నాడు పోస్టు చేయడమైనది:
12 FEB 2026 4:11PM by PIB Hyderabad
గత అయిదు సంవత్సరాల్లో ఇస్రో సాంకేతిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసిన అంతరిక్ష అనువర్తన ప్రాజెక్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
వ్యవసాయ రంగం:
· శాటిలైట్ ఆధారంగా పంట సాగు విస్తీర్ణం, కోత కోసిన ప్రాంతపు పురోగతిని పర్యవేక్షించడం
· వరి పంట సాగు విస్తీర్ణం, దిగుబడి మ్యాపులను రూపొందించడం
· ఆగస్టు చివరి నాటికి ఎస్ఏఆర్ డేటాను ఉపయోగించి పంట సాగు విస్తీర్ణపు మ్యాపులను సిద్ధం చేయడం
· మండల స్థాయిలో వ్యవసాయ కరువును అంచనా వేయడం
· పీఎంఎఫ్ బీవై కింద సాంకేతికత ఆధారంగా పంట దిగుబడిని అంచనా వేయడం
· కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అగ్రిస్టాక్ ప్రాజెక్టు కోసం హై-రెజల్యూషన్ శాటిలైట్ డేటా వినియోగం
మత్స్య రంగం:
ఆంధ్రప్రదేశ్ సహా తీరప్రాంత రాష్ట్రాల్లోని మత్స్యకారుల కోసం నావిక్, కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉపయోగించి ఇస్రో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో మత్స్య శాఖ వెసెల్ కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్ సిస్టమ్ (వీసీఎస్ఎస్) ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా సముద్రంలో వేటకి వెళ్లే పడవలోని మత్స్యకారులకు, కంట్రోల్ రూమ్‌కు మధ్య రెండు వైపులా సమాచారాన్ని పంపే సదుపాయం కల్పిస్తుంది.
విపత్తు నిర్వహణ మద్దతు:
· వరదలు, తుపాన్లు, కార్చిచ్చు వంటి ప్రధాన విపత్తుల సమయంలో ఎప్పటికప్పుడు మ్యాపింగ్, పర్యవేక్షణ, నష్ట అంచనా
· 21 సంవత్సరాల వరద ముంపు డేటాను ఉపయోగించి వరద ప్రమాద జోనేషన్ అట్లాస్(వరద ముప్పు ప్రాంతాల విభజన మ్యాప్) తయారీ
· గోదావరి నదిలో వరదలకు 2 రోజుల ముందస్తు హెచ్చరికల పంపిణీ
· విపత్తు నిర్వహణ కోసం రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక జియోపోర్టల్ను, మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించడం. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ అధికారులకు అంతరిక్ష అనువర్తనాలపై శిక్షణ కార్యక్రమం
· రాష్ట్రంలో రెండు పిడుగు గుర్తింపు సెన్సార్ల ఏర్పాటు, తాలూకా స్థాయిలో పిడుగులు ఎక్కువగా పడే ప్రాంతాలను గుర్తించడం.
పట్టణ ప్రణాళిక:
· గృహ నిర్మాణం, మరమ్మత్తు పనుల పర్యవేక్షణకు వీలుగా వాటి జియోట్యాగింగ్ కోసం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కోసం భువన్ వెబ్‌జీఐఎస్, మొబైల్ అప్లికేషన్ అమలు
· ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ) సదుపాయాన్ని కల్పించడం.
టెలి-ఎడ్యుకేషన్,టెలి-మెడిసిన్:
అంతరిక్ష శాఖ ఉపగ్రహ సామర్థ్యాన్ని, సాంకేతిక సహాయాన్ని అందించడం ద్వారా టెలి-ఎడ్యుకేషన్, టెలి-మెడిసిన్ వ్యవస్థు నిరంతరం మద్దతునిస్తోంది.
నీటి వనరులు:
· రాష్ట్రంలోని చిత్తడి నేలల గర్తింపు, వాటి జాబితాను సిద్ధం చేయడం
· తీరప్రాంత నీటి నాణ్యతను అంచనా వేయడం
· అమృత్ పథకం కింద ఉన్న 33 పట్టణాల్లో ప్రతి పట్టణానికి మూడు చొప్పున జలవనరుల సమాచారాన్ని సేకరించడం
· పీఎంకేఎస్ వై-డబ్ల్యూడీసీ 1.0 కింద 376 ప్రాజెక్టులను, పీఎంకేఎస్ వై-డబ్ల్యూడీసీ 2.0 కింద 59 ప్రాజెక్టునుల పర్యవేక్షించడం.
పైన పేర్కొన్న వాటితోపాటు ఇస్రో కింద ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్ సీ) సాంకేతిక, ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ కింది అంతరిక్ష అనువర్తన ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు.
· ప్రతి సంవత్సరానికి భూమి వినియోగం, భూ విస్తీర్ణం (ల్యాండ్ యూజ్, ల్యాండ్ కవర్) (1:250,000 స్కేల్), ప్రతి ఐదేళ్లకు ఒకసారి (1:50,000 స్కేల్)
· వికేంద్రీకృత ప్రణాళిక కోసం అంతరిక్ష సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే ప్రాజెక్టు (ఎస్ఐఎస్-డీపీ-అప్ డేట్)
నిధుల కేటాయింపు, వినియోగం: (గత అయిదేళ్లుగా)
|
ప్రాజెక్టు పేరు
|
మంజూరైన నిధులు
(లక్షల్లో)
|
పంపిణీ చేసిన నిధులు
(లక్షల్లో)
|
ఉపయోగించిన నిధులు
(లక్షల్లో)
|
|
వికేంద్రీకృత ప్రణాళిక కోసం అంతరిక్ష ఆధారిత సమాచారం – అప్‌డేట్ (పూర్తయింది)
|
118.95
|
118.95
|
118.95
|
|
1:50,000 స్కేలులో భూ వినియోగం, భూ విస్తీర్ణ మ్యాపింగ్ (5-ఏళ్ల కాలం) (కొనసాగుతోంది)
|
106.66
|
42.67
|
42.67
|
|
జాతీయ చిత్తడి నేలల జాబితా, అంచనా (పూర్తయింది)
|
31.25
|
31.25
|
31.25
|
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్-స్పేస్ సంస్థను సంప్రదించిన అంకుర సంస్థలు, కంపెనీలు, ఎంఎస్‌ఎంఈలు, విద్యాసంస్థల పేర్లు, అవి ఉన్న ప్రాంతాలు, వాటి కార్యకలాపాల వివరాలను సూచించే ప్రభుత్వేతర సంస్థల వారీగా అనుంబంధ పత్రంలో పొందుపరిచారు.
ఇన్-స్పేస్ రూపొందించిన సీడ్ ఫండ్ పథకం కింద ఇప్పటివరకు 5 నిధుల అవకాశాలను ప్రకటించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన ఎం/ఎస్ స్పేస్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే అంకుర సంస్థ శిక్షణ, మార్గదర్శకత్వం కోసం ఎంపికైంది. ఈ కంపెనీ తమ స్వేచ్ఛాశాట్ వీవో ఉపగ్రహాన్ని పరీక్షించుకోవడానికి ఇస్రో సౌకర్యాలను వాడుకునేలా ఇన్-స్పేస్ తగిన ఏర్పాట్లు చేసింది. అలాగే హోస్టెడ్ పేలోడ్‌ను ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి కూడా అనుమతులు మంజూరు చేసింది.
ఈ సమాచారాన్ని నేడు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేశారు.
ఇన్-స్పేస్‌కు సంప్రదించిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్‌జీఈల జాబితా( అంకుర సంస్థలు, కంపెనీలు, ఎంఎస్‌ఎంఈలు, విద్యాసంస్థలు)
|
వరుస సంఖ్య
|
ఎన్‌జీఈల పేరు
|
రకం
|
ప్రదేశం
|
కార్యకలాపాలు
|
|
1
|
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్
|
విద్యా సంస్థ
|
వరంగల్
|
విద్యారంగం
|
|
2
|
వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల
|
విద్యా సంస్థ
|
విజయవాడ
|
విద్యారంగం
|
|
3
|
చరణ్ ఏరోస్పేస్
|
పరిశ్రమ
|
విశాఖపట్నం
|
ప్రయోగ వాహనాల(రాకెట్) తయారీ
|
|
4
|
ఎన్‌పీహెచ్‌ఎస్‌ఏటీ సిసట్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
పరిశ్రమ
|
విజయవాడ
|
చిన్న, పెద్ద ఉపగ్రహాల కోసం యాంటెన్నాల అభివృద్ధి
|
|
5
|
రమేష్ ఏరోస్పేస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
|
ఎంఎస్‌ఎంఈ
|
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
|
అంతరిక్ష, రక్షణ రంగ అవసరాల కోసం అబ్లేటివ్, స్ట్రక్చరల్ కాంపోజిట్స్ తయారీ, సరఫరా
|
|
6
|
ఆర్షధాతు గ్రీన్ నానోటెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
|
ఎంఎస్‌ఎంఈ
|
గుంటూరు
|
ఈ సంస్థ రక్షణ, అంతరిక్షం నుంచి ఇంధన నిల్వ, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ అనువర్తనాల వరకు వివిధ పరిశ్రమల కోసం పర్యావరణహిత సంశ్లేషణ పద్ధతులు, భారీ స్థాయి ఉత్పత్తి, అనువాద పరిశోధనలపై దృష్టి సారిస్తుంది
|
|
7
|
తారామండల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
|
అంకుర సంస్థ
|
విశాఖపట్నం
|
ప్రైవేట్ పరిశ్రమలు, మానవ అంతరిక్ష యాత్రలు, పరిశోధనలు అన్నీ వృద్ధి చెందగలిగే ఒక స్థిరమైన అంతరిక్ష వాతావరణాన్ని సృష్టించడం, అంతరిక్షంలోని ఆస్తులన్నింటినీ (శాటిలైట్లు, రాకెట్ భాగాలు) తిరిగి వినియోగించడం లేదా వాటిని కక్ష్య నుంచి తొలగించి సురక్షితంగా భూమి వాతావరణంలోకి తీసుకువచ్చి నిర్వీర్యం చేయడం (డీ-ఆర్బిట్) తారామండల్ లక్ష్యం
|
|
8
|
రెడ్ బెలూన్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్
|
అంకుర సంస్థ
|
విజయవాడ
|
ఇది ఒక డీప్-టెక్ ఏరోస్పేస్ అంకుర సంస్థ. ఉపగ్రహాలకు, యూఏవీలకు మధ్య ఉన్న ఖాళీని భర్తీ చేసే అత్యంత అధునాతనమైన 'హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫారమ్లను అభివృద్ధి చేస్తోంది. దీని ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్లోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఉంది
|
|
9
|
రౌడ్రానెక్స్ స్పేస్ టెక్నాలజీస్
|
అంకుర సంస్థ
|
విశాఖపట్నం
|
అంతరిక్ష లాజిస్టిక్స్, లోతైన అంతరిక్ష పరిశోధనలను ఆచరణాత్మకమైనవిగా, విస్తరించదగినవిగా, స్థిరమైనవిగా మార్చే 'ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీస్' (విద్యుత్ చోదక సాంకేతికతల)పై ఈ సంస్థ దృష్టి సారిస్తుంది
|
|
10
|
బీఈఎస్ స్సేస్
|
అంకుర సంస్థ
|
విజయవాడ
|
ఈ కంపెనీ అంతరిక్ష రంగంలో 1) సేఫర్- స్పేస్ అనోమలీ ఫోరెన్సిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ రిజల్యూషన్స్. 2) స్వాట్-స్పేస్ వార్ఫేర్ అనాలిసిస్ టూల్ 3) శివ - స్పేస్ హయ్యస్ట్ ఇన్ఫర్మేషన్ వాల్యూ అసెస్మెంట్ 4) గ్లోబల్ డేటా, ఏఐ/ఎంఎల్, డేటా ప్రైవసీ ఎనేబుల్ టూల్స్ విభాగంలో పనిచేస్తుంది
|
|
11
|
ఎన్ స్పేస్ టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్
|
అంకుర సంస్థ
|
తెనాలి, ఆంధ్రప్రదేశ్
|
అంతరిక్ష పరిశోధన, అంతరిక్ష సాంకేతికతపై ఎన్ స్పేస్ టెక్ ప్రధానంగా దృష్టి సారించే అంకుర సంస్థ
|
|
12
|
సంకేత శ్రావణ ఎల్‌ఎల్‌పీ
|
అంకుర సంస్థ
|
విజయవాడ
|
అంతరిక్ష పరిశ్రమలో రేడియేషన్ రక్షణ పరిష్కారాలను అందించడం
|
|
13
|
ద స్పార్క్ ఆఫ్ విస్డమ్
|
అంకుర సంస్థ
|
వరంగల్, ఆంధ్రప్రదేశ్
|
అంతరిక్ష మైనింగ్లో పరిశోధన, అభివృద్ధి, గ్రహశకలాలు, ఇతర చిన్న గ్రహాల నుంచి ఖనిజాలను వెలికితీయడం, ఇనుము, నికెల్, మెగ్నీషియం, నీరు, ఆక్సిజన్, బంగారం, ప్లాటినం వంటి లోహాలు,
|