సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
తెలంగాణలో గణనీయమైన పురోగతికి సాక్ష్యంగా నిలిచిన ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం
నాడు పోస్టు చేయడమైనది:
12 MAR 2026 4:55PM by PIB Hyderabad
ప్రస్తుత క్లస్టర్‌లలోని సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచడానికి ఉమ్మడి సౌకర్యాల కేంద్రాలను స్థాపించడం, మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణకు భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖకు చెందిన ‘సూక్ష్మ, చిన్న పరిశ్రమల క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం (ఎంఎస్ఈ-సీడీపీ)’ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఎంఎస్ఈ-సీడీపీ కింద తెలంగాణలో ఆమోదించిన ఉమ్మడి సౌకర్యాల కేంద్రాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
|
S. No.
|
Name of the CFC Projects
|
Districts
|
Sector
|
Project Cost
|
GoI Grant Approved
|
Status
(Ongoing/ completed)
|
|
(Rs. In lakh)
|
|
1
|
Gold Ornament Cluster
|
Karimnagar
|
Gem & Jewelry
|
580.00
|
446.00
|
Ongoing
|
|
2
|
Rice Mill Cluster
|
Jagitial
|
Agro-processing
|
998.00
|
798.40
|
Ongoing
|
ఎంఎస్ఈ-సీడీపీ కింద తెలంగాణలో ఆమోదించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఎమ్ఎస్ఈ-సీడీపీ అనేది డిమాండ్ ఆధారిత కేంద్ర రంగ పథకం. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న క్లస్టర్ల ఉమ్మడి అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలను పంపుతాయి. ఇవి సాధారణంగా ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడతాయి.
ఈ సమాచారాన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభ కరంద్లాజే నేడు లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.
(రిలీజ్ ఐడి: 2239229)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16