జౌళి మంత్రిత్వ శాఖ
స్పిన్నింగ్ మిల్లులకు తోడ్పాటు అందించే కార్యక్రమాలు
నాడు పోస్టు చేయడమైనది:
13 FEB 2026 2:28PM by PIB Hyderabad
గణాంకాలు, పీఐ మంత్రిత్వ శాఖ చేపట్టిన వార్షిక పరిశ్రమల సర్వే ప్రకారం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా మొత్తం స్పిన్నింగ్ మిల్లుల సంఖ్య, పనిచేస్తున్న స్పిన్నింగ్ మిల్లుల సంఖ్య, ఇతర వివరాలు దిగువన పేర్కొన్న విధంగా ఉన్నాయి. స్పిన్నింగ్ మిల్లుల మూసివేతకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో లేదు.
దేశంలో స్పిన్నింగ్ మిల్లులకు మద్దతుగా ప్రభుత్వం అమలు చేస్తున్న కీలకమైన కార్యక్రమాలు దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి:
సాంకేతిక మెరుగుదల, ఆధునికీకరణ
I. సవరించిన సాంకేతిక అభివృద్ధి నిధి పథకం (ఏటీయూఎఫ్ఎస్) దీని ద్వారా నిర్దేశిత ప్రమాణాలతో కూడిన యంత్రాలను కొనుగోలు చేయడానికి, మిల్లులను ఆధునికీకరించడానికి, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి వస్త్ర యూనిట్లకు క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ (సీఐఎస్)లు లభిస్తాయి.
II. స్పిన్నింగ్ మిల్లు ఆధునికీకరణ పథకాలు: అయిదేళ్ల కంటే ఎక్కువ కాలం ఉపయోగించిన యంత్రాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసుకోవడానికి వడ్డీ రాయితీలను తమిళనాడులో అందిస్తున్నారు. ఇలా రాష్ట్రాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలున్నాయి.
III. మినీ టెక్స్‌టైల్ పార్కు పథకం: చిన్న తరహా యూనిట్లలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి, భవనాలు, యంత్రాలకు సబ్సిడీలు లభిస్తాయి.
ముడి సరకు సరఫరా, ధరల స్థిరీకరణ
I. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తోడ్పాటు: ముడి సరకును అందుబాటులో ఉంచేందుకు, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి కొన్న పత్తి నిల్వలను ఎంఎస్ఎంఈ విభాగంలో ఉన్న స్పిన్నింగ్ మిల్లులకు నేరుగా విక్రయించాలని సీసీఐకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
II. ప్రత్యేక విక్రయాలు/డిస్కౌంట్లు: పోటీతత్వాన్ని పెంచడానికి ఎంఎస్ఎంఈ మిల్లులు, సహకార రంగంలోని మిల్లులు, ఖాదీ పరిశ్రమలకు రాయితీలను (ఉదాహరణకు క్యాండీకి రూ.300 చొప్పున) సీసీఐ అందిస్తోంది.
III. నూలు సరఫరా పథకం (వైఎస్ఎస్): చేనేత కార్మికులకు ‘మిల్లు గేటు ధర’కే ముడి పదార్థాలు లభించేలా ఈ పథకం తోడ్పడుతుంది. ఇది పరోక్షంగా నూలుకు స్థిరమైన డిమాండును కల్పిస్తుంది.
IV. కస్తూరి కాటన్ కార్యక్రమం: భారతీయ పత్తి నాణ్యతను మెరుగుపరిచేలా, పొలం నుంచి మిల్లు వరకు మొత్తం సరఫరా వ్యవస్థకు లాభం చేకూరేలా బ్రాండింగ్, మూలాన్వేషణ, ధ్రువీకరణపై దృష్టి సారిస్తుంది.
ఆర్థిక సాయం, ప్రోత్సాహకాలు:
- ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం: అధిక విలువ కలిగిన మ్యాన్-మేడ్ ఫైబర్ (ఎంఎంఎఫ్) వస్త్రాలు, టెక్నికల్ టెక్స్‌టైల్స్ ఉత్పత్తిని ఇది ప్రోత్సహిస్తుంది. అలాగే పెట్టుబడులను ఆకర్షిస్తుంది. పర్యావరణహిత తయారీని ప్రోత్సహిస్తుంది.
- రాష్ట్ర, కేంద్ర పన్నులు, సుంకాలపై రాయితీ (ఆర్‌వోఎస్‌సీటీఎల్): ఎగుమతి చేసే దుస్తులు, ఇతర రెడీమేడ్ వస్త్ర ఉత్పత్తులపై పన్ను రాయితీలను అందిస్తుంది. దీని వల్ల నూలుకు డిమాండు పెరుగుతుంది.
- వడ్డీ సమతులీకరణ పథకం: ఎంఎస్ఎంఈ ఎగుమతిదారులకు మద్దతిచ్చేలా ఎగుమతులకు ముందు, తర్వాత ఇచ్చే రుణాలపై వడ్డీ రాయితీ అందిస్తుంది.
- టెక్స్‌టైల్స్ కోసం ప్రత్యేక ప్యాకేజీ (2016): ఏటీయూఎఫ్ఎస్ ప్రకారం అదనపు ఉత్పత్తి సబ్సిడీలు, ఈపీఎఫ్ చందా సహకారం, పన్ను మినహాయింపులు వంటి చర్యలు.
మౌలిక వసతుల అభివృద్ధి:
I. పీఎం-మిత్ర పార్కులు: రవాణా ఖర్చులు తగ్గించడానికి, సామర్థ్యాన్ని పెంపొందించడానికి అంతర్జాతీయ స్థాయి, ప్లగ్-అండ్-ప్లే సౌకర్యాలతో 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజన్, అపెరల్ పార్కుల ఏర్పాటు.
II. ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ (ఐపీడీఎస్): ఇది కొత్త, మెరుగుపరిచిన కామన్ ఎఫ్ల్యూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)లకు తోడ్పాటునిస్తూ.. పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా మిల్లులకు సహకరిస్తుంది.
III. సమర్థ్ పథకం (టెక్స్‌టైల్ రంగంలో సామర్థ్య నిర్మాణ పథకం): ఈ రంగానికి నైపుణ్యమున్న శ్రామిక శక్తిని అందించడానికి డిమాండ్ ఆధారిత, ఉద్యోగ ఆధారిత శిక్షణను అందించడం దీని లక్ష్యం.
సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం, నైపుణ్యమున్న మానవ వనరులకు, పెరుగుతున్న ముడిసరకు ధరలు, సరఫరా వ్యవస్థలో ఉన్న లోపాలను ఈ కార్యక్రమాలు సమష్టిగా పరిష్కరించేందుకు దోహదపడుతున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2227835)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10