పర్యటక మంత్రిత్వ శాఖ
క్యారవాన్ పర్యాటక ప్రోత్సాహం
నాడు పోస్టు చేయడమైనది:
16 MAR 2026 3:44PM by PIB Hyderabad
క్యారవాన్ టూరిజంతో సహా పర్యాటక ప్రాంతాలు, ఉత్పత్తుల అభివృద్ధి, ప్రచారాన్ని ప్రధానంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలననే నిర్వహిస్తుంది. దేశాన్ని సమగ్ర పద్ధతిలో ప్రోత్సహించేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది.
దేశంలో పర్యాటక ప్రాంతాల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ తన కేంద్ర రంగ పథకాలైన ‘స్వదేశ్ దర్శన్’, ‘ప్రసాద్’ (తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక, వారసత్వ అభివృద్ధి కార్యక్రమం), ‘పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర సంస్థలకు సహాయం’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందిన ప్రతిపాదనలు, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికల ఆధారంగా ఈ ఆర్థిక సహయాన్ని అందిస్తుంది.
పర్యాటక మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఎటువంటి క్యారవాన్ పర్యాటక ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైన ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల జాబితా కింది అనుబంధంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టుల జాబితా
ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నేడు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలియజేశారు.
(రిలీజ్ ఐడి: 2240832)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8