రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ రహదారులపై భద్రతను, భాగస్వామ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు వాణిజ్య వాహన సేవల వేదికలతో ఎన్‌హెచ్ఏఐ అవగాహన ఒప్పందం


జాతీయ రహదారులపై భద్రత, సామర్థ్యం, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరిచేలా వివిధ వ్యవస్థల మధ్య సమన్వయం, సాంకేతిక ఆధారిత పరిష్కారాల కోసం అగ్రిగేటర్ వేదికలను ఉపయోగించుకొనేందుకు వీలు కల్పిస్తున్న ఎంవోయూ

నాడు పోస్టు చేయడమైనది: 10 MAR 2026 6:01PM by PIB Hyderabad

వాణిజ్య వాహన డ్రైవర్లకుఫ్లీట్ ఆపరేటర్లకు ‘రవాణా సౌలభ్యాన్ని’ మెరుగుపరిచే లక్ష్యంతో ఎన్‌హెచ్ఏఐ సహకారమందిస్తోన్న ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్సంస్థ వాణిజ్య వాహన సేవల వేదికలతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుందిన్యూఢిల్లీలోని ఎన్‌హెచ్ఏఐ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగిందిజాతీయ రహదారుల్లో ప్రయాణించే వాణిజ్య వాహన డ్రైవర్లకుఫ్లీట్ ఆపరేటర్లకు భద్రతనుసామర్థ్యాన్నివినియోగదారు అనుభవాన్ని పెంపొందించేలా విభిన్న వ్యవస్థల మధ్య సమన్వయానికిసాంకేతిక ఆధారిత పరిష్కారాలను ఉపయోగించుకొనేందుకు ఎంవోయూ వీలు కల్పిస్తుందిఎన్‌హెచ్ఏఐ ఛైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారుఐహెచ్ఎంసీఎల్ సీఎండీ శ్రీ విశాల్ చౌహాన్ఎన్‌హెచ్ఏఐఐహెచ్ఎంసీఎల్‌కు చెందిన ఉన్నతాధికారులుఅయిదు సేవా వేదికలు వీల్స్ఐ టెక్నాలజీ ఇండియాబ్లాక్‌బక్ట్రక్సప్ సొల్యూషన్స్ట్రక్‌సువిధ – సర్వోదయ ఇన్ఫోటెక్సాఫ్రన్ నేవిగేటర్స్ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుజాతీయ రహదారులపై సురక్షితమైనబాధ్యతాయుతమైన డ్రైవింగ్ విధానాలను పాటించిన డ్రైవర్లకు ‘విశిష్ట సారథి’ పురస్కారాన్ని ఎన్‌హెచ్ఏఐ ఛైర్మన్ అందించారు.

 

***

 

(రిలీజ్ ఐడి: 2238284) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी