గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ‘వికసిత భారత్ 2047’ సాధనలో ముఖ్య పాత్ర కీలక ఖనిజాలదే: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి


కీలక, వ్యూహాత్మక ఖనిజాల వేలం ఏడవ విడతను ప్రారంభించిన గనుల మంత్రిత్వశాఖ

నాడు పోస్టు చేయడమైనది: 23 MAR 2026 6:56PM by PIB Hyderabad

భారత ఖనిజ భద్రతను పటిష్టం చేస్తూ, గనుల రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసే దిశగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈరోజు కీలక, వ్యూహాత్మక ఖనిజాల ఏడవ విడత ఈ - వేలాన్ని ప్రారంభించారు.

స్వచ్ఛ ఇంధనం, అత్యాధునిక సాంకేతికత, తయారీ రంగాల్లో భారత వృద్ధిని పరుగులు తీయించడంలో కీలక ఖనిజాల వ్యూహాత్మక ప్రాధాన్యతను ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రముఖంగా వివరించారు. 

 

ప్రభుత్వ సంస్కరణల గురించి శ్రీ కిషన్ రెడ్డి ప్రస్తావిస్తూ.. పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన ఈ-వేలం విధానం దేశవ్యాప్తంగా ఖనిజ వనరుల కేటాయింపులో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని పేర్కొన్నారు.

గనులు, ఖనిజాల విధానంలో ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ప్రక్రియలు సులభతరమయ్యాయని, జాప్యం తగ్గి వ్యాపార నిర్వహణ మెరుగుపడిందని మంత్రి పేర్కొన్నారు. బిడ్డర్ల భాగస్వామ్యాన్ని పెంచుతూ, ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు ప్రవేశపెట్టిన 'ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్స్' వంటి చర్యలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

గనుల శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, గనుల వేలం విజయవంతం కావడంలో సహకార సమాఖ్య స్ఫూర్తి ప్రాముఖ్యతను ప్రముఖంగా పేర్కొన్నారు. 

వేలం కోసం ప్రతిపాదించిన బ్లాకుల వివరాలు:

రాష్ట్రాల వారీగా వేలం బ్లాకుల పంపిణీ

రాష్ట్రం

బ్లాకుల సంఖ్య 

ఖనిజాలు 

అరుణాచల్ ప్రదేశ్ 

1

వెనేడియం, గ్రాఫైట్

బీహార్ 

4

గ్లాకోనైట్, వెనేడియం కలిగిన మ్యాగ్నెటైట్-ఇల్మెనైట్

ఛత్తీస్ ఘడ్ 

3

గ్లాకోనిటిక్ సాండ్ స్టోన్ , గ్రాఫైట్

గుజరాత్ 

1

గ్లాకోనైట్ 

కర్ణాటక 

1

ఆర్ఈఈ, యూరియం 

మధ్య ప్రదేశ్ 

1

టిటానియం, వెనాడియం,  అలూమినస్  లాటెరైట్ 

ఒడిశా 

3

గ్రాఫైట్ 

రాజస్థాన్ 

2

ఆర్ఈఈ: టంగ్స్టెన్, లిథియం,   అనుబంధ ఖనిజాలు

తెలంగాణ 

2

వెనాడియం, టిటానియం,  ఆలూమినస్ లాటెరైట్

ఉత్తరాఖండ్ 

1

రాక్ ఫాస్ఫేట్

ఈ వేలంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్(ఆర్ఈఈ), టంగ్‌స్టన్, లిథియం, గ్రాఫైట్, వెనాడియం, టైటానియం, గ్లాకోనైట్, రాక్ ఫాస్ఫేట్ వంటి వివిధ రకాల ఖనిజ బ్లాకులు ఉన్నాయి. ఇవి స్వచ్ఛ ఇంధన సాంకేతికత, అత్యాధునిక తయారీ రంగం, ఎరువులు, వ్యూహాత్మక అవసరాలకు ఎంతో కీలకమైనవి. తద్వారా ఇవి భారత ఖనిజ భద్రతను పటిష్టం చేస్తూ, దేశ ఇంధన మార్పుకు ఊతమిస్తాయి.

ఇటీవలి విధానపరమైన సంస్కరణల ద్వారా వేలం నిబంధనలను మరింత పటిష్టం చేశారు. ఖనిజ (వేలం) రెండో సవరణ నిబంధనలు - 2025 ప్రకారం,  వేలం పూర్తయిన తర్వాత సమర్పించాల్సిన పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ, అడ్వాన్స్ పేమెంట్, లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ వంటి ప్రక్రియల కాలపరిమితిని క్రమబద్ధీకరించారు. అదే సమయంలో సంబంధిత వర్గాలన్నీ నిర్ణీత సమయంలోగా నిబంధనలను పాటించేలా కొత్త నిబంధనలను చేర్చారు. దీనివల్ల వేలం పూర్తయిన బ్లాకుల్లో తవ్వకాలు వేగంగా ప్రారంభం కావడానికి మార్గం సుగమమైంది. అంతేకాకుండా, ఖనిజ (వేలం) సవరణ నిబంధనలు - 2026 ద్వారా బ్యాంక్ గ్యారెంటీలకు ప్రత్యామ్నాయంగా 'ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్' విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది వేలంలో పాల్గొనే బిడ్డర్లకు మరింత వెసులుబాటు కల్పిస్తుంది.

  టెండర్ పత్రాల విక్రయం మార్చి 30, 2026 సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. వీటిని కొనుగోలు చేయడానికి మే 18, 2026 సోమవారం (సాయంత్రం 5 గంటల వరకు) గడువు నిర్ణయించారు. ఇక బిడ్‌లను సమర్పించడానికి మే 25, 2026 సోమవారం (సాయంత్రం 5 గంటల వరకు) గడువు ఇచ్చారు.

ఈ వేలం ప్రక్రియను అత్యంత పారదర్శకంగా రెండు దశల్లో ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. ఖనిజ విలువల ఆధారంగా అత్యధిక శాతం  కోట్ చేసిన బిడ్డర్‌ను విజేతగా ఎంపిక చేస్తారు. బ్లాకులు, వేలం నిబంధనలు, గడువుల గురించి పూర్తి వివరాలను ఎంఎస్టీసీ వేలం ప్లాట్‌ఫామ్‌ https://www.mstcecommerce.com/auctionhome/mlcln/ లో చూడవచ్చు. 

 

***


(రిలీజ్ ఐడి: 2244200) సందర్శకుల సూచీ సంఖ్య : : 33
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी