ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత సెమీ కండక్టర్ మిషన్‌లో క్రియాశీలకంగా సహకరిస్తున్న ఢిల్లీలోని ప్రముఖ విద్యా సంస్థలు

భారత సెమీ కండక్టర్ వ్యవస్థకు ఊతం.. 20 లక్షల నూతన ఉద్యోగాల సృష్టికి సిద్ధమవుతున్న భారత్

నాడు పోస్టు చేయడమైనది: 07 MAR 2026 1:38PM by PIB Hyderabad

భారత సెమీ కండక్టర్ మిషన్‌ (ఐఎస్ఎం)లో భాగంగా చిప్స్ టు స్టార్టప్స్ (సీటుఎస్కార్యక్రమం ద్వారా శిక్షణనైపుణ్యాభివృద్ధికార్మిక శక్తిని అభివృద్ధి చేయటంప్రతిభను పెంపొందించటానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందిఈ క్రమంలో 10 ఏళ్లలో సెమీ కండక్టర్ డిజైన్‌లో 85,000 మంది ఇంజినీర్లకు శిక్షణనివ్వాలని లక్ష్యంగా పెట్టుకుందిఇందులో భాగంగా నాలుగేళ్లలోనే భారత్ గణనీయమైన వృద్ధిని సాధించిందని కేంద్ర రైల్వేసమాచారప్రసారఎలక్ట్రానిక్స్ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.

సినోప్సిస్కేడెన్స్సీమెన్స్రెనెసాస్ఆన్సిస్ఏఎమ్‌డి వంటి సంస్థలు అందిస్తున్న ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏసాధనాలు దేశవ్యాప్తంగా 315 విద్యా సంస్థలకు అందుబాటులోకి వచ్చాయని శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారుఈ సాధనాల సాయంతో విద్యార్థులు సెమీ కండక్టర్ చిప్‌ల రూపకల్పనలో ఆచరణాత్మక అనుభవాన్ని పొందుతున్నారుఈ చిప్‌లను మొహాలీలోని సెమీకండక్టర్ లాబొరేటరీ (ఎస్‌సీఎల్‌)లో తయారు చేసిపరీక్షిస్తున్నారుదీనివల్ల విద్యార్థులకు చిప్ రూపకల్పన నుంచి తయారీప్యాకేజింగ్టెస్టింగ్ వరకు పూర్తి ప్రక్రియలో ప్రత్యక్ష అనుభవం కలుగుతుందిఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద 'ఓపెన్-యాక్సెస్ ఈడీఏప్రోగ్రామ్‌గా నిలిచిందిచిప్ డిజైన్ శిక్షణకు ఇప్పటివరకు 1.85 కోట్ల గంటలకుపైగా ఈడీఏ టూల్‌ని వినియోగించగాఈ సమయం ఇంకా పెరుగుతూనే ఉంది.

 

అస్సాం నుంచి గుజరాత్కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు సెమీ కండక్టర్ డిజైనింగ్‌లో క్రియాశీలకంగా పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారుసెమీకాన్ 2.0 ద్వారా ఈ కార్యక్రమాన్ని 315 విశ్వవిద్యాలయాల నుంచి 500 విశ్వవిద్యాలయాలకు విస్తరించనున్నారుదీనిద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్యం గల ఇంజనీర్ల పటిష్టమైన పునాదిని ఏర్పాటు చేయనున్నారు.

ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ ట్రిలియన్ డాలర్లకు చేరుకోనున్న తరుణంలో దాదాపు మిలియన్లు నైపుణ్యం గల నిపుణుల అవసరం ఉంటుందనితద్వారా భారతీయ యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని కేంద్రమంత్రి తెలిపారు.

కీలక పాత్ర పోషించే ఢిల్లీలోని ప్రముఖ సంస్థలు

భారత సెమీ కండక్టర్ మిషన్‌కు మద్దతు ఇవ్వడంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్‌)లోని పలు ప్రముఖ విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయిఈ సంస్థలు సెమీకండక్టర్ డిజైన్టెస్టింగ్వాలిడేషన్ అంశాల్లో శిక్షణను అందిస్తున్నాయివాటిలో ముఖ్యమైన సంస్థలు:

  1. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీన్యూఢిల్లీ

  2. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీన్యూఢిల్లీ

  3. ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీన్యూఢిల్లీ

  4. ఢిల్లీ టెక్నాలాజికల్ యూనివర్సిటీఢిల్లీ

  5. నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీఢిల్లీ

  6. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీన్యూఢిల్లీ

  7. ఇందిరా గాంధీ ఢిల్లీ టెక్నికల్‌ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ఢిల్లీ

  8. వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్న్యూఢిల్లీ

  9. డీవీ2జేఎస్ ఇన్నోవేషన్ ఎల్‌ఎల్‌పీన్యూఢిల్లీ

ఈ విద్యా సంస్థల్లోని విద్యార్థులు అధునాతన ఈడీఏ పరికరాలుశిక్షణా సదుపాయాలను ఉపయోగించి స్వయంగా సెమీ కండక్టర్ చిప్‌లను రూపొందిస్తున్నారుతద్వారా భారతదేశపు సెమీ కండక్టర్ వ్యవస్థకు అవసరమైన ప్రతిభావంతులను తయారు చేయటంలో సహకరిస్తున్నారు.

సెమీకాన్ 2.0 ద్వారా దేశవ్యాప్తంగా సెమీ కండక్టర్ డిజైన్తయారీఆవిష్కరణలను ప్రోత్సహించటానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందిసెమీ కండక్టర్ తయారీకిప్రతిభావంతులకు ప్రపంచ స్థాయి కేంద్రంగా భారత్‌ను మార్చటమే దీని ప్రధాన లక్ష్యం.


(రిలీజ్ ఐడి: 2236634) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी