బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశ ఇంధన భద్రతకు, పారిశ్రామిక అభివృద్ధికి కోల్ గ్యాసిఫికేషన్ కీలకం: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

प्रविष्टि तिथि: 22 MAR 2026 8:29PM by PIB Hyderabad

భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్-2026 సందర్భంగా కేంద్ర బొగ్గుగనుల మంత్రి జికిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయటానికిదిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించటానికిపారిశ్రామిక వృద్ధికి మద్దతిచ్చేందుకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని స్పష్టం చేశారు.

 

పారిశ్రామిక నేతలునిపుణులుఅంకుర సంస్థలుపరిశోధకులువిద్యార్థులువిధాన రూపకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. శరవేగంగా విస్తరిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధిసుస్థిరతను సమన్వయం చేసే సమతుల్య ఇంధన విధానం అవసరమని కేంద్రమంత్రి అన్నారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో తయారీ రంగంమౌలిక సదుపాయాల కల్పనడిజిటల్ అనుసంధానతఆవిష్కరణల రంగాల్లో దేశం బలమైన వృద్ధిని కనబరుస్తోందని తెలిపారు.

 

భారతదేశంలో దాదాపు 400 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయనిప్రపంచంలోనే ఇవి అత్యధికమని కేంద్రమంత్రి వెల్లడించారుదేశ ఇంధన అవసరాల్లో 55%, విద్యుత్ ఉత్పత్తిలో 74% వాటా బొగ్గుదని పేర్కొన్నారుఏటా బొగ్గు డిమాండ్ ఒక బిలియన్ టన్నుగా ఉందని, 2047 నాటికి ఇది పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారుపెరుగుతున్న బొగ్గు ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుందన్నారు. 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా మారాలన్న లక్ష్యానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.

 

విప్లవాత్మక సాంకేతిక మార్పునకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమనిదీనిద్వారా బొగ్గును సిన్‌గ్యాస్‌గా మార్చవచ్చని వివరించారుసిన్‌గ్యాస్‌ను స్వచ్ఛ ఇంధనంఎరువులుహైడ్రోజన్ ఉత్పత్తికి ఉపయోగించవచ్చని తెలిపారుఈ విధానంతో స్వదేశీ వనరులను మరింత సమర్థవంతంగాపర్యావరణహితంగా వినియోగించుకోవటమే కాకదేశ ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేయవచ్చన్నారుముడి చమురు దాదాపు 83%, సహజ వాయువు 50%, మెథనాల్ఎరువులు 90% కిపైగా దిగుమతులపై భారత్ ఆధారపడుతున్న నేపథ్యంలో ఇంధన భద్రత దేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యతగా మారిందని పేర్కొన్నారు.

 

కోల్ గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం.. నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్‌ను ప్రారంభించిందిఇందులో భాగంగా 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫికేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందిప్రభుత్వప్రైవేట్ రంగ ప్రాజెక్టులకు చేయూతనిచ్చేందుకు రూ.8,500 కోట్ల ప్రోత్సాహక నిధిని కేటాయించిందిఇప్పటికే ఈ రంగంలో భారీ ప్రాజెక్టులు ప్రారంభమవగారూ.64,000 కోట్లకు పైగా పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయిగతంలో అందుబాటులోకి రాని బొగ్గు నిల్వలను వెలికితీయటంపర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించగల భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీవంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల ప్రాముఖ్యతను స్పష్టం చేశారు.

 

పరిశ్రమలువిద్యా సంస్థలుఅంకుర సంస్థలుపరిశోధనా సంస్థలు.. సమన్వయంతో పనిచేసే వ్యవస్థ కోసం కేంద్ర మంత్రి పిలుపునిచ్చారువిద్యుత్చమురుగ్యాస్ఎరువుల వంటి రంగాలకు కోల్ గ్యాసిఫికేషన్ విస్తరించిందని తెలిపారుఈ రంగంలో ముందస్తు భాగస్వామ్యంపెట్టుబడుల ప్రోత్సాహానికి సరళమైన ఆమోద ప్రక్రియలుసహాయక విధానాలుప్రోత్సాహకాలను అందించేందుకు భారత ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

ఆవిష్కరణలుస్వదేశీ సాంకేతికత అభివృద్ధిసమన్వయ ప్రయత్నాలతో ఇంధన భద్రతసుస్థిరతస్వావలంబన దిశగా అడుగులు వేస్తూ క్లీన్ కోల్ సాంకేతికతలో ప్రపంచ నాయకుడిగా భారత్ ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

***


(रिलीज़ आईडी: 2243877) आगंतुक पटल : 66
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी