ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బహుళ భాషలలో పింఛన్ సంబంధిత సేవలు.. ఎమ్ఓయూను కుదుర్చుకున్న


డిజిటల్ ఇండియా భాషిణి విభాగం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ

భారతీయ భాషల్లో నిరంతర సమాచారానికి అనువుగా సమ్మిళిత

అనుబంధ విస్తారిత వ్యవస్థకు మద్దతిచ్చే కార్యక్రమం

నాడు పోస్టు చేయడమైనది: 25 MAR 2026 9:47PM by PIB Hyderabad

‘‘సేవసంచాలన్ కోసం భాషిణిఓ భాషిణి సహయోగి కార్యక్రమం’’ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీ),  ఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతిక విజ్ఞాన విభాగం (ఎమ్ఈఐటీవై), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ)లు ఓ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయిదేశంలో జాతీయ భాషా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ‘భాషిణి వేదిక’తో అనుసంధానాన్ని ఏర్పరుచుకోవడం ద్వారా పింఛన్ నిధి సేవల అనుబంధ విస్తారిత వ్యవస్థలో వివిధ భాషల్లో డిజిటల్ సామర్థ్యాల్ని బలోపేతం చేయడం ఈ సహకార పూర్వక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ముఖ్యోద్దేశం.

ఈ అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూపింఛన్ రంగంలో భాష వ్యాప్తిని పెంచుతుందిడిజిటల్ వేదికలలోవినియోగదారురకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పీఎఫ్‌ఆర్‌డీఏ ప్రణాళికలనూభాషిణి అనువాద ఏపీఐలూబహుభాషా ఏఐ మాడళ్లుస్వర-ఆధారిత సాంకేతికతల ఏకీకరణనూ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక (ఫ్రేమ్‌వర్క్)ను కూడా రూపొందిస్తుంది.
రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూలులో పేర్కొన్న 22 భాషల్లో చాలా వరకూ భాషల్లో పీఎఫ్ఆర్‌డీఏ కార్యకలాపాలూసమాచార వ్యవస్థలు అందుబాటులోకి రావడానికి ఈ కార్యక్రమం మార్గాన్ని సుగమం చేస్తుందిఈ క్రమంలో మరింత మంది వినియోగదారులకూఆసక్తిదారులకూ మేలు కలుగుతుంది.
ఈ సహకార ప్రభావాన్ని పీఎఫ్ఆర్‌డీఏ కార్యనిర్వాహక డైరెక్టరు మమతా రోహిత్ వివరిస్తూ... ‘‘పింఛన్ వ్యవస్థలు ప్రభావాన్వితంగా విస్తరించాలంటే భాషా సంబంధమైన ఇబ్బందుల్ని తొలగించడం ఎంతయినా అవసరంభాషిణి వంటి వేదిక మాకు ప్రజలు వారికి నచ్చిన భాషల్లో లావాదేవీలను పూర్తి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుందిఫలితంగా కమ్యూనికేషన్ ఇప్పటి కన్నా చాలా సులభంగానూసందర్భాధారితంగానూ మారిపోతుందిఇది మొదటి సారి పొదుపు చేస్తున్న వారికీభాష పరమైన ఇబ్బందుల వల్ల సాంప్రదాయిక పదవీ విరమణ ప్రణాళిక పరిధికి వెలుపలే ఉండిపోయిన వారి చెంతకూ చేరుకోవడంలో ముఖ్య పాత్రను పోషిస్తుందిఈ విధంగా ఆర్థిక సేవల్ని సమాజంలో ఎక్కువ మందికి అందించే కార్యక్రమానికి బలం చేకూరుతుంద’’న్నారు.
ఈ సహకారంలోనిర్దిష్ట తోడ్పాటు ద్వారా భాషాపరమైన డేటాసెట్లను సమృద్ధపరచడాన్ని ఒక భాగంగా చేర్చారుదీంతో సంస్థాగత ఉపయోగం కోసం బహుభాషా ఏఐ వ్యవస్థల పనితీరునీవ్యాప్తి సామర్థ్యాన్నీ నిరంతరంగా మెరుగు పరచడం సాధ్య పడుతుందిఈ ప్రయత్నాలను విశాల ‘భాషిణి సహయోగి’ ప్రణాళికలో భాగంగా చేపడతారుదీంతో మారుతున్న ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ఏఐ మాడళ్లను వినియోగించుకోవచ్చును.
డిజిటల్ ఇండియా భాషిణి విభాగం ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓశ్రీ అమితాబ్ నాగ్ మాట్లాడుతూ, ‘‘కీలక ఆర్థిక సేవల్ని వివిధ భాషల్లోనూస్వరాధారితంగానూ అందించడాన్ని ఇప్పటి కన్నా విస్తరించే దిశగా పీఎఫ్ఆర్‌డీఏతో కుదిరిన ఈ సహకారం ఒక మేలి మలుపుదీంతో పెద్ద ఎత్తున సేవల లభ్యత సాధ్యపడుతుందిపౌర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూడిజిటల్ పాలనను దేశంలో ప్రతి ఒక్కరి వద్దకూ తీసుకు పోవచ్చు’’ అని కూడా ఆయన అన్నారు.
ఈ అవగాహన ఒప్పందం కుదరడం దేశ జన సంఖ్య విస్తృతిభాషల స్వరూపం.. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొంటే ‘భాషిణి’ పోషించగల భూమికను పటిష్ఠ పరుస్తుందిపాలనతో పాటు ఆర్థిక సేవల రంగాల్లో సమ్మిళితసురక్షితఅంతర్ నిర్వహణీయ బహుభాషా ఏఐ వ్యవస్థల అభివృద్ధికీ ఈ ఒప్పందం తన వంతు తోడ్పాటును అందిస్తుంది.
పీఎఫ్ఆర్‌డీఏ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక చట్టబద్ధ నియంత్రణ సంస్థదేశంలో పింఛన్ రంగం నియంత్రించడంతో పాటుఈ రంగాన్ని ప్రోత్సహించేప్రగతిపథంలో నడిపే బాధ్యతలను ఈ సంస్థకు అప్పగించారు.

 

భాషిణి’ని గురించి
భాషా ఇంటర్‌ఫేస్ ఫర్ ఇండియా (బీహెచ్ఏఎస్‌హెచ్ఐఎన్ఐ..‘భాషిణి’కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఐటీవై)లో భాగంగా ఉన్న కృత్రిమ మేధ (ఏఐచోదక శక్తిగా పనిచేస్తున్న ఒక భాషా ప్రధాన సాంకేతిక కార్యక్రమంఇది 36 కన్నా ఎక్కువ టెక్స్టులు, 23 వాయిసులతో పాటు 35 అంతర్జాతీయ భాషలకు విస్తరించిన బహుభాషా ఏఐ సామర్థ్యాలకు దన్నుగా నిలుస్తోందిఇది అక్షరాస్యతభాషల మధ్య అంతరాన్ని భర్తీ చేస్తోందిఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ ‘జాతీయ భాషా అనువాద మిషన్’లో భాగంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని డిజిటల్ సేవలను బహుళ భాషల్లో అందించేందుకు అనువుగా రూపొందించారుదీని ఏఐ ఆధారిత వేదిక భారతీయ భాషల్లో అనువాదానికీస్వర-ఆధారిత ఇంటరాక్షన్‌‌కీ వీలు కల్పిస్తుందిప్రభుత్వ కార్యక్రమాల్నీప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన కార్యక్రమాల్నీ విస్తృత జనసమూహం చెంతకు ప్రభావవంతంగా చేర్చడంలో ఇది సాయపడుతోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2245749) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी