రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం వేగవంతం


ఒకే నెలలో పునర్నిర్మాణం పూర్తి కానున్న మరో 8 స్టేషన్లు.. మొత్తం 180కి చేరిన అమృత్ భారత్ స్టేషన్ల సంఖ్య

తాజాగా పునర్నిర్మించిన స్టేషన్ల జాబితాలో కేరళలోని అంగమాలి ఫర్ కాలడి, ఫెరోక్, నిలంబూర్ రోడ్, త్రిపుణితుర.. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా.. తమిళనాడులోని మాంబలం.. ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలు జంక్షన్.. తెలంగాణలోని రామగుండం స్టేషన్లు

దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన స్టేషన్ భవనాలు, షెల్టర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, వేచి ఉండే గదులు, మరుగుదొడ్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, పార్కింగ్, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు, ఇతర ప్రయాణికుల- సరుకు రవాణా సౌకర్యాలతో భారత్‌లో రైలు ప్రయాణ అనుభవాన్ని మారుస్తున్న అమృత్ భారత్ స్టేషన్లు

స్థూల బడ్జెట్ కేటాయింపుల్లో 97 శాతం వినియోగంతో ఇటీవలి సంవత్సరాల్లో ప్రాజెక్ట్‌ల అమలు సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్న రైల్వే శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 4:40PM by PIB Hyderabad

భారతీయ రైల్వేల స్థూల బడ్జెట్ కేటాయింపుల వినియోగం ఈ కింది విధంగా ఉంది:

ఆర్థిక సంవత్సరం

స్థూల బడ్జెట్ కేటాయింపులు (రూ. కోట్లలో)

వినియోగం(శాతంలో)

2024-25

2,52,200

100 శాతం

2025-26

2,52,200

~ 97 శాతం

(09.03.2026 నాటికి)

ఇటీవలి సంవత్సరాల్లో ప్రాజెక్ట్ అమలు సామర్థ్యాన్ని భారతీయ రైల్వే గణనీయంగా పెంచుకుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 32,300 కోట్లుగా ఉన్న రైల్వే స్థూల బడ్జెట్ కేటాయింపులు.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సుమారు 8 రెట్లు పెరిగి రూ. 2,52,200 కోట్లకు చేరుకుంది. ఇది రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడింది.

దీర్ఘకాలిక దృక్పథంతో రైల్వే స్టేషన్లను పునర్నిర్మించడం కోసం 'అమృత్ భారత్ స్టేషన్పథకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి కోసం ఇప్పటివరకు 1,337 స్టేషన్లను గుర్తించారు. ఈ పథకం కింద రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 180 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు పనులు పూర్తయిన స్టేషన్ల జాబితా:

అల్నావర్అంబ్ అందౌరాఅంబికాపూర్ఆమ్‌గావ్ఆనంద్‌పూర్ సాహిబ్అనారాఅంగమాలి ఫర్ కాలడిఅయోధ్య ధామ్బాదామిబాగల్‌కోట్బైజినాథ్ పాప్రోలాబలరాంపూర్బంటవాలాబారాభూమ్బారామతిబరేలీ సిటీబారిపడబార్మర్బార్పాలిబేగంపేటబెయోహారిభానుప్రతాప్‌పూర్భిలాయ్భింద్బిజ్నోర్బిమల్‌గఢ్బొమ్మిడిబుందీచందా ఫోర్ట్చలకుడిచంగనస్సేరిచెన్నై పార్క్చింద్వారాచిదంబరంచించ్‌పోక్లిచిన్న సేలంచిరాయింకీజ్కటక్డాకోర్డెరోల్దేశ్నోక్దేవ్లాలీధార్వాడ్ధులేడోంగర్‌గఢ్ఫతేహాబాద్ఫతేపూర్ఫతేపూర్ షెకావతిఫెరోక్గడగ్గంగాపూర్ సిటీగొడ్డగోధ్రా జంక్షన్గోగామేరిగోకాక్ రోడ్గోలా గోకర్నాథ్గోమతీ నగర్గోవర్ధన్గోవింద్ గఢ్గోవింద్‌పురిగోవింద్‌పూర్ రోడ్హఫీజ్‌పేటహైబర్‌గావ్హల్దియాహపాహర్పాల్‌పూర్హత్రాస్ సిటీహోడల్ఈద్గా ఆగ్రా జంక్షన్ఇజ్జత్‌నగర్జైసల్మేర్జామ్ జోధ్‌పూర్జామ్ వంతలీజాయ్‌చండీ పహార్జున్నార్ దేవ్కాకినాడ టౌన్కళ్యాణి ఘోష్‌పరాకామాఖ్యగురికనలుస్ జంక్షన్కరైకుడి జంక్షన్కరమ్ సాద్కరీంనగర్కట్నీ సౌత్కేడ్గావ్ఖైర్తాల్ఖంబాలియాఖలీలాబాద్కొప్పల్కోసంబా జంక్షన్కులిత్తురైకుట్టిప్పురంలాసల్‌గావ్లింబ్డిలోహర్దగాలోనంద్ జంక్షన్మాహెమహువామైలానీమండల్ గఢ్మండవర్ మహ్వా రోడ్మధుపూర్మాంబలంమనపారైమండి డబ్వాలీమంగళగిరిమన్నార్గుడిమతుంగఎం.సి.ఎస్. ఛతర్‌పూర్మిథాపూర్మొరప్పూర్మోర్బిముక్త్సార్మునీరాబాద్మురి జంక్షన్ముర్తిజాపూర్ జంక్షన్నైన్‌పూర్ జంక్షన్నందురానర్మదాపురం (హోషంగాబాద్)నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారీ జంక్షన్నిడదవోలు జంక్షన్నిలంబూర్ రోడ్ఓఖాఓర్చాపాలిటానాపనాగఢ్పంకి ధామ్పరేల్పర్లాకిమిడిపిర్‌పైంటిపిస్కాపోఖ్రాయన్పొల్లాచ్చి జంక్షన్పోలూరుపోర్‌బందర్రాజ్‌గఢ్రాజ్‌మహల్రాజులా జంక్షన్రామగుండంరాంఘాట్ హాల్ట్రాయనపాడుసహారన్‌పూర్ జంక్షన్సాహిబ్‌జాదా అజిత్ సింగ్ మొహాలీసాహెబ్‌గంజ్సామాఖ్యాలిసామల్పట్టిసాంచిశంకర్‌పూర్సావ్దాసియోనిషాహద్షాజాపూర్షోలవందన్షోరనూర్ జంక్షన్శ్రీధామ్సిద్ధార్థ నగర్సిహోర్ జంక్షన్సియురిశ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ (గద్వాల్)శ్రీరంగంశ్రీవిల్లిపుత్తూరుసెయింట్ థామస్ మౌంట్సూళ్లూరుపేటసురైమాన్‌పూర్స్వామినారాయణ్ చప్పియాతాల్చేర్తమ్లుక్థావేతిరువారూర్ జంక్షన్తిరువణ్ణామలైత్రిపుణితురతునిఉఝానిఉర్కురాఉత్రాన్వడకరవడాలా రోడ్విదిశవృద్ధాచలం జంక్షన్వాడకాంచేరివరంగల్.

ఇతర స్టేషన్లలో అభివృద్ధి పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని స్టేషన్లలో జరుగుతున్న పనుల పురోగతి వివరాలు ఇలా ఉన్నాయి:

జలోర్ లోక్‌సభ నియోజకవర్గం:

·  జలోర్ స్టేషన్: స్టేషన్ భవనంభవన ప్రవేశం (పోర్చ్)మరుగుదొడ్లుప్రవేశ లేదా నిష్క్రమణ ద్వారాలుప్రహరీ గోడ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికుల సంచార ప్రాంతం(సర్సులేటింగ్ ఏరియా)ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ) పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

·  మార్వార్ భీన్మల్ స్టేషన్: స్టేషన్ భవనంభవన ప్రవేశం (పోర్చ్)ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం ఉపరితలంషెల్టర్మరుగుదొడ్లుప్రవేశ లేదా నిష్క్రమణ ద్వారాలుప్రహరీ గోడ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికుల సంచార ప్రాంతంఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ) పనులు చేపట్టారు. 

·  పిండ్వారా స్టేషన్: స్టేషన్ భవనంప్లాట్‌ఫాం షెల్టర్ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికుల సంచార ప్రాంతం, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ) పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 

ఛత్తీస్‌గఢ్:

·  భిలాయ్ పవర్ హౌస్ స్టేషన్: రెండో ప్రవేశ ద్వారం వద్ద కొత్త స్టేషన్ భవనంప్రధాన ప్రవేశ ద్వారం వద్ద స్టేషన్ భవన ఆధునికీకరణప్లాట్‌ఫాంల అప్‌గ్రేడింగ్వేచి ఉండే ప్రదేశాలను మెరుగుపరచటంప్రయాణికుల సంచార ప్రాంతం అభివృద్ధిపార్కింగ్లిఫ్టులుఎస్కలేటర్లు, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. స్టేషన్ భవనానికి సంబంధించి చివరి దశ పనులుప్లాట్‌ఫాంలపై విద్యుత్ దీపాల మెరుగుదల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

·  దల్లిరాజహరా స్టేషన్: స్టేషన్ భవన ఆధునికీకరణవేచి ఉండే ప్రాంతాలుమరుగుదొడ్లుప్లాట్‌ఫాంల అప్‌గ్రేడింగ్మైకుల ద్వారా సమాచారం అందించే వ్యవస్థ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికుల సంచార ప్రాంతం మెరుగుదలసుందరీకరణకళాసాంస్కృతిక అలంకరణ పనులుసూచిక బోర్డులుప్లాట్‌ఫాంలపై విద్యుద్దీపాల పనులు చేపట్టారు. 

·  రాయ్‌పూర్ జంక్షన్ స్టేషన్: రెండో ప్రవేశ ద్వారం వైపు ఉన్న పైపులైన్లుకేబుల్స్ వంటివి తొలగించటం (యుటిలిటీ షిఫ్టింగ్).. వాటిని వేరే చోటుకు తరలించే పనులు పూర్తయ్యాయి. రెండో ప్రవేశ ద్వారం వద్ద స్టేషన్ భవన నిర్మాణ పనులుప్రధాన- రెండో ప్రవేశ ద్వారాల వద్ద బహుళ అంతస్థుల పార్కింగ్ సౌకర్యంసర్వీస్ భవనాలురెండో ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికుల సంచార ప్రాంతం అభివృద్ధి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 

·  సరోనా స్టేషన్: కొత్తగా రెండో ప్రవేశ ద్వారం వద్ద స్టేషన్ భవనంప్రధాన ప్రవేశ ద్వారం వద్ద స్టేషన్ భవన ఆధునికీకరణప్లాట్‌ఫాంల అప్‌గ్రేడింగ్వేచి ఉండే ప్రాంతాల మెరుగుదలప్రయాణికుల సంచార ప్రాంతం అభివృద్ధిపార్కింగ్ప్రజా సమాచార వ్యవస్థలులిఫ్టులుఎస్కలేటర్లు, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. స్టేషన్ భవనం చివరి దశ పనులుసుందరీకరణ(ల్యాండ్‌స్కేపింగ్)కళా- సాంస్కృతిక అలంకరణ పనులుప్లాట్‌ఫాంలపై విద్యుత్ దీపాల మెరుగుదల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

ఢిల్లీ:

·  నరేలా స్టేషన్: ప్లాట్‌ఫాం షెల్టర్ప్లాట్‌ఫాం ఉపరితలం (సర్ఫేసింగ్)ఆధునిక మరుగుదొడ్లుప్రయాణికుల సంచార ప్రాంతంపార్కింగ్దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతుల పనులు చేపట్టారు. 

·  సబ్జీ మండి స్టేషన్: కొత్త స్టేషన్ భవనంప్లాట్‌ఫాం షెల్టర్ప్లాట్‌ఫాం ఉపరితలం(సర్ఫేసింగ్)ఆధునిక మరుగుదొడ్లుప్రయాణికుల సంచార ప్రాంతంపార్కింగ్దివ్యాంగుల వసతులులిఫ్ట్, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

·  తిలక్ బ్రిడ్జ్ స్టేషన్: కొత్త స్టేషన్ భవనంప్లాట్‌ఫాం షెల్టర్ప్లాట్‌ఫాం ఉపరితలంఆధునిక మరుగుదొడ్లుప్రయాణికుల సంచార ప్రాంతంపార్కింగ్దివ్యాంగుల వసతులులిఫ్ట్ పనులు చేపట్టారు. 

కర్ణాటక:

·  బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్: దక్షిణ భాగంలో మళ్లింపు రోడ్డుఉత్తర భాగంలో శిక్షణ కేంద్రం.. హాస్టల్ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్ భవనం పనులు పూర్తయ్యాయి. స్టేషన్ దక్షిణఉత్తర భాగాల భవన నిర్మాణ పనులు.. ప్రయాణికుల సంచార ప్రాంతంఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

·  చామరాజ నగర్ స్టేషన్: స్టేషన్ భవన ఆధునికీకరణభవన ప్రవేశంప్లాట్‌ఫాం షెల్టర్ప్లాట్‌ఫాం  ఉపరితలంవేచి ఉండే హాల్బుకింగ్ కౌంటర్ప్రయాణికుల సంచార ప్రాంతంపార్కింగ్ పనులు పూర్తయ్యాయి. లిఫ్ట్ఎస్కలేటర్, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు. 

·  ఘటప్రభ స్టేషన్: ప్లాట్‌ఫాం ఉపరితలంప్లాట్‌ఫాం షెల్టర్ప్రయాణికుల సంచార ప్రాంతంలిఫ్ట్ఎస్కలేటర్, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

·  హోసపేట స్టేషన్: స్టేషన్ భవన ఆధునికీకరణప్లాట్‌ఫాం షెల్టర్వెయిటింగ్ హాల్ మెరుగుదలఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద కోచ్ సూచిక బోర్డుల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ప్లాట్‌ఫాం ఉపరితలం, 2/3 నంబర్ ప్లాట్‌ఫాంల వద్ద కోచ్ సూచిక బోర్డులులిఫ్ట్ఎస్కలేటర్, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు. 

·  రాణిబెన్నూరు స్టేషన్: స్టేషన్ భవన ఆధునికీకరణభవన ప్రవేశంప్లాట్‌ఫాం షెల్టర్ప్లాట్‌ఫాం ఉపరితలంవేచి ఉండే హాల్మరుగుదొడ్లుప్రయాణికుల సంచార ప్రాంతంపార్కింగ్ప్రవేశ ద్వార తోరణం పనులు పూర్తయ్యాయి. లిఫ్ట్ఎస్కలేటర్, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 

మహారాష్ట్ర (పాల్ఘర్ జిల్లాతో కలిపి):

·  పాల్ఘర్ స్టేషన్: 2/3 నంబర్ ప్లాట్‌ఫాంల వద్ద కొత్త షెల్టర్ప్లాట్‌ఫాం ఉపరితలం (సర్ఫేసింగ్)కొత్త కోపింగ్ బ్లాక్స్, 4వ నంబర్ ప్లాట్‌ఫాం వద్ద టాక్టైల్ టైల్ పనులు పూర్తయ్యాయి. పైపులైన్లుకేబుల్స్ వంటివి తొలగించటం (యుటిలిటీ షిఫ్టింగ్), 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

·  దివా స్టేషన్: తూర్పు వైపున స్టేషన్ భవన ఆధునికీకరణప్రయాణికుల సంచార ప్రాంతంపార్కింగ్కొత్త ప్రవేశ ద్వారం, 5/6 - 7/8 నంబర్ ప్లాట్‌ఫాంల ఎత్తు పెంపుఫ్లోరింగ్, 7/8 నంబర్ ప్లాట్‌ఫాం వద్ద షెల్టర్కొత్త మరుగుదొడ్ల బ్లాక్పశ్చిమ వైపున మురుగునీటి శుద్ధి కేంద్రంకళ్యాణ్ - ముంబయి వైపు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిల మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. కొత్తగా 6 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు. 

·  ముంబ్రా స్టేషన్: ప్లాట్‌ఫాం ఉపరితలం మెరుగుదలప్రయాణికుల కోసం కూర్చునే ఏర్పాట్లుకొత్త మరుగుదొడ్ల బ్లాక్బుకింగ్ కార్యాలయ ఆధునికీకరణప్రయాణికుల సంచార ప్రాంతంమురుగునీటి శుద్ధి కేంద్రంఫుట్ ఓవర్ బ్రిడ్జి ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి. ఎస్కలేటర్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

·  టిత్వాలా స్టేషన్: స్టేషన్ భవనంప్రవేశ ద్వారంప్లాట్‌ఫాం ఉపరితలంటికెట్ బుకింగ్ కార్యాలయ మెరుగుదలమరుగుదొడ్ల బ్లాక్మురుగునీటి శుద్ధి కేంద్రంతూర్పు - పశ్చిమ వైపులా ద్విచక్ర వాహనాల పార్కింగ్అప్రోచ్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. కొత్తగా మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు. 

·  విక్రోలి స్టేషన్: పశ్చిమ వైపున స్టేషన్ భవన ఆధునికీకరణప్లాట్‌ఫాం ఉపరితలంప్లాట్‌ఫాం షెల్టర్ముంబయి వైపు కొత్త మరుగుదొడ్ల బ్లాక్కళ్యాణ్ వైపు ఉన్న మరుగుదొడ్ల బ్లాక్ ఆధునికీకరణఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. కొత్త బుకింగ్ కార్యాలయంతూర్పు - పశ్చిమ వైపులా ప్రయాణికుల సంచార ప్రాంతంతూర్పు వైపున పార్కింగ్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

·  ఇగత్‌పురి స్టేషన్: కొత్త స్టేషన్ భవనం నిర్మాణ పనులుప్రస్తుతం ఉన్న స్టేషన్ భవన ఆధునికీకరణప్రవేశ ద్వారంబుకింగ్ కార్యాలయంమరుగుదొడ్ల బ్లాక్ప్లాట్‌ఫాం ఉపరితలంప్లాట్‌ఫాం షెల్టర్ప్రయాణికుల సంచార ప్రాంతంమురుగునీటి శుద్ధి కేంద్రం పనులు పూర్తయ్యాయి. కొత్త స్టేషన్ భవనం చివరి దశ పనులు(ఫినిషింగ్) ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 

·         సబర్‌కాంత జిల్లా సహా గుజరాత్:

·                 హిమ్మత్‌నగర్ స్టేషన్: కొత్త స్టేషన్ భవనం, ప్రస్తుత స్టేషన్ భవనం మెరుగుదల, వాటర్ బూత్, మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.

·         ·         దాహోద్ స్టేషన్: స్టేషన్ భవనం, వరండా, ప్లాట్‌ఫారం నంబర్ 1 సర్ఫేసింగ్, బుకింగ్ కౌంటర్, వెయిటింగ్ హాల్, వేచి ఉండే గది, చెల్లింపు ఆధారిత మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ఏరియా, ప్రవేశ-నిష్క్రమణ ద్వారం, సైనేజ్‌ల మెరుగుదల పనులు పూర్తయ్యాయి. 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.

·         ·         లింఖేడా స్టేషన్: కొత్త స్టేషన్ భవనం, ప్లాట్‌ఫారం నంబర్ 1, 2 విస్తరణ, ప్లాట్‌ఫారం ఉపరితలాన్ని మెరుగుపరచడం, ప్లాట్‌ఫారం నంబర్ 1, 2, 3 వద్ద మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ఏరియా, ప్రవేశ-నిష్క్రమణ ద్వారం మెరుగుదల పనులు పూర్తయ్యాయి. సైనేజ్‌లు, 6 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.

·         ·         అసర్వ స్టేషన్: కొత్త స్టేషన్ భవనం, వరండా, కొత్త వేచి ఉండే గది, బుకింగ్ కౌంటర్, మరుగుదొడ్డి బ్లాక్ పనులు పూర్తయ్యాయి. కొత్త ప్లాట్‌ఫారం షెల్టర్, ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, దివ్యాంగజన సౌకర్యాలు, కాంకోర్స్ ఏరియా ఫినిషింగ్ పనులు చేపట్టారు.

·         ·         సెహోర్ స్టేషన్: ప్లాట్‌ఫారం సర్ఫేస్, ప్లాట్‌ఫారం షెల్టర్, వెయిటింగ్ హాల్, మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ఏరియా, అప్రోచ్, సైనేజ్, స్టేషన్ ఇల్యుమినేషన్ పనులు పూర్తయ్యాయి. 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.

·         హిమాచల్ ప్రదేశ్:

·         అంబ్ అండౌరా, బైజ్‌నాథ్ పాప్రోలా స్టేషన్లలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. పాలంపూర్ హిమాచల్, సిమ్లా స్టేషన్లు మాస్టర్ ప్లానింగ్‌లో ఉన్నాయి.

·         మాస్టర్ ప్లానింగ్ దశ ఆప్టిమైజేషన్ అవసరమయ్యే పునరావృత ప్రక్రియ. అటువంటి ఆప్టిమైజేషన్ కోసం కాలపరిమితి, ఇతర వివరాలను ఈ దశలో సూచించలేము.

·          ఉత్తర రైల్వేలోని అంబాలా డివిజన్:

·         ·         అంబాలా సిటీ స్టేషన్: స్టేషన్ భవనం, ప్రవేశ ద్వారం, ప్లాట్‌ఫారం ఉపరితలం, ఏసీ వెయిటింగ్ రూమ్, సెకండ్ క్లాస్ వెయిటింగ్ రూమ్, మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, ప్రవేశ-నిష్క్రమణ ద్వారం, సైనేజ్ మెరుగుదల పనులు పూర్తయ్యాయి. లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.

·         ·         కల్కా స్టేషన్: స్టేషన్ భవనం, ప్రవేశ ద్వారం, వేచి ఉండే గది, విశ్రాంతి గది, సర్క్యులేటింగ్ ప్రాంతం, పార్కింగ్, ప్రవేశ-నిష్క్రమణ ద్వారం, సైనేజ్ మెరుగుదల పనులు పూర్తయ్యాయి. ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.

·         ·         యమునానగర్ జగధారి స్టేషన్: స్టేషన్ భవనం, వేచి ఉండే గది, మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, ప్రవేశ-నిష్క్రమణ ద్వారం సైనేజ్‌ల మెరుగుదల పనులు పూర్తయ్యాయి. ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, రెండో ప్రవేశ ద్వారం, లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి అభివృద్ధి పనులు చేపట్టారు.

·         ·         పాటియాలా స్టేషన్: స్టేషన్ భవనం, ప్రవేశ ద్వారం, ప్లాట్‌ఫారం షెల్టర్, వెయిటింగ్ హాల్, రిటైరింగ్ రూమ్, మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, ప్రవేశ-నిష్క్రమణ ద్వారం, సైనేజ్ మెరుగుదల పనులు పూర్తయ్యాయి. ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, రెండో ప్రవేశ ద్వారం, లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి అభివృద్ధి పనులు చేపట్టారు.

·         ఉత్తర రైల్వేలోని జమ్మూ డివిజన్:

·         ·         బుద్గాం స్టేషన్: సర్క్యులేటింగ్, పార్కింగ్, అప్రోచ్ రోడ్డు మెరుగుదల పనులు పూర్తయ్యాయి. లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.

·         ·         గురుదాస్‌పూర్ స్టేషన్: స్టేషన్ భవనం, ప్లాట్‌ఫారం షెల్టర్, ప్లాట్‌ఫారం ఉపరితలం మెరుగుదల, వేచి ఉండే గది, మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ప్రాంతం, వరండా, లైటింగ్ పనులు పూర్తయ్యాయి. కొత్త ప్లాట్‌ఫారం నంబర్ 2, బుకింగ్ కమ్ వెయిటింగ్ హాల్, సర్క్యులేటింగ్ ప్రాంతం, పార్కింగ్, ప్రధాన ప్రవేశ ద్వారం, రెండో వైపు ప్రవేశ-నిష్క్రమణ ద్వారం, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.

·         ·         అమరవీరుడు కెప్టెన్ తుషార్ మహాజన్ స్టేషన్: స్టేషన్ భవనం, వరండా, వేచి ఉండే గది, మరుగుదొడ్డి, సర్క్యులేటింగ్ ప్రాంతం, పార్కింగ్, అప్రోచ్ రోడ్, సైనేజ్, లైటింగ్ మెరుగుదల పనులు పూర్తయ్యాయి. ప్లాట్‌ఫారం షెల్టర్, ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, ప్రధాన ప్రవేశ దిశలో ప్రవేశ-నిష్క్రమణ ద్వారం, లిఫ్ట్, ఎస్కలేటర్, 6 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.

·         జార్ఖండ్:

·         ·         బాల్సిరింగ్ స్టేషన్: స్టేషన్ భవనం, ప్లాట్‌ఫారం షెల్టర్, పార్కింగ్, అప్రోచ్ రోడ్, దివ్యాంగజనుల మరుగుదొడ్డి, టికెట్ కౌంటర్ మెరుగుదల పనులు పూర్తయ్యాయి. ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్,  ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.

·         ·         బానో స్టేషన్: స్టేషన్ భవనం, సర్క్యులేటింగ్ ప్రాంతం, అప్రోచ్ రోడ్, స్టేషన్ లైటింగ్, ర్యాంప్ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ప్లాట్‌ఫారం షెల్టర్, ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, తాగునీటి బూత్, దివ్యాంగజనుల మరుగుదొడ్డి పనులు చేపట్టారు.

·         ·         గంగాఘాట్ స్టేషన్: స్టేషన్ భవనం, ప్లాట్‌ఫారం షెల్టర్, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, అప్రోచ్ రోడ్డు మెరుగుదల పనులు పూర్తయ్యాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, దివ్యాంగజనుల సౌకర్యాల పనులు చేపట్టారు.

·         ·         ఆర్గా స్టేషన్: స్టేషన్ భవనం, ప్లాట్‌ఫారం షెల్టర్, ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, సర్క్యులేటింగ్ ఏరియా, అప్రోచ్ రోడ్, స్టేషన్ లైటింగ్, దివ్యాంగ జనుల మరుగుదొడ్డి మెరుగుదల పనులు పూర్తయ్యాయి. దివ్యాంగ జనుల పార్కింగ్ పనులు చేపట్టారు.

·         ·         తతిసిల్వాయి స్టేషన్: స్టేషన్ భవనం, ప్రవేశ ద్వారం, ప్లాట్‌ఫారం షెల్టర్, వెయిటింగ్ హాల్, సర్క్యులేటింగ్ ఏరియా, అప్రోచ్ రోడ్, సైనేజ్‌ల మెరుగుదల పనులు పూర్తయ్యాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.

·         పాలి లోక్‌సభ నియోజకవర్గం:

·         ·         ఫల్నా స్టేషన్: స్టేషన్ భవనం, ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, ప్లాట్‌ఫారం షెల్టర్, సర్క్యులేటింగ్ ఏరియా పనులు పూర్తయ్యాయి. లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.

·         ·         జవాయి బంద్ స్టేషన్: ప్రధాన స్టేషన్ భవనం, ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, ప్లాట్‌ఫారం నంబర్ 1 వద్ద ప్లాట్‌ఫారం షెల్టర్ పనులు పూర్తయ్యాయి. ప్లాట్‌ఫారం నంబర్ 2 వద్ద ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, ప్లాట్‌ఫారం నంబర్ 1 వద్ద లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.

·         ·         మార్వార్ జంక్షన్ స్టేషన్: ప్రధాన స్టేషన్ భవనం, సర్క్యులేటింగ్ ప్రాంతం పనులు పూర్తయ్యాయి. ప్లాట్‌ఫారం షెల్టర్, ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, ప్లాట్‌ఫారం నంబర్ 1 వద్ద లిఫ్ట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు.

·         ·         రాణి స్టేషన్: దివ్యాంగజనులకు ప్రధాన, రెండో ప్రవేశద్వారం వద్ద స్టేషన్ భవనం, ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, ప్లాట్‌ఫారం షెల్టర్, సర్క్యులేటింగ్ ఏరియా, స్పర్శ మార్గం పనులు పూర్తయ్యాయి. లిఫ్ట్ పనులు చేపట్టారు.

·         జల్గావ్ లోక్‌సభ నియోజకవర్గం:

·         ·         అమల్నేర్ స్టేషన్: ప్లాట్‌ఫారం నంబర్ 1 విస్తరణ, ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, ప్లాట్‌ఫారం నంబర్ 2 వద్ద ప్లాట్‌ఫారం షెల్టర్, అప్రోచ్ రోడ్ పనులు పూర్తయ్యాయి. ఉత్తరం వైపున కొత్తగా రెండో ప్రవేశ భవనం, కాంకోర్స్‌తో కూడిన కొత్త భవనం ఫినిషింగ్ పనులు చేపట్టారు.

·         ·         చాలిస్‌గావ్ స్టేషన్: ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, ప్లాట్‌ఫారం షెల్టర్, మరుగుదొడ్ల పనులు పూర్తయ్యాయి. స్టేషన్ భవనం, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, ల్యాండ్‌స్కేపింగ్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెరుగుదల పనులు చేపట్టారు.

·         ·         పచోరా జంక్షన్ స్టేషన్: రెండో ప్రవేశద్వారం వద్ద కొత్త బుకింగ్ కార్యాలయం, ప్రధాన ప్రవేశద్వారం వైపు ఉన్న బుకింగ్ కార్యాలయం మెరుగుదల, ప్లాట్‌ఫారం షెల్టర్, ప్లాట్‌ఫారం సర్ఫేసింగ్, సర్క్యులేటింగ్ ఏరియా, రెండు వైపులా పార్కింగ్, ప్రహరీ గోడ పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి, మరుగుదొడ్డి బ్లాక్ మెరుగుదల పనులు చేపట్టారు.

·         ఇంకా, భారతీయ రైల్వేల్లో స్టేషన్ల అభివృద్ధి / పునరాభివృద్ధి / అప్‌గ్రేడేషన్ / ఆధునికీకరణ నిరంతర, కొనసాగుతున్న ప్రక్రియగా జరుగుతోంది. ఈ విషయంలో పనులు అవసరానికి అనుగుణంగా చేపట్టుతున్నారు. పరస్పర ప్రాధాన్యం, నిధుల లభ్యతకు లోబడి పనులు చేపడుతున్నారు. స్టేషన్ కేటగిరీ / పరిస్థితి / ట్రాఫిక్ నిర్వహణ మొదలైన వాటి ఆధారంగా స్టేషన్ అభివృద్ధి / పునరాభివృద్ధి / అప్‌గ్రేడేషన్ / ఆధునికీకరణ జరుగుతుంది.

·         ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి కోసం గుర్తించిన స్టేషన్ల పేర్లు కింది విధంగా ఉన్నాయి:

·          కేంద్ర రైల్వేలు, సమాచార-ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖా మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో ప్రశ్నలకు సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు.

 


(రిలీజ్ ఐడి: 2239289) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Gujarati , Tamil , Kannada