పార్లమెంటరీ వ్యవహారాలు
స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని ప్రోదిచేస్తూ ‘పరిశుభ్రత పక్షోత్సవం-2026’కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ్రీకారం
నాడు పోస్టు చేయడమైనది:
15 APR 2026 9:03PM by PIB Hyderabad
పార్లమెంటు సమావేశాల సంబంధిత కార్యకలాపాల్లో తలమునకలైన నేపథ్యంలో ‘పరిశుభ్రత పక్షోత్సవం-2026ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్ణీత తేదీకన్నా ఒక రోజు ముందుగా ఇవాళే ప్రారంభించింది. స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని ప్రోదిచేస్తూ పరిశుభ్ర, ఆరోగ్యకర పని వాతావరణం ఏర్పరిచేందుకు ఉద్దేశించిన ఈ పరిశుభ్రత ఉత్సవాలను 15 రోజులపాటు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ నికుంజ బిహారీ ధల్ తమ శాఖలోని అధికారులు సహా మొత్తం సిబ్బందితో పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకర జీవన శైలి, వ్యర్థాల సమర్థ నిర్వహణ తదితరాల దిశగా దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించాల్సిన కార్యకలాపాల సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఇప్పటికే అధికారులకు, సిబ్బందికి అందింది. దీనికి అనుగుణంగా నిర్దిష్ట ఫలితాలు రాబట్టగల చట్రాన్ని వారు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛ భారత్ అభియాన్ ఆదర్శాలకు కట్టుబడిన మంత్రిత్వశాఖ క్రమబద్ధ కార్యక్రమాలు, ప్రచారం ద్వారా పరిశుభ్రత, సుస్థిరతలను ప్రోత్సహిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2252435)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20