఆక్వాకల్చర్ కార్యకలాపాలకు కూడా వ్యవసాయం తరహాలోనే ఆదాయపు పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరారుఉత్పాదకతలాభదాయకతను పెంచడానికి మెరుగైన శాస్త్రీయ నిర్వహణ పద్ధతులుసామర్థ్య పెంపు అవసరమని రైతులు చెప్పారుఉత్పత్తి వ్యయంలో దాదాపు 70 శాతం చేపల ఆహారానికే  ఖర్చవుతుందనివీటి నాణ్యతను మెరుగుపరచాలని కోరారుఐఓటీ ఆధారిత సాంకేతికతలను అవలంబించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీఆ సాంకేతిక పరికరాల వినియోగం సాధ్యపడాలంటే రాయితీలు అందించాలని కోరారు.

ఉత్తమ ఎగుమతుల నగరంగా భీమవరం గుర్తింపు పొందినప్పటికీవ్యవసాయ క్షేత్రాల నుంచి ప్రాసెసింగ్ కేంద్రాల వరకు అనుసంధానం వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సముద్రపు ఆహార ఎగుమతిదారులు సూచించారుపెరుగుతున్న రవాణా సుంకాలుఅధిక విలువ జోడింపు కోసం ఉప-ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరంపోటీ ప్రపంచ మార్కెట్లలో యూనిట్ ధరలను పెంచడానికి పరిమిత అవకాశాలు ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

సమీక్షా సమావేశం అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కల్లా గ్రామంలోని శ్రీ అల్లూరి మహేష్ రాజుకు చెందిన 40 ఎకరాల రొయ్యల చెరువును కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి సందర్శించారుపీఎంఎంఎస్‌వై కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ లిటోపెనియస్ వన్నమేయి రొయ్యల సాగు జరుగుతోంది2026 జనవరిలో ఎకరాకు 50,000 విత్తనాల సాంద్రతతో ప్రారంభించిన ఈ క్షేత్రంలో.. ఐఓటీ సెన్సార్లునానో-బబుల్ ఆక్సిజనేషన్విద్యుత్‌ పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారుదీని ద్వారా స్థానిక ఉపాధిని కల్పిస్తూనే, 50 టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నారు.

 

దేశ సముద్ర ఆహార ఎగుమతులు బలమైన వృద్ధిని కనబరుస్తున్నాయి2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ62,408 కోట్లుగా ఉన్న ఎగుమతులు.. 2025–26 నాటికి సుమారు రూ..68,000 కోట్లకు చేరుకుంటాయని అంచనాఈ వృద్ధిని ప్రోత్సహించడానికికొత్త ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి  ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలిలో మత్స్య సంపద స్థిరమైన వినియోగం నిబంధనలు 2025ను ప్రకటించిందిఅలాగే భారతీయ నౌకలు అంతర్జాతీయ జలాల్లో చేపల వేట సాగించేందుకు మార్గదర్శకాలను విడుదల చేసిందిదీనితో ప్రత్యేక ఆర్థిక మండలంఅంతర్జాతీయ జలాల నుంచి సేకరించిన చేపలకు సుంకం లేని వెసులుబాటు కల్పించడంవిదేశీ రేవుల్లో దిగుమతి చేసుకునే సరుకును కూడా ఎగుమతులుగా గుర్తించడంప్రాసెసింగ్ కోసం అవసరమైన ముడి పదార్థాలపై సుంకం లేని దిగుమతి పరిమితిని 1 శాతం నుంచి 3 శాతానికి పెంచడం వంటి చర్యలు భారత సముద్ర ఆహార రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తున్నాయి.

దేశీయ మత్స్య రంగంలో ఉప్పునీటి ఆక్వాకల్చర్‌ కీలక పాత్ర పోషిస్తోందిఇది దేశంలోని మొత్తం చేపల ఉత్పత్తిలో సుమారు 15 శాతం వాటాను కలిగి ఉంటూ.. రొయ్యల వంటి ఖరీదైన జాతుల సాగుపై దృష్టి సారించడం వల్ల ఎగుమతి ఆదాయంలో సింహభాగాన్ని అందిస్తోందితీరప్రాంతాలునదీముఖ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఈ సాగు ఆధునిక సాంకేతికతశాస్త్రీయ నిర్వహణ పద్ధతులుబలమైన మార్కెట్‌ అనుసంధానాల మద్దతుతో ఉత్పాదకతను పెంచడమే కాకుండా వేలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరం ఉప్పునీటి క్లస్టర్ దేశంలోనే అతిపెద్దఅత్యంత కీలకమైన సాగు ప్రాంతంగా నిలుస్తోంది2025 మార్చి 11న పీఎంఎంఎస్‌వై కింద గుర్తించిన ఈ క్లస్టర్.. సుమారు 53,861 హెక్టార్లలో 42,000కు పైగా చెరువులతో విస్తరించి ఉందిఅనుకూలమైన వాతావరణంఆధునిక మౌలిక సదుపాయాల కారణంగా ఇక్కడ ఎగుమతి ఆధారిత రొయ్యల జాతులైన తెల్ల రొయ్యటైగర్ రొయ్యల సాగు ముమ్మరంగా సాగుతోందిహెక్టారుకు సగటున 8 టన్నుల దిగుబడితోజాతీయ సగటు కంటే ఎక్కువ ఉత్పాదకతను సాధిస్తున్న ఈ క్లస్టర్ భారత సముద్ర ఆహార ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

నేపథ్యం
ఇది దేశంలోని మొత్తం చేపల ఉత్పత్తిలో దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉండటమే కాకుండాచేపల ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తోందిఈ రంగం సుమారు 16.5 లక్షల మందికి జీవనోపాధిని కల్పిస్తోందిభారతదేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో ఏపీ వాటా దాదాపు 34 శాతం కాగావీటి వార్షిక విలువ రూ21,000 కోట్లకు పైమాటేఆంధ్రప్రదేశ్‌లో సుమారు 7.6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్న ఆక్వాకల్చర్‌.. 2.75 లక్షల మందికి పైగా రైతులకు ఉపాధి కల్పిస్తుందిఎగుమతి ఆధారిత రొయ్యల సాగుకుఆక్వాకల్చర్‌ వ్యవస్థకు భీమవరం వంటి క్లస్టర్లు వెన్నెముకగా నిలుస్తున్నాయిమత్స్య రంగ బలోపేతానికి పీఎంఎంఎస్‌వై కింద రూ2405 కోట్లుమత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద రూ450 కోట్ల నిధులు కేటాయించారుఅదేవిధంగా పీఎంఎంకేఎస్‌ఎస్‌వైలో భాగంగా ఎన్‌ఎఫ్‌డీపీలో 2.83 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయిఆంధ్రప్రదేశ్ సుస్థిరతనుజీవనోపాధిని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యలను కూడా అమలు చేస్తోందివాతావరణ మార్పులను తట్టుకోగల తీరప్రాంత మత్స్యకారుల గ్రామాల కార్యక్రమం కింద రూ,30 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో 15 తీరప్రాంత గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారుఅందులో ఇప్పటికే రూ7.5 కోట్లు విడుదలవ్వడమే కాకుండా పనులు కూడా ప్రారంభమయ్యాయిసముద్ర వనరుల పరిరక్షణ కోసం రూ.50.22 కోట్ల వ్యయంతో 162 కృత్రిమ పగడపు దిబ్బల యూనిట్లకు ఆమోదం లభించగాఇప్పటివరకు 22 యూనిట్లను ఏర్పాటు చేశారుగిరిజన ప్రాంతాల కోసం ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద రూ4.73 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం లభించిందిసాంప్రదాయ మత్స్యకారులకు రుణ సదుపాయంబీమా సౌకర్యంజీవనోపాధి మద్దతును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందివీటితోపాటు సముద్రపు నాచు సాగుజల్లల్లో పెంపకంమత్స్య సహకార సంఘాలుమత్స్య రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2252782) సందర్శకుల సూచీ సంఖ్య : : 32
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी