భారత ఎన్నికల సంఘం
వార్షిక క్రీడా వారోత్సవం-2026ను ప్రారంభించిన ఈసీఐ
క్రీడలు, ఎన్నికలకు ఉమ్మడి విలువలు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2026 1:10PM by PIB Hyderabad
1. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తన వార్షిక క్రీడా వారోత్సవం-2026 వేడుకలను ఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ) స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ రోజు ప్రారంభించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్ ఈ ఉదయం క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించి, క్రీడలను ప్రారంభించారు.
2. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రసంగిస్తూ.. పారదర్శకత, నైతిక వర్తన, నిష్పాక్షికత వంటి క్రీడా విలువలే.. భారత ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల ప్రక్రియలకు కూడా పునాదులని వ్యాఖ్యానించారు. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకల సందర్భంగా ఆటల పోటీల్లో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొనాలంటూ సిబ్బందిని ప్రోత్సహించారు.
3. ప్రసంగం అనంతరం.. ‘రన్ ఫర్ డెమోక్రసీ’ ఇతివృత్తంతో నిర్వహించిన మహిళల 100 మీటర్ల పరుగు పోటీని ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్ ప్రారంభించారు. ఈ ఏడాది వార్షిక క్రీడా వారోత్సవాల ఇతివృత్తం- ‘క్షేత్ర స్థాయి సామరస్యం, ప్రజాస్వామ్యానికి బలం’.
4. ఈసీఐ రిక్రియేషన్ క్లబ్ నిర్వహిస్తున్న ఈ వార్షిక క్రీడా వారోత్సవాల్లో మొత్తం 383 మంది పాల్గొంటున్నారు. వీరిలో 72 మంది మహిళలు.
5. మొత్తం 7 క్రీడల్లో 43 విభాగాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ ట్రాక్ ఈవెంట్స్ (వయస్సుల వారీగా పురుషులు, మహిళలకు 100, 200, 400, 800 మీటర్ల పరుగు పోటీలు).
****
(రిలీజ్ ఐడి: 2228687)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20