బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తూ.. మరోసారి 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయిని సాధించిన భారత్‌..

నాడు పోస్టు చేయడమైనది: 21 MAR 2026 12:06PM by PIB Hyderabad

బొగ్గు రంగంలో నిరంతర, సమన్వయ ప్రయత్నాలతోపాటు భాగస్వాములందరి అమూల్యమైన సహకారంతో 20 మార్చి 2026 నాటికి భారత్‌ 1 బిలియన్ టన్నుల  బొగ్గు ఉత్పత్తి మైలురాయిని  సాధించింది. వరుసగా రెండో ఏడాది దేశం ఈ ఘనత సాధించడం విశేషం. ఈ కీలక పరిణామం ఇంధన రంగంలో భారత్‌ ఎదుగుతున్న స్వయంసమృద్ధిని, కీలక పరిశ్రమలకు అంతరాయం లేని ఇంధన సరఫరాను నిర్ధారించడంలో దేశ నిబద్ధతను స్పష్టం చేస్తోంది.

ఈ పెరిగిన, నిలకడైన బొగ్గు ఉత్పత్తి స్థాయిలు దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను సమర్థవంతంగా తీర్చడమే కాకుండా, బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రికార్డు స్థాయి నిల్వలను నిర్వహించేందుకు విద్యుత్ రంగానికి తోడ్పడుతున్నాయి. బొగ్గు రంగం అంతటా పటిష్టమైన ప్రణాళిక, సమర్థవంతమైన అమలు, బలమైన సమన్వయానికి ఈ విజయం అద్దం పడుతోంది. తద్వారా ఇది దేశ ఆర్థిక వృద్ధి పథానికి గణనీయంగా దోహదపడుతోంది.

స్థిరమైన, పారదర్శకమైన, పనితీరు ఆధారిత వ్యవస్థను పెంపొందించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ తన నిబద్ధతను కొనసాగిస్తుంది. ముందస్తు విధానపరమైన చర్యలు, కఠినమైన పనితీరు పర్యవేక్షణ, భాగస్వాములతో సన్నిహితంగా ఉండటం ద్వారా మంత్రిత్వ శాఖ అన్ని రంగాల్లో నమ్మకమైన బొగ్గు లభ్యతను, నిరాటంకమైన కార్యకలాపాలను నిర్ధారిస్తోంది.

‘‘వికసిత్ భారత్ 2047’’ జాతీయ దార్శనికతకు అనుగుణంగా సాగుతున్న ఈ ప్రయత్నాలు  స్థితిస్థాపక శక్తితో కూడిన ఇంధన వ్యవస్థను నిర్మించడానికి, దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడానికి, సుస్థిర ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బలపరుస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2243330) సందర్శకుల సూచీ సంఖ్య : : 25
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi