శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లోని ఏఆర్‌సీఐలో ఎన్‌డీ-ఎఫ్‌ఈ-బీ రేర్ ఎర్త్‌ శాశ్వత అయస్కాంతాల తయారీకి పైలట్‌ ప్లాంట్‌ ఏర్పాటు

నాడు పోస్టు చేయడమైనది: 20 MAR 2026 5:02PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ శాస్త్రసాంకేతిక విభాగం (డీఎస్‌టీపరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీన్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ), హైదరాబాద్‌లో ఎన్‌డీ-ఎఫ్‌ఈ-బీ (నియోడైమియమ్-ఐరన్-బోరాన్రేర్ ఎర్త్‌ శాశ్వత అయస్కాంతాల తయారీకి పైలట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.

భారత ప్రభుత్వ శాస్త్రసాంకేతిక విభాగం డీఎస్‌టీ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరందికర్ ఈ పైలట్ ప్లాంట్‌ను ప్రారంభించారుఏఆర్‌సీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో... డీఎస్‌టీ మాజీ కార్యదర్శిఏఆర్‌సీఐ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రొఫెసర్ అశుతోష్ శర్మమిధాని మాజీ సీఎండీటెక్నికల్ రివ్యూ కమిటీ సభ్యులు డాక్టర్ ఎస్.కెఝాఅనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్‌ఎఫ్‌సీఈఓ డాక్టర్ శివకుమార్ కళ్యాణరామన్ తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారువీరితో పాటు వివిధ పరిశ్రమలుజాతీయ సంస్థల ప్రతినిధులుఇతర భాగస్వాములు హాజరయ్యారు.

మిశ్రమ లోహం తయారీ నుంచి పూర్తి స్థాయి సింటర్డ్‌ మ్యాగ్నెట్ల ఉత్పత్తి వరకు అన్నీ ఒకేచోట పూర్తి చేసే సమగ్ర విధానంతో ఏఆర్‌సీఐలో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారుపటిష్టమైనస్వావలంబన తయారీ వ్యవస్థ అభివృద్ధికి ఇది దోహదపడుతుంది.

కీలక ఖనిజాల రంగంలో స్వావలంబన సాధించేందుకు ప్రపంచ రేర్ ఎర్త్ విలువ వ్యవస్థలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయటానికి ఈ పైలట్ ప్లాంట్ కీలక ముందడుగుని సూచిస్తుందిఎలక్ట్రిక్ వాహనాలుపునరుత్పాదక ఇంధన వ్యవస్థలుఎలక్ట్రానిక్స్అధునాతన సాంకేతికత తయారీలో ఎన్‌డీ-ఎఫ్‌-బీ అయస్కాంతాలు కీలకమైనవి.

పైలట్‌ ప్లాంట్ ప్రారంభం సందర్భంగా ప్రొఫెసర్ కరందికర్ మాట్లాడుతూ.. ప్రపంచ సరఫరా వ్యవస్థలో తలెత్తుతున్న అస్థిరతలుస్వచ్ఛ ఇంధనంఅధునాతన తయారీ రంగాల్లో భారతదేశానికి పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా కీలక ఖనిజాల విషయంలో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని సాధించే దిశగా ఈ ప్లాంట్ కీలకమని తెలిపారు. "వికసిత్ భారత్-2047 లక్ష్యంగా సాగుతున్న తరుణంలో వనరుల కొరతను అధిగమించటంకీలక సాంకేతికతల్లో స్వదేశీ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవటం అభివృద్ధి వ్యూహంలో అత్యంత కీలకంఇలాంటి కార్యక్రమాలు ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించటమే కాక.. దేశ స్థిరత్వాన్నిపోటీతత్వాన్ని పెంపొందిస్తాయిఅని వ్యాఖ్యానించారు.

వాణిజ్యపరంగా విస్తరించదగిన ఆవిష్కరణలుగా పరిశోధనలను మార్చేందుకు.. సంస్థాగత వ్యవస్థలునిర్దేశిత లక్ష్యాలతో కూడిన కార్యక్రమాల ద్వారా అనుకూలమైన వ్యస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రొఫెసర్ కరందికర్ తెలిపారుఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్‌ను నిలిపేందుకు పరిశ్రమలుఅంకుర సంస్థలువిద్యా సంస్థలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ అయస్కాంతాల సరఫరా వ్యవస్థ కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైందిఇది అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇబ్బందికరంగా మారిందిముడి పదార్థాల సేకరణ నుంచి అయస్కాంతాల తయారీ వరకు ప్రతి దశలోనూ స్వదేశీ పరిజ్ఞానాన్నిసామర్థ్యాన్ని పెంపొందించుకోవటం వల్ల సరఫరాలో భద్రతతక్కువ ధరకే లభ్యతసాంకేతిక రంగంలో అగ్రగామిగా ఎదిగే అవకాశం లభిస్తుంది.

సాంకేతికతను ధ్రువీకరించటానికితయారీ ప్రక్రియను మెరుగుపరచటానికి కీలక వేదికగా ఈ పైలట్ ప్లాంట్ నిలుస్తుందిపరిశ్రమల సహకారానికిప్రదర్శనలకుస్వదేశీ ఆవిష్కరణలను వాణిజ్యపరమైన ఉత్పత్తి స్థాయికి తీసుకెళ్లటానికి.. డీప్ టెక్ అంకుర సంస్థలుప్రైవేటు రంగానికి మద్దతివ్వటానికి ఇది దోహదపడుతుంది.

పరిశోధన స్థాయి నుంచి తయారీకి మారడమే ఈ పైలట్ ప్లాంట్ ప్రధాన ఉద్దేశంనిరంతర ఆవిష్కరణలకుప్రక్రియల మెరుగుదలకునూతనోత్పత్తుల అభివృద్ధికి ఇది దోహదపడుతుందిఅని ప్రొఫెసర్ శర్మ పేర్కొన్నారు.

 

భారత ఈవీ వ్యవస్థను బలోపేతం చేయటంతో పాటు కీలకమైన సాంకేతికతలను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన మిషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ హై-ఇంపాక్ట్ ఏరియాస్ (మహాకార్యక్రమాల గురించి ఏఎన్‌ఆర్‌ఎఫ్‌ సీఈఓ డాక్టర్ శివకుమార్ కళ్యాణరామన్ వివరించారుపరిశోధనలను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు క్రియాశీలక భాగస్వాములుగా ఉండాలని ప్రైవేట్ రంగాలను ఆహ్వానించారు.

అరుదైన మూలకాలను వెలికి తీయటం నుంచి అయస్కాంతాల తయారీ వరకు పూర్తిస్థాయి 'మినరల్-టు-మార్కెట్వ్యవస్థను ఏఆర్‌సీఐ అభివృద్ధి చేస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్విజయ్ తెలిపారుఇది పరిశోధనలను వాణిజ్య ఉత్పత్తులుగా మార్చటంతో పాటు పరిశ్రమలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.

పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించటంనూతన ఆవిష్కరణలను ప్రోత్సహించటంస్వదేశీ రేర్ ఎర్త్ అయస్కాంత సాంకేతికతను వాణిజ్య స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ పైలట్ ప్లాంట్ దోహదపడుతుందిఇది భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహన రంగానికిఅధునాతన పదార్థాల తయారీ రంగానికి ఊతమిస్తుంది.

ఈ కార్యక్రమం ఆత్మనిర్భర్ భారత్ సాధనకువికసిత్ భారత్-2047 సాకారం దిశగా వేసిన కీలక ముందడుగును సూచిస్తుంది.

 


 

***


(రిలీజ్ ఐడి: 2243349) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी