పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ వెబ్ పోర్టల్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ఆవిష్కరించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 11 MAR 2026 6:46PM by PIB Hyderabad

యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విస్తరించడం కోసం, మారుమూల గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం కోసం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎన్‌వైపీఎస్ 2.0 పేరుతో నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ (ఎన్‌వైపీఎస్) వెబ్ పోర్టల్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. గుర్తింపు పొందిన విద్యా సంస్థల విద్యార్థులకు మాత్రమే పరిమితమైన మునుపటి వెర్షన్ స్థానంలో ప్రారంభించిన ఈ ఎన్‌వైపీఎస్ 2.0 పోర్టల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలు, గ్రూపులు, పౌరులందరి కోసం అందుబాటులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు, చిన్న సంస్థలు సహా దేశంలోని ప్రజలందరి కోసం లింగం, కులం, వర్గం, మతం, జాతి, ప్రాంతం, స్థానంతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది. యూత్ పార్లమెంట్ సమావేశ భాగస్వామ్యం, నిర్వహణ వివరాలు కింది విధంగా ఉన్నాయి-

 

ఎన్‌వైపీఎస్ 2.0 గురించి సమగ్రత, అవగాహన కోసం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన సంస్థలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలు, వివిధ విద్యా బోర్డులకు (సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ) లేఖ రాసింది. సంసద్ టీవీలో దీని గురించి ఎప్పటికప్పుడు ప్రచార వీడియోనూ ప్రసారం చేస్తోంది.

చట్టం, న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలిపారు.


(రిలీజ్ ఐడి: 2238635) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी