రాజ్యసభ సచివాలయం
సుభాష్ చంద్రబోస్‌కు నివాళిగా రూపొందించిన హిందీ దేశభక్తి చిత్రం “ఆజాద్ భారత్” ప్రత్యేక ప్రదర్శన
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 8:39PM by PIB Hyderabad
సుభాష్ చంద్రబోస్‌కు నివాళిగా రూపొందించిన "ఆజాద్ భారత్" హిందీ దేశభక్తి చిత్రాన్ని ఈ రోజు పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లోని జిఎంసి బాలయోగి ఆడిటోరియంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు (రాజ్యసభ సచివాలయ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ చిత్రానికి డాక్టర్ రూప అయ్యర్ నిర్మాత, దర్శకురాలు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో విశేష సేవలు అందించిన ఐఎన్ఏ యోధులను వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈ సందర్భంగా సన్మానించారు. సినిమా ప్రదర్శనకు ముందు డాక్టర్ రూప అయ్యర్‌ను, చిత్రంలోని ఇతర కళాకారులను కూడా మంత్రి సత్కరించారు.
నేతాజీ మునిమనవరాలు శ్రీమతి మీనాక్షి లేఖి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. శ్రీమతి రాజ్యశ్రీ చౌదరి, రాజ్యసభ సచివాలయం అదనపు కార్యదర్శి డాక్టర్ కె.ఎస్. సోమశేఖర్ కూడా పాల్గొన్నారు.
ఈ ప్రదర్శన స్వాతంత్ర్య సమరయోధుల చిరస్మరణీయ వారసత్వానికి అర్థవంతమైన నివాళిగా నిలిచింది. దేశభక్తి, జాతీయ సేవ విలువలను కాపాడటానికి ప్రస్తుత, భావి తరాలకు స్ఫూర్తినివ్వడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం.
***
(రిలీజ్ ఐడి: 2248099)
సందర్శకుల సూచీ సంఖ్య : : 65