సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దక్షిణ భారత సాంస్కృతిక వారసత్వ ప్రోత్సాహం

నాడు పోస్టు చేయడమైనది: 16 MAR 2026 12:54PM by PIB Hyderabad

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థల ద్వారా దక్షిణ భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వీటిలో చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్సంగీత నాటక అకాడమీ,  తంజావూరులోని దక్షిణ మండల సాంస్కృతిక కేంద్రం ముఖ్యమైనవి. ఈ ప్రాంతంలోని సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడానికి ప్రోత్సహించడానికి ఈ సంస్థలు శిక్షణప్రదర్శనలుపరిశోధనడాక్యుమెంటేషన్వర్క్‌షాప్‌లుపండుగలు వంటి అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తాయి. భరతనాట్యంకర్ణాటక సంగీత శిక్షణజానపదగిరిజన కళారూపాలకు మద్దతివ్వడంకూడియాట్టంపులికలితోలుబొమ్మలాటతోల్పవకూత్తు వంటి సాంప్రదాయ కళలను డాక్యుమెంట్ చేయడంప్రోత్సహించడం వీటి ప్రధాన ఉద్దేశ్యం.

దక్షిణ భారత సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఓనందసరాపొంగల్సంక్రాంతి వంటి పండుగలను తంజావూరులోని దక్షిణ మండల సాంస్కృతిక కేంద్రం నిర్వహిస్తుందిజానపదగిరిజన కళాకారులకు గౌరవ వేతనంప్రయాణ భత్యంవసతి సౌకర్యాలను కల్పిస్తుంది. శాస్త్రీయ కళలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ నిధులతో సునాదంకథకళి ఉత్సవంవార్షిక కళా ఉత్సవం, ‘రిమెంబరింగ్ రుక్మిణి దేవి’ వంటి కార్యక్రమాలను చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్ నిర్వహిస్తుంది.

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భరతనాట్యంకథకళికూచిపూడియక్షగానం వంటి శాస్త్రీయ కళారూపాలను ప్రోత్సహిస్తుంది. దక్షిణ మండల సాంస్కృతిక కేంద్రం తన సభ్య రాష్ట్రాలతో కలిసి ఉత్సవాలుకార్యక్రమాలను నిర్వహిస్తుంది. గత రెండేళ్లలో దాదాపు 706 మంది శాస్త్రీయ కళాకారులను ఇందులో భాగస్వాములను చేసింది. కళాక్షేత్ర ఫౌండేషన్సంగీత నాటక అకాడమీ దేశవ్యాప్తంగా ప్రదర్శనలువర్క్‌షాప్‌లుఉమ్మడి సహకార సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఈ సంప్రదాయాలకు మరింత మద్దతు ఇస్తున్నాయి.

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థల ద్వారా సాంస్కృతిక మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దేశవ్యాప్తంగా దక్షిణ భారత సంప్రదాయాలను ప్రదర్శిస్తుంది. సంగీత నాటక అకాడమీ తన ఉత్సవాల్లో దక్షిణ భారత ప్రదర్శన కళలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కళారూపాలను ఆహ్వానించి ప్రదర్శిస్తుంది. తంజావూరులోని దక్షిణ మండల సాంస్కృతిక కేంద్రం దాని సభ్య రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూఆసక్తిగా పాల్గొంటుంది. (దీనికి సంబంధించిన వివరాలు అనుబంధం-లో ఉన్నాయి)

ఆంధ్రప్రదేశ్తెలంగాణకర్ణాటకకేరళతమిళనాడు రాష్ట్రాలతో పాటు అండమాన్- నికోబార్ దీవులులక్షద్వీప్, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాల సాంస్కృతిక అవసరాలను తీర్చడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే తమిళనాడులోని తంజావూరులో దక్షిణ మండల సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సంగీత నాటక అకాడమీ తిరువనంతపురంలోని కూడియాట్టం కేంద్రం ద్వారా శాస్త్రీయ సంస్కృత నాటకాన్ని ప్రోత్సహిస్తుంది. కొత్త మ్యూజియాల ఏర్పాటుఇప్పటికే ఉన్న వాటి ఆధునీకరణఅభివృద్ధిడిజిటలైజేషన్ కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మ్యూజియం గ్రాంట్ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం పూర్తి వివరాలు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ https://culture.gov.in/ లో అందుబాటులో ఉన్నాయి.

సంగీత నాటక అకాడమీ ద్వారా సాంస్కృతిక సంస్థలకు ఆర్థిక సహాయం పథకం కింద సంగీతంనృత్యంనాటక రంగాల్లో శిక్షణను ప్రోత్సహించడానికి నాటకాలుబ్యాలెట్ (నృత్య రూపకాలు) వంటి కొత్త ప్రదర్శనలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దక్షిణ మండల సాంస్కృతిక కేంద్రం కూడా పాల్గొనే కళాకారులకు మొదటి రోజు రూ. 3,000, రెండో రోజు రూ. 1,500, మిగిలిన రోజుల్లో రూ. 900 (రోజుకు) గౌరవ వేతనాన్ని అందిస్తూ మద్దతు ఇస్తుంది. వీటితోపాటు మంత్రిత్వ శాఖ వివిధ పథకాల ద్వారా కళాకారులకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. గత మూడు సంవత్సరాలలో ఈ పథకాల కింద పంపిణీ చేసిన నిధుల వివరాలు అనుబంధం-బీ లో పొందుపరిచారు. 

అనుబంధం-ఏ
తంజావూరులోని దక్షిణ మండల సాంస్కృతిక కేంద్రం: సభ్య రాష్ట్రాల వెలుపల జరిగే ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగస్వామ్యం 

 

అనుబంధం-బీ
నిర్వహణలోని వివిధ పథకాల కింద పంపిణీ చేసిన నిధులు ,లబ్ధిదారుల వివరాలు

 

ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నేడు లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలియజేశారు.

***


(రిలీజ్ ఐడి: 2240741) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी