అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్న: చిన్న మాడ్యులర్ రియాక్టర్ (ఎస్ఎమ్ఆర్)ల రంగప్రవేశం

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 4:03PM by PIB Hyderabad
పరమాణు ఇంధన మిషన్ (ఎన్ఈఎమ్)ను అమలు చేయనున్నట్లు 2025-26లో ప్రకటించారు. దీనిలో భాగంగా చిన్న మాడ్యులర్ రియాక్టర్ (ఎస్ఎంఆర్)ల పరిశోధన, డిజైను, అభివృద్ధి ప్రక్రియతో పాటు వాటిని రంగంలోకి ప్రవేశపెట్టడం కోసం మొత్తం రూ.20,000 కోట్ల మేరకు బడ్జెట్‌లో సర్దుబాటు చేశారు. ఈ కింద ప్రస్తావించిన దేశవాళీ ఎస్ఎంఆర్లకు రూపురేఖలను తీర్చిదిద్దే, వాటిని అభివృద్ధిపరిచే బాధ్యతను అణు ఇంధన విభాగం (డీఏఈ) స్వీకరించింది.
     i. 220 ఎండబ్ల్యూఈ సామర్థ్యాన్ని కలిగి ఉండే భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (బీఎస్ఎంఆర్-200),
     ii. 55 ఎండబ్ల్యూఈ సామర్థ్యాన్ని కలిగి ఉండే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్ఎంఆర్-55)తో పాటు
     iii. 5 ఎండబ్ల్యూహెచ్ లోపు సామర్థ్యం గల హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్.. ఇది హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి ఉద్దేశించింది.
 
ఈ ఎస్ఎంఆర్లకు చెందిన లీడ్ యూనిట్లను సాంకేతికత నిరూపణ కోసం డీఈఏ సైట్లలో ఏర్పాటు చేస్తారు.
 
ఈ ఎస్ఎంఆర్ల పనుల్లో పురోగతి ఈ కింద పేర్కొన్న విధంగా ఉంది.. :
     • బీఎస్ఎంఆర్-200: ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదనను మంత్రివర్గ సంఘానికి సమర్పించడానికి అణు ఇంధన సంఘం (ఏఈసీ) పాలన పరమైన మంజూరుతో పాటు ఆర్థిక మంజూరును ఇచ్చింది.

 

     • ఎస్ఎంఆర్-55: ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయ ఆమోదం లభించింది.

    • హెచ్‌టీజీసీఆర్: ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయ ఆమోదం లభించింది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేశారు. స్థల అంగీకారం లభించింది. పర్యావరణ సంబంధిత ఆమోదాలను సంపాదించడానికి అవసరమైన టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) కూడా పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్ అండ్ సీసీ) అందజేసింది.

బీఎస్ఎంఆర్-200, ఎస్ఎంఆర్- 55లకు చెందిన రియాక్టర్ ప్రెషర్ వెసల్స్ తయారీకి సంబంధించిన సాంకేతికతతో పాటు ‘‘అడ్వాన్స్‌డ్ ప్యూరిఫైడ్ రియాక్టర్ వెసల్ అలాయ్ (ఏపీయూఆర్‌వీఏ) అనే ఒక ప్రత్యేక పదార్థాన్ని కూడా భారతీయ పరిశ్రమల సహకారంతో దేశీయంగా రూపొందించారు. కంట్రోల్ రాడ్ డ్రైవ్ యంత్ర నిర్మాణ పనినీ ఇక్కడే పూర్తి చేశారు.
ఈ రియాక్టర్లను పనిచేయించడానికి అవసరమైన సాంకేతిక విజ్ఞానం దేశంలో అందుబాటులో ఉంది. చాలావరకు సామగ్రిని భారతీయ పరిశ్రమల్లో సొంతంగా తయారు చేయగలిగారు. సాంకేతిక సహకారం పరంగా భాభా అణు పరిశోధన కేంద్రం (బీఏఆర్‌సీ) మార్గదర్శకత్వాన్ని అందించింది. ఈ కారణంగా, ఉపకరణాల తయారీలో భారతీయ పరిశ్రమల తోడ్పాటును తీసుకోనున్నారు.

పరమాణు ఇంధన మిషన్లో ప్రకటించిన ప్రకారం 2047 కల్లా 100 గిగావాట్ (జీడబ్ల్యూ) మేరకు పరమాణు విద్యుత్తు ఉత్పాదన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ఒక మార్గసూచీని రూపొందించింది. ఈ మార్గసూచీ ప్రకారం, ఇప్పుడు 8.73 జీడబ్ల్యూ స్థాయిలో ఉన్న పరమాణు విద్యుత్తు ఉత్పాదన సామర్థ్యం [రాజస్థాన్ అణు విద్యుత్కేంద్రం-I (ఆర్ఏపీఎస్I) మినహా] వివిధ దశల్లో పనులు పురోగమిస్తున్న ఆయా ప్రాజెక్టులు పూర్తి అయ్యే కొద్దీ 2031-32 కల్లా సుమారు 22 జీడబ్ల్యూకు చేరుకోగలదని ఆశిస్తున్నారు. మరో 32 జీడబ్ల్యూ పరమాణు ఇంధన సామర్థ్యాన్ని ఎన్‌పీసీఐఎల్ 2032 తరువాతి కాలంలో సమకూరుస్తుంది. దీనిలో దేశీయంగా ఏర్పాటు చేసే ప్రెషరైజ్‌డ్ హెవీ వాటర్ రియాక్టర్లు (పీహెచ్‌డబ్ల్యూఆర్)తో పాటు లైట్ వాటర్ రియాక్టర్ (ఎల్‌డబ్ల్యూఆర్)లు భాగంగా ఉంటాయి. వీటిని కలుపుకొంటే 2047 కల్లా సామర్థ్యం దాదాపు 54 జీడబ్ల్యూ స్థాయికి వృద్ధి చెందుతుంది. మార్గసూచీలో పేర్కొన్న ప్రకారం, మిగతా 46 జీడబ్ల్యూ పరమాణు విద్యుత్తు సామర్థ్యాన్ని ప్రభుత్వ రంగానికి (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు) చెందిన ఇతర వాణిజ్య సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు రంగమూ, వేర్వేరు వ్యాపార నమూనాల జాయింట్ వెంచర్లూ సమకూరుస్తాయి. ఇందుకోసం విభిన్న సాంకేతికతలను అనుసరిస్తారు.

భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (బీఎస్ఎంఆర్)ను డీఏఈలో భాగమైన భాభా  అణు పరిశోధన కేంద్రం (బీఏఆర్‌సీ)తో పాటు డీఏఈలో ఓ ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐఎల్) కలిసి డిజైన్ చేయడం పాటు అభివృద్ధిపరుస్తున్నాయి. పాలనపరమైన ఆమోదం, ఆర్థిక ఆమోదం లభించిన తరువాత 60 నెలల నుంచి 72 నెలల లోపల బీఎస్ఎంఆర్ నిర్మాణం పూర్తి కావచ్చని భావిస్తున్నారు.

దేశీయంగా రూపుదిద్దాలనుకుంటున్న ఎస్ఎంఆర్‌లను ఏర్పాటు చేయడానికి బీఏఆర్‌సీ కేటాయించే పెట్టుబడి కింద పేర్కొన్న విధంగా ఉంది:

రియాక్టర్

పెట్టే ఖర్చు

(రూ.కోట్లలో)

 

 బీఎస్ఎంఆర్-200 అభివృద్ధికీ, నిర్మాణానికీ

5960

ఎస్ఎంఆర్ -55 (2 యూనిట్లు) అభివృద్ధికీ, నిర్మాణానికీ

7000

హైటెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్ (హెచ్‌టీజీసీఆర్) రూపురేఖలతో పాటు నిర్మాణానికి

  320

కొత్త రియాక్టర్ల డిజైను, ఇంజినీరింగులతో పాటు అభివృద్ధి పనులకు

  800

రియాక్టర్ల భవన సముదాయానికి సంబంధించిన సివిల్, సాధారణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి

  452

బీఎస్ఎంఆర్-200, ఎస్ఎంఆర్-55ల లీడ్ యూనిట్లను మహారాష్ట్ర లోని తారాపూర్ అణు విద్యుత్కేంద్రంలో నిర్మించాలని ప్రతిపాదించారు. హైటెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్ (హెచ్‌టీజీసీఆర్)ను ఆంధ్రప్రదేశ్‌లోని బీఏఆర్‌సీ వైజాగ్‌లో నిర్మించాలని ప్రతిపాదించారు.

ఈ సమాచారాన్ని కేంద్ర సైన్స్, టెక్నాలజీ, భూ విజ్ఞ‌ానశాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన  సమాధానంలో తెలియజేశారు.

 

****


(రిలీజ్ ఐడి: 2239221) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी