పర్యటక మంత్రిత్వ శాఖ
భారతీయ పర్యాటక, ప్రయాణ నిర్వహణ సంస్థ
నాడు పోస్టు చేయడమైనది:
30 MAR 2026 2:02PM by PIB Hyderabad
భారతీయ పర్యాటక, ప్రయాణ నిర్వహణ సంస్థ (ఐఐటీటీఎం)1983లో స్థాపితమై ప్రయాణ, పర్యాటక విద్య, శిక్షణ రంగంలో ఒక అగ్రగామి సంస్థగా వెలుగొందుతుంది. ఇది పర్యాటకం, ప్రయాణ పరిశ్రమ కోసం ప్రత్యేక శిక్షణ, విద్యను అందిస్తుంది. గ్వాలియర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఐఐటీటీఎంకు దేశవ్యాప్తంగా 5 క్యాంపసులు, 2 క్యాంపు కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఐఐటీటీఎం ఈ కింది కోర్సులను అందిస్తోంది.
· మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (పర్యాటకం, ప్రయాణ నిర్వహణ): 2 సంవత్సరాల కోర్సు.
· బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (పర్యాటకం, ప్రయాణ నిర్వహణ): 3 సంవత్సరాల కోర్సు.
· పూర్తి-స్వల్పకాల విధానంలో పీహెచ్ డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
· వీటితో పాటు ఐఐటీటీఎం స్వల్పకాలిక ధ్రువీకరణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.
ప్రతి ఐఐటీటీఎం కేంద్రం వివరాలు, అక్కడ అందించే కోర్సుల వివరాలు కింది అనుబంధంలో ఉన్నాయి.
ప్రతి ఐఐటీటీఎం కేంద్రంలో అందించే కోర్సులు, కేంద్రాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
ఈ సమాచారాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నేడు లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2246911)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18