భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ తయారీని ప్రోత్సహించే పథకం కింద కొత్త బిడ్డర్ల కోసం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి పరిశ్రమ నుంచి విశేష స్పందన


పథకం కింద రూ. 7,280 కోట్ల వ్యయంతో 6,000 ఎంటీపీఏ సామర్థ్యం గల ఇంటిగ్రేటెడ్ సింటర్డ్ ఎన్డీఎఫ్ఈబీ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ తయారీ సౌకర్యాల ఏర్పాటుకు తయారీదారుల ఎంపిక కోసం గతంలోనే సీపీపీ పోర్టల్‌లో ఆర్ఎఫ్పీ జారీ చేసిన భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

సీపీపీ పోర్టల్ ద్వారా అత్యల్ప వ్యయ పద్ధతి (ఎల్సీఎస్) ప్రకారం రెండు పారదర్శక కవర్ల విధానం (సాంకేతిక బిడ్, ఆర్థిక బిడ్) కింద ఆన్‌లైన్ లో బిడ్డింగ్ ప్రక్రియ

2026 మార్చి 20 నుంచి సీపీపీ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న టెండర్ పత్రాలు; బిడ్ సమర్పించడానికి చివరి తేదీ 2026 మే 28

నాడు పోస్టు చేయడమైనది: 07 APR 2026 4:26PM by PIB Hyderabad

సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ తయారీ ప్రోత్సాహక పథకం కింద కొత్త బిడ్డర్ల కోసం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి పారిశ్రామిక వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సమావేశంలో కనీసం 25 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. 

ఈ సమావేశాన్ని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ రోజు (2026 ఏప్రిల్ 7)  న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో నిర్వహించింది. అంతకుముందు 2026 మార్చి 20న మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) ని విడుదల చేసింది. రూ. 7,280 కోట్ల వ్యయంతో కూడిన ఈ పథకం కింద, భారతదేశంలో మొత్తం 6000 ఎంటీపీఏ  తయారీ సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ (ఆర్ఈపీఎం) తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి బిడ్డర్లను ఆహ్వానించింది

 

ఈ పథకం గురించి, ఆర్ఎఫ్పీ లోని ప్రధాన నిబంధనలు, బిడ్డింగ్ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలపై సమావేశంలో పాల్గొన్న బిడ్డర్లకు వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రీ-బిడ్ కాన్ఫరెన్స్ సందర్భంగా పాల్గొన్నవారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. సందేహాలను (ఆర్ఎఫ్పీలో పేర్కొన్న వివరాల ప్రకారం) ఈ-మెయిల్ ద్వారా  పంపడానికి ఏప్రిల్ 22, 2026 చివరి తేదీ అని వారికి తెలియజేశారు.

బిడ్డింగ్ ప్రక్రియను సిపిపి  పోర్టల్ ద్వారా అత్యల్ప వ్యయ పద్ధతి (ఎల్సీఎస్) విధానంలో, పారదర్శకమైన రెండు దశల ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని పాల్గొన్న వారికి తెలియజేశారు. బిడ్‌లను సమర్పించడానికి 2026 మే 28 చివరి తేదీగా నిర్ణయించారు.

ఎంపిక ప్రక్రియలోని ప్రధానాంశాలలో అర్హత ప్రమాణాలను పూర్తి చేయడం, ఆర్ఎఫ్పీలో సూచించిన నమూనా ప్రకారం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను (డీపీఆర్) సమర్పించడం, సాంకేతికంగా అర్హత సాధించిన బిడ్డర్ల నుంచి అత్యల్ప వ్యయ పద్ధతి (ఎల్సీఎస్) ఆధారంగా ఎంపిక చేయడం వంటివి ఉన్నాయి.

ఈ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం గరిష్టంగా ఐదు సంస్థలను ఎంపిక చేస్తుంది. ప్రతి సంస్థ గరిష్టంగా 1,200 ఎంటీపీఏ సామర్థ్యం వరకు తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. తద్వారా మొత్తం మీద గరిష్టంగా 6,000 ఎంటీపీఏ సామర్థ్యం వరకు ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయి.

అరుదైన భూ ఖనిజ  శాశ్వత అయస్కాంతాలు (ఆర్ఈపీఎంలు) అత్యంత శక్తివంతమైన శాశ్వత అయస్కాంతాలలో ఒకటి. ఇవి విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, రక్షణ రంగాలలో కీలకమైనవి. ఈ పథకం ద్వారా అరుదైన భూ ఆక్సైడ్‌లను లోహాలుగా, లోహాలను మిశ్రమ లోహాలుగా, ఆ మిశ్రమ లోహాలను తుది ఉత్పత్తులైన శాశ్వత అయస్కాంతాలుగా (ఆర్ఈపీఎంలు)  మార్చే ప్రక్రియలతో కూడిన సమగ్ర తయారీ సౌకర్యాల ఏర్పాటుకు ఈ పథకం తోడ్పడుతుంది.

స్వదేశీ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో, భారతదేశంలో పటిష్టమైన, అంతర్జాతీయంగా పోటీతత్వం గల ఆర్ఈపీఎం వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2249898) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी