బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశ ఇంధన భద్రతలో బొగ్గుదే కీలక పాత్ర దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం విస్తరిస్తున్నప్పటికీ తగ్గని ప్రాధాన్యం

నాడు పోస్టు చేయడమైనది: 19 MAR 2026 1:34PM by PIB Hyderabad

దేశ ఆర్థిక వికాసానికి ఆధారంగా నిలుస్తున్న ఉక్కు, సిమెంటు వంటి కీలక పరిశ్రమలకు దన్నుగా నిలిచేలా.. అంతరాయం లేకుండా నమ్మకమైన విద్యుత్ సరఫరాదారుగా బొగ్గు కొనసాగుతోంది.

వినియోగదారుల నుంచి ప్రస్తుత డిమాండుకు అనుగుణంగా దేశంలో బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోంది. వినియోగదారుల అవసరాల మేరకు తగినంత సరఫరా చేయడానికి వీలుగా గనుల వద్ద తగిన నిల్వలను సిద్ధం చేస్తున్నారు. సరఫరా కోసం రైల్వే శాఖ నిరంతరం సహకరిస్తోంది.

కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) గనుల వద్ద 2025 ఏప్రిల్ 1 నాటికి 106.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, 2026 మార్చి 18 నాటికి అవి 125.54 మిలియన్ టన్నులకు పెరిగాయి. అదనంగా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) గనుల వద్ద దాదాపు 5.75 మిలియన్ టన్నులు, క్యాప్టివ్ / వాణిజ్య గనుల వద్ద మరో 15.75 మిలియన్ టన్ను బొగ్గు నిల్వలు ఉన్నాయి. అలాగే దాదాపు 12 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా అవుతుండగా.. దాదాపు మరో 5.49 మిలియన్ టన్నుల బొగ్గు ఓడరేవులు, రైల్వే గూడ్స్ నిల్వ కేంద్రాల వద్ద ఉంది.

విద్యుత్ ప్లాంట్ల వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న దాదాపు 53.41 మిలియన్ టన్నుల బొగ్గుకు ఈ నిల్వ అదనం. ప్రస్తుత వినియోగ రేటు ప్రకారం ఇది దాదాపు 23 రోజులకు సరిపోతుంది.

చిన్న, మధ్యతరహా, ఇతర వినియోగదారులు సహా అందరికీ బొగ్గు సరఫరా చేయడం కోసం కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 2026 మార్చిలో దాదాపు 23.56 మిలియన్ టన్నుల బొగ్గును విక్రయానికి ఉంచుతూ 29 ఇ-వేలం ప్రక్రియలను నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది. ఈ 29 వేలాల్లో 2026 మార్చి 12 నుంచి ఇప్పటికే అయిదు వేల పాటలు పూర్తయ్యాయి. వీటి ద్వారా 73.1 లక్షల టన్నుల బొగ్గును అమ్మకానికి ఉంచగా, కొనుగోలు దారులు 31.96 లక్షల టన్నుల బొగ్గు బుక్ చేసుకున్నారు. ఇ-వేలంలో తగిన పరిమాణంలో బొగ్గు అందుబాటులో ఉందని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. దీనితోపాటు

రాష్ట్రాల నామినేటెడ్ సంస్థల ద్వారా చిన్న, మధ్యతరహా, ఇతర వినియోగదారులకు బొగ్గు లభించేలా చూసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ తగిన చర్యలు తీసుకుంది. అలాగే ఇంధన కొరత తలెత్తకుండా ఉండేందుకు అదనపు బొగ్గు అవసరాలపై సమాచారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. నిరంతరాయంగా సరఫరా జరిగేలా చూడడం లక్ష్యంగా.. ఈ ఏజెన్సీల ద్వారా రాష్ట్రాలు తీసుకుంటున్న బొగ్గు పరిమాణాన్ని సీఐఎల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

స్థిరమైన, పారదర్శకమైన, పనితీరు ఆధారిత వ్యవస్థను పెంపొందించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. నిరంతర విధానపరమైన మద్దతు, పటిష్టమైన పర్యవేక్షణ యంత్రాంగాలు, సంబంధిత భాగస్వాములతో క్రియాశీల సమన్వయం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేస్తోంది. బొగ్గు లభ్యతలో అంతరాయం లేకుండా చూడడం, కీలక రంగాల్లో కార్యకలాపాలు ఆటంకం లేకుండా సాగేలా చూడడం, పెరుగుతున్న దేశ ఇంధన అవసరాలను సమర్థంగా తీర్చడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యం. తద్వారా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధించాలన్న దేశ దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఇవి తోడ్పాటునందిస్తాయి.

***

 


(రిలీజ్ ఐడి: 2242660) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी