జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘సుజలం భారత్’లో మాస్టర్ ట్రయినర్స్‌‌కు శిక్షణను నిర్వహించిన డీడీడబ్ల్యూఎస్..


సుజల్ గావ్ ఐడీ, జిల్లా సాంకేతిక విభాగాలతో డిజిటల్ జల పరిపాలనను వేగవంతం చేసిన ప్రభుత్వం

గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థలకు కీలక డిజిటల్ సార్వజనిక మౌలిక సదుపాయం.. ‘సుజల్ గావ్ ఐడీ’

నాడు పోస్టు చేయడమైనది: 12 FEB 2026 7:18PM by PIB Hyderabad

దేశంలో 81 శాతానికన్నా ఎక్కువ గ్రామీణ ప్రాంతాల కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ (జేజేఎమ్సేవలను ప్రస్తుతం అందిస్తున్నారుదీంతోఈ మిషన్ క్రమంగా తన దృష్టిని మౌలిక సదుపాయాల కల్పన దశ నుంచి ఇక గ్రామీణ ప్రాంతాలకు నీటిని గొట్టపు మార్గం ద్వారా సరఫరా చేసే వ్యవస్థలను ప్రమాణాల మేరకు నిర్వహించడంమరమ్మతుపర్యవేక్షణల వైపునకు మళ్లిస్తోందిఈ దిశగాజల శక్తి శాఖలోని తాగు నీరుపారిశుధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్సుజలం భారత్ డేటాబేస్మొబైల్ అప్లికేషన్‌ వేదికపై మాస్టర్ ట్రయినర్లకు జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఎస్‌సీఓపీఈ భవన సముదాయంలో 2026 ఫిబ్రవరి 12న చేపట్టిందిదీంతో పాటు జిల్లా సాంకేతిక విభాగ (డిస్ట్రిక్ట్ టెక్నికల్ యూనిట్.. డీటీయూప్రణాళికలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.

సుజలం భారత్ డేటాబేస్ (ఆర్‌పీడబ్ల్యూఎస్ఎస్ మాడ్యూల్)పైనామొబైల్ అప్లికేషన్‌పైనా డీడీడబ్ల్యూఎస్ అధికారులు ఒక ప్రజెంటేషన్‌ను ఇచ్చారుఇది ‘మూలంలో నుంచి ఇంటి వరకూ’ గ్రామీణ నీటి సరఫరా పథకాలకు సంబంధించిన ఒక సంపూర్ణజియో-ట్యాగ్‌ను కలిగి ఉండే డిజిటల్ రిజిస్టర్‌ని అందిస్తుందిదీంతో బలమైన సార్వజనిక మౌలిక సదుపాయాలకు పునాది ఏర్పడుతుందిపథకాన్ని ఏకీకరించడంవిశిష్ట సుజలం భారత్సుజల్ గాఁవ్ ఐడీని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్లాట్‌ఫారమ్ మౌలిక సదుపాయాల్నీనిర్వహణ కార్యకలాపాల్నీనీటి నాణ్యతనీసేవలకు సంబంధించిన సమాచారాన్నీ సంధానిస్తుందిఫలితంగా క్రియాత్మక సాముదాయిక భాగస్వామ్యంతో పాటు మెరుగైన పారదర్శకతజవాబుదారుతనంపరిపాలనకు మార్గం సుగమం అవుతుంది.

సుజల్ గావ్ ఐడీ: గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థలకు సంబంధించిన ఒక ఏకీకృత డిజిటల్ రిజిస్ట్రీని రూపొందించడం

ఉదయం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆర్‌పీడబ్ల్యూఎస్ఎస్ మాడ్యూలు, సుజల గావ్ ఐడీ రూపకల్పనలతో పాటు సుజలం భారత్ యాప్.. వీటి ఆచరణీయ సాంకేతిక నిర్వహణాంశాలపైన దృష్టిని కేంద్రీకరించారుఆర్‌పీడబ్ల్యూఎస్ఎస్ ఐడీని తయారు చేయడానికి సంబంధించిన సాంకేతిక శిక్షణను ఎన్ఐసీ అధికారులు అందించారుజేజేఎమ్ 2.0 డ్యాష్‌బోర్డులో ఐడీ రూపకల్పన తాలూకు పూర్తి ప్రక్రియను వివరించారుతరువాత ప్రశ్నలుజవాబుల కార్యక్రమాన్ని నిర్వహించారు.

తదనంతరం, సుజలం భారత్ మొబైల్ అప్లికేషనుకు సంబంధించిన సమగ్ర శిక్షణను చేపట్టారుదీనిలో జియో-రిఫరెన్సింగ్ ప్రక్రియలుగ్రామీణ నీటి సరఫరా కేంద్రాలను సుజలం భారత్ వేదికపై ఏకీకరించడమెలాగన్నది తెలియజేశారురాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలు చర్చలలో చురుకుగా పాల్గొనినిర్వహణసాంకేతిక అంశాలపై వివరణలను కోరాయి.

రాష్ట్రాలు ఇప్పటికే మాడ్యూల్‌లో డేటాను పొందుపరచడంతో పాటు యాప్ ద్వారా కేంద్రాల జియో-ట్యాగింగును మొదలుపెట్టాయిఇది గ్రామీణ తాగు నీటి మౌలిక సదుపాయాల ఏకీకరణజీఐఎస్‌తో ముడిపెట్టిన డిజిటల్ అసెట్ రిజిస్ట్రీని ఏర్పాటు చేసే దిశగా కీలక ప్రగతిని సూచిస్తోంది.

జిల్లా సాంకేతిక విభాగాలు: ఉపయోగం ఆధారిత, సేవా ప్రధాన నమూనా వైపు మళ్లడం

మధ్యాహ్న కార్యక్రమాల్లో భాగంగా జిల్లా సాంకేతిక విభాగం (డీటీయూప్రణాళికపై శ్రద్ధ తీసుకున్నారుఇది జల్ జీవన్ మిషన్ విస్తారిత దశలో భాగంగా ఒక వ్యూహాత్మక సంస్థాగత సంస్కరణకు ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నదిడాడీడబ్ల్యూఎస్ అధికారులు డీటీయూపై ఒక సమగ్ర ప్రజెంటేషన్‌ను ఇచ్చారు.

జేజేఎం ప్రారంభ దశలో సార్వజనీన కుటుంబ నల్లా కనెక్షన్లను అందుకోవడానికి సత్వరం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యాన్ని ఇచ్చారు. అదే సమయంలోతరువాతి దశకు వచ్చేసరికి దీర్ఘకాలిక పనితీరుస్థిరత్వంవిశ్వసనీయ సేవల అందజేతపై దృష్టి సారించారుడీటీయూను జిల్లా స్థాయి గ్రామీణ నీటి నిరన్వహణ తాలూకు సాంకేతిక వెన్నెముకగా లక్షించారుఇది జిల్లా జలపారిశుధ్య మిషన్ (డీడబ్ల్యూఎస్ఎమ్)కు సంబంధించిన విస్తారిత సాంకేతిక శాఖలా పనిచేస్తుందిఈ ఫ్రేంవర్కు సంబంధిత విభాగాలతోనూనిపుణత కలిగిన సంస్థలతోనూ సమన్వయం నెలకొల్పుకోవడాన్ని ప్రోత్సహిస్తుందిఅలాగే పీహెచ్ఈడీ అధికారులునీటి నాణ్యత సిబ్బందిసాంకేతిక సలహాదారుల వ్యవస్థ ద్వారా సాంకేతిక పర్యవేక్షణను ఇది సమర్ధిస్తుంది.

డిజిటల్ పరిపాలన యంత్రాంగాల్ని స్వీకరించడం డీటీయూ ప్రణాళికలో ఓ కీలకాంశంగా ఉంది. దీనిలో అన్ని గ్రామీణ నీటి సరఫరా పథకాల్నీ సుజలం భారత్ జీఐఎస్-లింక్‌డ్ డిజిటల్ అసెట్ రిజిస్ట్రీలో సంధానించడంతో పాటు జల సేవా ఆంకలన్ (జేఎస్ఏ)కు నాయకత్వం వహించడం భాగంగా ఉంటాయిఈ ఫ్రేంవర్కు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వ్యవస్థలో వైఫల్యాల్ని తగ్గించడానికి డిజిటల్ ట్విన్స్ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్నివారణ ప్రధాన నిర్వహణ వ్యూహాల వంటి డిజిటల్ ఉపకరణాలను ఉపయోగించడాన్ని కూడా ప్రోత్సహిస్తుందిజల సేవా ఆంకలన్‌‌లో డీటీయుల పాత్రబాధ్యతలను గురించి ఎన్‌పీఎంయూ-పీహెచ్‌ఈఎన్‌జేజేఎమ్ బృందం నాయకుడు శ్రీ అబ్‌సార్ ఖాన్ వివరంగా తెలిపారుజేఎస్‌ఏ ఫార్మాట్ విస్తృత వివరణనూ అందించారుదీని తరువాత ప్రశ్నలూజవాబుల కార్యక్రమాన్ని చేపట్టారు.

భారత్ పూర్తి స్థాయిలో డిజిటలీకరించినసేవల అందజేతలో సమర్థమైన జల సంబంధిత మౌలిక సదుపాయాల అనుబంధ విస్తారిత వ్యవస్థ దిశగా పురోగమిస్తున్న తరుణంలోఏ జనావాసాన్నీ పట్టించుకోకుండా ఉండరాదని ప్రభుత్వం నిబద్ధతను వ్యక్తం చేస్తోందని డీడీడబ్ల్యూఎస్ సంయుక్త కార్యదర్శి (నీరుశ్రీమతి స్వాతి మీనా నాయక్ స్పష్టం చేశారుఆమె కార్యక్రమంలో మాట్లాడుతూప్రతి ఒక్క బస్తీకీ ఎల్‌జీడీ కోడ్‌తో ముడిపడి ఉండే ఒక విశిష్ట డిజిటల్ గుర్తింపును కేటాయిస్తారనీఅది అన్ని పథకాలకూ ఆధారభూతంగా ఉండే ‘సుజల్ గ్రామ్ ఐడీ కి మదర్ ఐడీ’ని ఏర్పరుస్తుందనీ తెలిపారుఇది ఉన్నత పనితీరు కల డీటీయూ వ్యవస్థను ఉపయోగించుకొని రాష్ట్రం స్థాయిలో ఖచ్చితమైనపురోగామి డిజిటల్ ట్విన్ ఆధారిత సిమ్యులేషనుకు మార్గాన్ని సుగమం చేస్తుందన్నారుభౌతికడిజిటల్ మౌలిక సదుపాయాలను సంధానించి విద్యుత్తు కంపెనీలు విశ్వసనీయతలోనూనిర్వహణ సామర్థ్యంలోనూముందస్తు అంచనాతో కూడిన మరమ్మతులలోనూ ఉన్నత ప్రమాణాల్ని అందుకోగలుగుతాయని ఆమె వివరించారుఈ మార్పు సేవ స్థాయుల దక్షతను దాదాపు 100 శాతానికి పెంచుతుందనీఇంజినీర్లకు అత్యాధునిక ఉపకరణాల హంగులను కల్పిస్తుందనీపారదర్శకడేటా ఆధారిత నీటి సేవల అందజేత దిశగా దేశ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందనీ ఆమె ఉద్ఘాటించారు.

సీనియర్ అధికారులు జిల్లా స్థాయిలో వృత్తిపరంగా సాంకేతిక సహాయ వ్యవస్థల ప్రాధాన్యాన్ని చాటిచెబుతూ అభిప్రాయాల్ని పంచుకొన్నారుమరికొందరు సీనియర్ అధికారులు కూడా ప్రసంగించారుతరువాత చర్చా కార్యక్రమం ముగిసింది.

2047 కల్లా వికసిత్ భారత్ ఆశయ సాధనను దృష్టిలో పెట్టుకొని సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడం

కార్యక్రమం ముగింపులోఎన్‌జేజేఎమ్ డీడీడబ్ల్యూఎస్ అదనపు కార్యదర్శిమిషన్ డైరెక్టరు శ్రీ కమల్ కిశోర్ సొవాన్ ప్రసంగించారు. 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్‌ లక్ష్యాన్ని సాధించడానికి అనుగుణంగా శాశ్వత గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థలను అందించడంలో డిజిటల్ పారదర్శకతసంస్థాగత పటిష్ఠీకరణసేవల స్థాయిపై ఆధారపడి ఉండే నిర్వహణలకు పెద్ద పీట వేయాలని శ్రీ సొవాన్ స్పష్టం చేశారుడిజిటల్ నీటి నిర్వహణను బలోపేతం చేయడంపై జేజేఎమ్ దృష్టిని కేంద్రీకరిస్తోందనీమరమ్మతుల కోసం గొట్టపు మార్గాలను మూసివేయడం కావచ్చు... లేదా అంతర పథక అనుసంధానాలు కావచ్చులేదా ఆర్థిక సర్దుబాట్లు కావచ్చు.. ‘మూలం నుంచి నల్లా వరకూ’ సేవల సంపూర్ణ వ్యవస్థలో డేటా చోదకశక్తిగా ఉండే దృష్టికోణాన్ని జిల్లాలు అనుసరించాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆయన అన్నారుమ్యాపింగ్మూలానికి సంబంధించిన వివరాలునిర్వహణకు సంబంధించిన సమస్యలను విస్పష్ట సమాచారాన్ని అందించడంతో పాటు కాలానుగుణమైన దిద్దుబాటు చర్యలను కూడా చేపడితే ప్రతి ఒక్క కార్యకలాపాన్నీ సమంజసంగాపారదర్శకంగాదీర్ఘకాలం పాటు పథకం కొనసాగేలా చూడాలని తెలిపారునివారణ ప్రధాన వ్యవస్థలకు సంస్థాగత రూపాన్నివ్వడంతో పాటు క్షేత్ర బృందాలుసాంకేతిక విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం ద్వారా ‘మూలం మొదలు ఇంటి నల్లా వరకూ’ సేవలలో అంతరాయాలను తగ్గించవచ్చని వివరించారుదీంతో గ్రామీణ నీటి సరఫరా సేవలపై ప్రజలకు నమ్మకం బలపడుతుందన్నారుజిల్లా కలెక్టరుకు డీటీయూ ఇన్‌ఛార్జి అధికారి రిపోర్టు చేస్తారనీడీటీయూ పనితీరునూతాగు నీటి సేవల అందజేతనూ క్రమం తప్పకుండా ప్రతి నెలా సమావేశాల్ని నిర్వహించి సమీక్షిస్తారనీ శ్రీ సొవాన్ వెల్లడించారు.

రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించడమే కాక పరస్పరం పంచుకోవాల్సిందిగా మాస్టర్ ట్రయినర్లందరికీ ఆయన విజ్ఞ‌ప్తి చేశారురాష్ట్రంజిల్లాగ్రామ పంచాయతీ స్థాయిలో ఫిబ్రవరిలో కనీసం ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దీనిలో భాగంగా ఉంటుంది.

శిక్షణ కార్యక్రమంలో పీహెచ్ఈడీ ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బందిరాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నామినేషన్‌ను పొందిన సలహాదారులు పాల్గొంటారువారు ఇకపై రాష్ట్రజిల్లా స్థాయుల్లో మాస్టర్ ట్రయినర్రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరిస్తారుదీంతో శిక్షణ కాలంలో తాము సంపాదించిన జ్ఞ‌ానాన్ని విస్తృతంగా ప్రచారం చేసిసంస్థాగతీకరించడానికి మార్గం సుగమం అవుతుంది.

సుజల్ గావ్ ఐడీ, జిల్లా సాంకేతిక విభాగం ప్రణాళిక వంటి కార్యక్రమాల్ని నిర్వహించడం ద్వారాదేశమంతటా గ్రామీణ తాగు నీటి సేవల అందజేతలో డిజిటల్ పరిపాలననీజవాబుదారుతనాన్నీదీర్ఘకాలిక స్థిరత్వాన్నీ ఈ విభాగం బలోపేతం చేయనుంది.

 

****


(రిలీజ్ ఐడి: 2227617) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी