పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
జార్ఖండ్‌లోని చత్‌రా జిల్లాలో బీచ్‌క్రాఫ్ట్ సీ90 వీటీ-ఏజేవీ ఎయిర్ అంబులెన్స్ దుర్ఘటనపై డీజీసీఏ ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
23 FEB 2026 11:38PM by PIB Hyderabad
‘‘రాంచీ-ఢిల్లీ’’ సెక్టరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన బీచ్‌క్రాఫ్ట్ సీ90 వీటీ-ఏజేవీ ఎయిర్ అంబులెన్స్ 2026 ఫిబ్రవరి 23న జార్ఖండ్‌లోని చత్‌రా జిల్లా కాసరియా పంచాయతీలో కూలిపోయింది. ఆ విమానంలో ఇద్దరు సిబ్బంది సహా ఏడుగురు ఉన్నారు. విమానం భారతీయ కాలమానం రాత్రి 7 గంటల 11 నిమిషాలకు రాంచీ నుంచి బయల్దేరింది. కోల్‌కతాతో సమాచార సంబంధం ఏర్పరుచుకున్న తరువాత, వాతావరణం కారణంగా దారితప్పింది. రాత్రి 7 గంటల 34 నిమిషాల సమయంలో విమానం కోల్‌కతాతో రాడార్ సహా సమాచార సంబంధాలను కోల్పోయింది. అప్పటికి విమానం వారణాసికి ఆగ్నేయంగా దాదాపు 100 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. అంతలో జిల్లా పాలనా యంత్రాంగానికి చెందిన సహాయక బృందం అక్కడికి చేరుకొంది. దర్యాప్తు కోసం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) బృందాన్ని రంగంలోకి దింపుతున్నారు. మరింత సమాచారాన్ని వీలువెంబడి తెలియజేస్తారు.
(రిలీజ్ ఐడి: 2232315)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2