అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: శాంతి చట్టం అమలు

నాడు పోస్టు చేయడమైనది: 12 FEB 2026 5:19PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి ఆమోదం పొందిన శాంతి చట్టాన్ని 20 డిసెంబర్ 2025న గెజిట్‌లో ప్రచురించారు. అయితే ఇప్పటివరకు ఈ చట్టంలోని నియమాలు, నిబంధనలు, విధానాలు, నిబంధనల అమలుకు సంబంధించిన కాలక్రమాలేవీ ప్రభుత్వం నోటిఫై చేయలేదు.

శాంతి చట్టం-2025 చట్టంలోని నిబంధనలను సమర్థంగా అమలు చేయడం కోసం నియమాలు, నిబంధనలు, విధానాలను రూపొందించాలనే నిబంధన ఉంది. శాంతి చట్టం కేంద్ర ప్రభుత్వానికి తన అధికారాన్ని వినియోగించుకోవడానికి, దాని విధులను నిర్వర్తించడానికి డైరెక్టరేట్లు, వింగ్స్, విభాగాలను ఏర్పాటు చేసేందుకు అధికారం కల్పిస్తుంది. రేడియేషన్ అత్యవసర సమయంలో భద్రత, రక్షణ, నష్టనివారణ చర్యలను, ఏజెన్సీల మధ్య సమన్వయాన్నీ సమర్థంగా అమలు చేయడం... లైసెన్స్‌దారులు, భద్రతా అధికారాన్ని కలిగి ఉన్న వారి బాధ్యతలను నిర్ణయించడం వంటివి దీనిలో భాగంగా ఉన్నాయి.

జాతీయ లక్ష్యాలను చేరుకోవడం లక్ష్యంగా అణు ఇంధన వాటాను పెంచడం కోసం భద్రత, రక్షణ, నష్టనివారణ చర్యలు, అణు నష్టానికి పౌర బాధ్యత వంటి రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ నిబద్ధతలను పూర్తిగా పాటించే విధంగా చట్టపరమైన విధానంలో ముఖ్యమైన పౌర అణు సహకార అంశాలను శాంతి చట్టం సమలేఖనం చేసింది.

అణు విద్యుత్ ఉత్పత్తి, ఆరోగ్య సంరక్షణ, ఆహారం, నీరు, వ్యవసాయం, పరిశోధన, పరిశ్రమ, పర్యావరణం, అణు శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానంలో ఆవిష్కరణల ద్వారా భారత ప్రజల సంక్షేమం కోసం అణు ఇంధనాన్ని, అయనీకరణ రేడియేషన్‌లను ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం, ఉపయోగించడం కోసం శాంతి చట్టం చట్టపరమైన విధానాన్ని అందిస్తుంది.

ఈ సమాచారాన్ని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, ప్రధానమంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2227205) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी