|
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ ప్రదర్శనలో అంతర్జాతీయ సందడి.. సందర్శకుల రద్దీ నడుమ ఆకట్టుకున్న ఏఐ ఆవిష్కరణలు
· వ్యాపారాలు.. ప్రభుత్వ వ్యవస్థలకు సాధికారతనిచ్చే సురక్షిత.. భవిష్యత్ సంసిద్ధ వ్యవస్థలను ప్రస్ఫుటం చేసిన ఏఐ చోదిత సైబర్ భద్రత
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 6:16PM by PIB Hyderabad
న్యూడిల్లీలో నిర్వహిస్తున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026”లో ఇవాళ మూడో రోజున మొత్తం 10 పెవిలియన్లలో ఏర్పాటు చేసిన ప్రదర్శన విశేష ఆకర్షణగా నిలిచింది. పరిశ్రమ అగ్రగాములు, అంకుర సంస్థలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులు, పౌరుల బలమైన భాగస్వామ్యాన్ని ఇది ఎంతో ప్రభావితం చేసింది. ప్రతికూల వాతావరణం ఇబ్బంది కలిగించినా, అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానాల ప్రత్యక్ష ప్రదర్శనను వీక్షించేందుకు యువతరం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ ప్రదర్శనలో ఏఐ చోదిత సైబర్ భద్రత కీలకాంశంగా నిలిచింది. నానాటికీ పెరిగే ముప్పుల నివారణ కోసం డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతం లక్ష్యంగా రూపొందించిన ఫిన్‌టెక్ సొల్యూషన్స్ సహా అనేక పరిష్కారాలను ఆవిష్కర్తలు ప్రదర్శించారు. వీటిలో డిజిటల్ వాణిజ్యంలో తదుపరి దశ కోసం అధునాతన మేనేజ్డ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ (ఎండీఆర్) వేదికలు, ఏఐ చోదిత ముప్పుపై నిఘా వ్యవస్థలు, మల్టీలేయర్డ్ ప్రివెన్షన్-ఫస్ట్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్కులు, సురక్షిత ఎండ్-టు-ఎండ్ ఏఐ లావాదేవీలు వంటివి ఇందులో ఉన్నాయి. మానవ నైపుణ్యంతో కృత్రిమ మేధను జోడించడం ద్వారా ఈ పరిష్కారాలు అసాధారణ అంశాలను గుర్తించడమే కాకుండా సైబర్ దాడుల నిరోధం, సంఘటనలపై సత్వర స్పందన ద్వారా ప్రమాదాల తగ్గింపు, కీలకమైన డిజిటల్ ఆస్తుల రక్షణ వంటి విధులను నిర్వర్తిస్తాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం- ప్రిడిక్టివ్ అనలిటిక్స్, రియల్-టైమ్ మానిటరింగ్ అండ్ ఏఐ ఎనేబుల్డ్ రెస్పాన్స్ సిస్టమ్స్ వంటివి వ్యాపారాలు సహా ప్రభుత్వ విభాగాలు, సంస్థల సైబర్ భద్రత వ్యవస్థల బలోపేతంలో తోడ్పడతాయి.
అనుసరణీయ, సమర్థ వ్యవస్థల రూపకల్పనలో ఏఐ పాత్రను బలోపేతం చేస్తూ- పరిపాలన, వాణిజ్య వ్యవస్థల ఏకీకరణ, స్మార్ట్ అర్బన్ వేదికలు, డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్వహణలో ఏఐ అప్లికేషన్లను కూడా ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించారు.
ఆచరణాత్మక వినియోగ నమూనాలు, డేటా భద్రత ప్రమాణాలు, సమ్మతి విధానాలు, వాస్తవ-ప్రపంచ ప్రభావాలపై అవగాహన చేసుకునే దిశగా సందర్శకులు ప్రదర్శకులతో చురుగ్గా సంభాషిస్తున్నారు. ‘ఏఐ’ని కెరీర్‌గా స్వీకరించడంపై నానాటికీ పెరుగుతున్న ఆసక్తిని విద్యార్థులు, యువ నిపుణుల ఉత్సాహభరిత ప్రతిస్పందన ప్రతిబింబించింది.
విద్యాసంస్థలు, పరిశ్రమ, ప్రభుత్వాల మధ్య సహకార విస్తృతికి “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ ఎక్స్‌పో ఒక వేదికగా ఉపయోగపడుతోంది. ఈ ప్రదర్శనలకు భారీ సంఖ్యలో జనం రావడాన్ని బట్టి- ఆధునిక సాంకేతికతల సౌలభ్యాన్ని ప్రజాస్వామ్యీకరిస్తూ సైన్స్, ఆవిష్కరణలు, పునరుత్థాన సామర్థ్యం తదితరాల బలోపేతంలో ఏఐ చోదిత పరిష్కారాల ఔచిత్యం స్పష్టమవుతోంది. సుస్థిర వృద్ధి కోసం సురక్షిత, సమ్మిళిత, భవిష్యత్ సంసిద్ధ కృత్రిమ మేధ వ్యవస్థల రూపకల్పనలో భారత్ నిబద్ధతను ఈ సదస్సు ప్రస్ఫుటం చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2230011)
|