గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బీహార్లో 18, 19 తేదీల్లో ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పర్యవేక్షణ వ్యవస్థలు, పర్యావరణ ఖాతాల కూర్పు, లింగ గణాంకాల’పై సామర్థ్య నిర్మాణ కార్యశాల

प्रविष्टि तिथि: 17 MAR 2026 10:09AM by PIB Hyderabad

నాణ్యమైనవిస్తృతమైన సమాచారాన్ని అందించేందుకు గణాంకాలుకార్యక్రమాల అమలు (ఎంవోఎస్‌పీఐమంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోందిదీనిలో భాగంగానే బీహార్లోని పాట్నాలో 2026 మార్చి 18, 19 తేదీల్లో ఎంవోఎస్‌పీఐ రెండు రోజుల సామర్థ్య నిర్మాణ వర్కుషాపును నిర్వహిస్తోంది. ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పర్యవేక్షణ వ్యవస్థలుపర్యావరణ ఖాతాల కూర్పులింగ గణాంకాలు’ అనే అంశంపై ఈ వర్కుషాపు జరుగుతుందిఈ కార్యక్రమానికి బీహార్ ప్రభుత్వం సహకారాన్ని అందిస్తోందిసాంకేతిక తోడ్పాటును ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ)-ఇండియా అందిస్తోందిఈ కార్యక్రమం ఎస్డీజీలుపర్యావరణంలింగం అనే మూడు ప్రధానాంశాల్లో సాక్ష్యం ఆధారంగా నిర్ణయం తీసుకొనే సాధికారతను కల్పిస్తుందికీలకమైన సమస్యలను చర్చించడానికితాము అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతుల గురించి తెలియజేయడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలురాష్ట్రాలు/యూటీల విభాగాలుఇతర అంతర్జాతీయ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.

ఈ కార్యక్రమానికి బీహార్ ప్రణాళికఅభివృద్ధి శాఖ మంత్రిఎంవోఎస్‌పీఐ కార్యదర్శిబీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిఎంవోఎస్‌పీఐకు సంబంధించిన ఇతర సీనియర్ అధికారులుబీహార్ రాష్ట్ర అధికారులుయూఎన్ ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.

ఎస్డీజీలులింగ గణాంకాలపై ప్రత్యేక చర్చలు మొదటి రోజు జరుగుతాయిసంబంధిత మంత్రిత్వ శాఖ/విభాగాలురాష్ట్ర ప్రభుత్వాలుసంస్థలుయూఎన్ ఏజెన్సీల ప్రతినిధులు తమ అనుభవాలనుఆలోచనలను పంచుకుంటారుఎస్డీజీలపై చేపట్టే మొదటి సాంకేతిక సెషన్లో సుస్థిరాభివృద్ధి సూచికలకు అనుగుణంగా ఉండే జాతీయ సూచిక వ్యవస్థ (ఎన్ఐఎఫ్), రాష్ట్ర సూచిక వ్యవస్థ వంటి కీలకాంశాలపై దృష్టి సారిస్తారుసాధారణ పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కాకుండా సాక్ష్యం ఆధారిత విధాన రూపకల్పనకుపరిపాలనలో ఎస్డీజీ సమాచారం ఎలా ఉపయోగపడుతుందో ఈ కార్యక్రమం వివరిస్తుందియూఎన్ సంస్థలు సైతం తమ విలువైన ఆలోచనలనుఅనుభవాలను చర్చలో పంచుకుంటాయిదీనికి అదనంగా లింగ గణాంకాలపై రెండో సాంకేతిక కార్యక్రమం నిర్వహిస్తారుమహిళల నేతృత్వంలో అభివృద్ధిని ప్రోత్సహించడంలోనూలింగ సమానత్వ విధానాన్ని సాధించేందుకు సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంలో లింగ గణాంకాలు పోషించే పాత్ర గురించి ఈ సెషన్లో పరిశీలిస్తారు.

రెండో రోజు నిర్వహించే వర్కుషాపులో పర్యావరణపరమైన అంశాలపై దృష్టి సారించేందుకు ప్రాధాన్యమిస్తారుపర్యావరణ గణాంకాల కోసం ఎస్ఈఈఏ నియమావళిఅటవీ సేవల విలువను నిర్ధారించే పద్ధతులుజీవవైవిధ్యంఇతర వ్యవస్థలు అందించే సేవలపై చర్చిస్తారుఅలాగే పర్యావరణ ఖాతాలను క్రోడీకరించడంలోమెరుగుపరచడంలో తమ అనుభవాలను రాష్ట్రాలు పంచుకుంటాయిఈ అంశాలపై పర్యావరణ నిపుణులు కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటారు.

***


(रिलीज़ आईडी: 2241095) आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी