రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నౌకాదళంలోకి చేరిన దునగిరి -యుద్ధ నౌకల నిర్మాణంలో ఆత్మనిర్భరతకు ప్రధాన ఊతం
‘ప్రాజెక్ట్ 17ఏ’ కింద స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ దునగిరిని కలకత్తాలోని జీఆర్‌ఎస్‌ఈలో స్వీకరించిన భారత నౌకాదళం
నాడు పోస్టు చేయడమైనది:
31 MAR 2026 9:12AM by PIB Hyderabad
నీలగిరి తరగతి (ప్రాజెక్ట్ 17ఏ)కు చెందిన ఐదవ నౌకగా, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డింగ్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్‌ఎస్‌ఈ)లో నిర్మితమైన రెండవ నౌక దునగిరి (యార్డ్ 3023)ను 30 మార్చి 2026న కలకత్తాలోని జీఆర్‌ఎస్‌ఈలో భారత నౌకాదళానికి అప్పగించారు. ఇది యుద్ధ నౌకల రూపకల్పన, నిర్మాణంలో స్వావలంబన సాధనలో ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పవచ్చు. ప్రాజెక్ట్ 17ఏ ఫ్రిగేట్‌లు బహుముఖ సామర్థ్యాలు కలిగి ఉన్నాయి. సముద్ర రంగంలో ప్రస్తుత, భవిష్యత్ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని వాటిని ఎదుర్కొనే విధంగా రూపకల్పన చేశారు.
దునగిరి అనే పేరును పూర్వం ఉన్న ఐఎన్‌ఎస్ దునగిరి అనే లియాండర్ తరగతి ఫ్రిగేట్ నుంచి తీసుకున్నారు.. ఈ నౌక 05 మే 1977 నుండి 10 అక్టోబర్ 2010 వరకు భారత నౌకాదళంలో భాగంగా ఉండి, దేశానికి 33 సంవత్సరాల విశిష్టమైన సేవలను అందించింది. ఈ ఆధునిక ఫ్రిగేట్ నౌకాదళ రూపకల్పన, స్టెల్త్ సామర్థ్యం, అగ్ని శక్తి, ఆటోమేషన్ వివిధ అంశాల్లో విశేషమైన పురోగతిని ప్రతిబింబిస్తూ, యుద్ధ నౌకల నిర్మాణంలో ఆత్మనిర్భరతకు ఒక ప్రతీకగా నిలుస్తుంది.
ఈ దునగిరి, వార్‌షిప్ డిజైన్ బ్యూరో (డబ్ల్యూడీబీ) రూపొందించి, కలకత్తాకు చెందిన వార్‌షిప్ ఓవర్‌సీయింగ్ టీమ్ పర్యవేక్షణలో నిర్మించిన ప్రాజెక్ట్. స్వదేశీ నౌకా రూపకల్పనలో రూపుదిద్దుకున్న ఈ 17ఏ ఫ్రిగేట్‌లు, స్టెల్త్, మనుగడ శక్తి, యుద్ధ సామర్థ్యాల్లో తరాల మార్పును ప్రతిబింబిస్తాయి. సమగ్ర నిర్మాణాంశాలతో రూపొందించిన ఈ నౌకను, నిర్దేశిత కాలపరిమితిలో భారత నౌకాదళానికి అందజేశారు.
ప్రాజెక్ట్ 17ఏ నౌకలు ప్రాజెక్ట్ 17 (శివాలిక్) తరగతితో పోలిస్తే అధునాతన ఆయుధాలు, సెన్సార్ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. ఈ నౌకలను కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ (కోడాగ్) ప్రొపల్షన్ వ్యవస్థతో అమర్చారు. ఇందులో డీజిల్ ఇంజిన్ గ్యాస్ టర్బైన్ కలిసి ప్రతి షాఫ్ట్‌పై కంట్రోలబుల్ పిచ్ ప్రొపెల్లర్ (సీపీపీ)ను నడుపుతాయి. అలాగే అత్యాధునిక సమగ్ర ప్లాట్‌ఫాం నిర్వహణ వ్యవస్థ (ఐపీఎంఎస్)ను కలిగి ఉన్నాయి. శక్తివంతమైన ఆయుధాలు, సెన్సార్ వ్యవస్థలో బ్రహ్మోస్ ఎస్ఎస్ఎం, ఎమ్ఎఫ్స్టార్, ఎమ్ఆర్ఎస్ఏఎమ్ కాంప్లెక్స్, 76 మి.మీ ఎస్‌ఆర్‌జీఎమ్, 30 మి.మీ, 12.7 మి.మీ సమీప రక్షణ ఆయుధ వ్యవస్థలు, అలాగే యాంటీ సబ్‌మరైన్ రాకెట్లు, టార్పెడోలు ఉన్నాయి.
కేవలం 16 నెలల్లో భారత నౌకాదళానికి అందించిన ఐదవ ప్రాజెక్ట్ 17ఏ నౌకగా దునగిరి నిలిచింది. తొలి నాలుగు ప్రాజెక్ట్ 17ఏ నౌకల నిర్మాణ అనుభవంతో, మొదటి నౌక (నీలగిరి) నిర్మాణానికి పట్టిన 93 నెలలతో పోలిస్తే, దునగిరి నిర్మాణ కాలాన్ని 80 నెలలకు తగ్గించడం సాధ్యపడింది.
దునగిరి అప్పగింత స్వదేశీ రూపకల్పన, నౌకా నిర్మాణం, ఇంజినీరింగ్ ప్రతిభను ప్రతిబింబిస్తుంది. ఆత్మనిర్భరత సాధనలో భాగంగా భారత నౌకాదళం చూపుతున్న నిరంతర కృషికి ఈ నౌక రూపకల్పన ఉదాహరణగా నిలుస్తుంది.
75 శాతం స్వదేశీకరణ స్థాయితో ఈ ప్రాజెక్ట్‌లో 200కు పైగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు భాగస్వామ్యమయ్యాయి. దీని ద్వారా సుమారు 4 వేల మందికి ప్రత్యక్షంగా 10వేల మందికి పైగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించారు.
***
(రిలీజ్ ఐడి: 2247358)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8