శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైన్స్ కమ్యూనికేషన్, ఎస్టీఐ విధాన పరిశోధనలను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సీఎస్ఐఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ఐఎస్సీపీఆర్)

నాడు పోస్టు చేయడమైనది: 30 MAR 2026 6:29PM by PIB Hyderabad

సైన్స్ కమ్యూనికేషన్ ను బలోపేతం చేసేందుకుసైన్స్టెక్నాలజీఇన్నోవేషన్ (ఎస్టీఐపాలసీలో ఉమ్మడి పరిశోధనలు ప్రోత్సహించేందుకు సీఎస్ఐఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ (ఎస్సీఏపీ)తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందిసాక్ష్యాధారిత విధాన రూపకల్పనను మెరుగుపరచడంసైన్స్ కమ్యూనికేషన్ కార్యక్రమాల ద్వారా శాస్త్ర విజ్ఞానంపై ప్రజల్లో అవగాహన పెంచడంపరిశోధనశిక్షణఅవగాహన కార్యక్రమాల్లో ఉమ్మడి ప్రయత్నాల ద్వారా పటిష్టమైన శాస్త్రీయ వ్యవస్థను పెంపొందించడం ఈ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది.  

సీఎస్ఐఆర్ఎన్ఐఎస్సీపీఆర్ డైరెక్టర్ డాక్టర్ గీతా వాణి రాయసంఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ  సీఈఓ  శ్రీ వెంకటేశ్వర్లు కేశినేని ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.టికృష్ణబాబురెండు సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి ఎన్ఐఎస్సీపీఆర్ నుంచి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ యోగేష్ సుమన్ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్.కె.ప్రసన్న నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు.

 అవగాహనా ఒప్పందం ముఖ్య ప్రయోజనాలు:

• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ కమ్యూనికేషన్శాస్త్రీయ అవగాహనను బలోపేతం చేయడం.

• ఎస్టీఐ పాలసీలో ఉమ్మడి పరిశోధనలను ప్రోత్సహించడంసాక్ష్యాధారిత నిర్ణయాలకు మద్దతు ఇవ్వడం.

 • శిక్షణ కార్యక్రమాలువర్క్‌షాప్‌లుమార్గదర్శన కార్యక్రమాల ద్వారా సామర్థ్యాల పెంపుదల.

• విజ్ఞానాన్ని పంచుకోవడంఉమ్మడి ప్రచురణలువిద్యాపరమైన మద్దతును అందించడం

• పాఠశాల నుంచి   విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యార్థులుఅధ్యాపకులుపరిశోధకులువిద్యావేత్తలకు ప్రయోజనం చేకూర్చడం

 ప్రధాన భాగస్వామ్య కార్యకలాపాలు:

• సైన్స్ కమ్యూనికేషన్ఎస్టీఐ nపాలసీల్లో ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులుప్రచురణలు.

• సెమినార్లువర్క్‌షాప్‌లుకాన్ఫరెన్స్‌లుశిక్షణ కార్యక్రమాల నిర్వహణ.

• విద్యశిక్షణకు సంబంధించిన సమాచారం అభివృద్ధి.

• విద్యార్థులుపరిశోధకులకు,  మార్గదర్శకత్వంవిద్యాపరమైన సహాయ సహకారాలు

• శాస్త్రీయ పత్రికలువిజ్ఞాన వనరులకు ప్రోత్సాహం 

• సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు  అనుగుణంగా అవగాహన కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్ లో విజ్ఞానాధారితనూతన ఆవిష్కరణల దిశగా  శాస్త్రీయ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో తోడ్పడే విధంగా శాస్త్ర విజ్ఞానంవిధాన రూపకల్పనసమాజం మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన అడుగు.

 

***


(రిలీజ్ ఐడి: 2247163) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी