ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు... సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 04 MAR 2026 9:13AM by PIB Hyderabad

హోళీ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారుఈ రంగుల పండగ అందరి జీవితాల్లో సంతోషాన్నిసిరిసంపదలనువిజయాలను తీసుకురావాలని ఆయన కాంక్షించారు.

మొత్తం వాతావరణాన్ని హోళీ పండగ సరికొత్త శక్తితో నింపుతుందని, అదే ఈ పండగ విశిష్టత అని ప్రధానమంత్రి అన్నారుఈ పండగ సమయంలో కనిపించే ఆనందపు రంగులు ప్రతి ఒక్కరినీ ఉత్సాహంతోవేడుకలతో ముంచెత్తుతాయని పేర్కొన్నారు.

 

ప్రధానమంత్రి సంస్కృత సుభాషితాన్ని కూడా పంచుకున్నారు.

ఉద్బిన్నస్తబకావతంససుభగాః ప్రేఖన్మరున్నర్తితాః

పుష్పోద్గిర్ణపరాగపాంశులలసత్పత్రప్రకాణ్డ త్విషః

 

గంభీరక్రమపఞ్చమోన్మదపికధ్వానోచ్ఛలద్గీతయః

ప్రత్యుజ్జీవితమన్మథోత్సవ ఇవ క్రీడన్త్యమూ భూరుహః

 

వసంత సమీరాల మధుర నాట్యానికి పరవశించి, రంగురంగుల వర్ణాలుపరిమళాలతో వికసించే తామర పూల వలె ఆకర్షణీయమైన ప్రేమ ఉత్సవం ఎంతో ఉత్సాహంగా వర్ధిల్లుతుందిఅది జీవితాన్ని మేల్కొల్పే మధుర రాగాలతో నిండినూతనోత్తేజాన్ని ఇస్తుంది.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"దేశ పౌరులందరికీ హోళీ శుభాకాంక్షలురంగులుఉత్సాహంతో నిండిన ఈ పండగ అందరి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరిసేలా చేయాలని ఆశిస్తున్నానుఈ రంగుల పండగతో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందంఅభివృద్ధివిజయాలు వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా".

 

***


(రిలీజ్ ఐడి: 2235263) సందర్శకుల సూచీ సంఖ్య : : 62