ప్రధాన మంత్రి కార్యాలయం
నేపాల్ ఎన్నికల్లో విజయం సాధించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నాయకులకు ప్రధాని శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
09 MAR 2026 9:13PM by PIB Hyderabad
రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అధ్యక్షుడు శ్రీ రబీ లామిఛానే, ఆ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బాలేంద్ర షాతో టెలిఫోన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మాట్లాడారు.
నేపాల్ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు నాయకులకు, ఘన విజయం సాధించిన ఆర్ఎస్పీకి అభినందనలు తెలిపారు. త్వరలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల పరస్పర సంక్షేమం, పురోగతి, ప్రజల శ్రేయస్సు కోసం కలసి పనిచేయడానికి భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
భారత్-నేపాల్ సంబంధాల భవిష్యత్తుపై విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేస్తూ.. రానున్న కాలంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ఉమ్మడి ప్రయత్నాలతో నూతన శిఖరాలకు చేరుకుంటుందన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అధ్యక్షుడు శ్రీ రబీ లామిఛానే, ఆ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బాలేంద్ర షాతో టెలిఫోన్‌లో మాట్లాడాను.
నేపాల్ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు నాయకులకు, ఘన విజయం సాధించిన ఆర్ఎస్‌పీకీ అభినందనలు తెలియజేశాను. త్వరలో ఏర్పాటు కానున్న నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపాను. అలాగే రెండు దేశాల పరస్పర సంక్షేమం, పురోగతి, శ్రేయస్సు కోసం కలసి పనిచేయడానికి భారత ప్రభుత్వ నిబద్దతను తెలియజేశాను.
మా ఉమ్మడి ప్రయత్నాలతో రానున్న కాలంలో భారత్-నేపాల్ మధ్య సంబంధాలు నూతన శిఖరాలకు చేరుకుంటాయని విశ్వసిస్తున్నాను.
***
(రిలీజ్ ఐడి: 2237328)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam