సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రాచీన వస్తువుల అక్రమ వ్యాపార నిరోధం

నాడు పోస్టు చేయడమైనది: 12 FEB 2026 1:51PM by PIB Hyderabad

జాతీయ ప్రాధాన్యం కలిగిన కట్టడాల్లో ఆరు చోరీ కేసులు బయటపడ్డాయినాలుగు కేసుల్లో దొంగతనానికి గురైన వస్తువులను తిరిగి రాబట్టారు. (వివరాలు ఒకటో అనుబంధ పత్రంలో). అన్ని కేసులలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారుదొంగతనానికి గురైన వస్తువులేవీ దేశం బయటకు తరలిపోలేదుపైన ప్రస్తావించిన పురాతన వస్తువుల విషయంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐమూల్య నిర్ధారణ పనిని చేపట్టలేదు.

సాంస్కృతిక సంపద అక్రమ వ్యాపారాన్ని అడ్డుకొనే దిశగా అవసరమైన అన్ని చర్యల్నీ ప్రభుత్వం చేపడుతుందిపహరా రక్షణ సిబ్బందికి అదనంగాప్రయివేటు సెక్యూరిటీ గార్డులతో పాటు కేంద్ర పారిశ్రామిక భద్రత దళ సిబ్బందిని కూడా ఆయా కట్టడాలుస్థలాలుమ్యూజియాల్లో అవసరమైన మేరకు విధుల్లో నియమించారుఏ పురావస్తు దొంగతనం జరిగినట్లు తెలిసినాఎఫ్ఐఆర్‌ దాఖలు చేయడంతో పాటు చోరీ చేసిన ప్రాచీన వస్తువు జాడ కనుగొనడానికీఆ వస్తువును దేశం బయటకు దొంగచాటుగా రవాణా చేయకుండా  అడ్డగించడానికీ కస్టమ్ ఎగ్జిట్ మార్గాలు కాపు కాయడం సహా నేర నియంత్రణ సంస్థలకు ‘లుక్ అవుట్ నోటీసు’ను జారీ చేస్తారుమన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే దిశగా ప్రజల్లో జాగృతిని పెంచే ప్రయత్నాల్ని నిరంతరంగా చేపడుతున్నారు.

 

 

ఒకటో అనుబంధ పత్రం

గత అయిదు సంవత్సరాల్లో జాతీయ ప్రాధాన్యం కలిగిన కట్టడాల్లో చోరీకి గురైన ప్రాచీన వస్తువుల వివరాలు

క్రమ సంఖ్య

రాష్ట్రం

ప్రాచీన వస్తువులు చోరీకి గురైన కట్టడాలుస్థలాల పేర్లతో పాటు అవి ఉన్న ప్రాంతం పేర్లు 

చోరీకి లోనైన వస్తువు పేరు

దొంగతనం జరిగిన సంవత్సరం

స్థితి

 1.


 

ఆంధ్రప్రదేశ్

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో గోలింగేశ్వర ఆలయ సముదాయం

నంది శిల్పం

2021

తిరిగి స్వాధీనం చేసుకున్నారు

 

 2.

ఉత్తరాఖండ్

అల్మోడా జిల్లా ద్వారాహాట్‌లోని భైరవ్మృత్యుంజయ్ ఆలయ సముదాయం

శివ లింగం

2021

తిరిగి స్వాధీనం చేసుకున్నారు

 3.

జార్ఖండ్

హజారీబాగ్ జిల్లాలో సీతాగఢా పురావస్తు తవ్వకాల స్థలం

భూమిస్పర్శ ముద్రలో ఉన్న బుద్ధుని శిల్పాలు రెండు

2021

తిరిగి స్వాధీనం చేసుకున్నారు

4. 

కర్నాటక

మండ్య జిల్లా మారెహళ్లిలోని లక్ష్మీనరసింహ ఆలయంలో గణపతి అమ్మ ఉపాలయం

గణపతి శిలా విగ్రహం

2022

      -

 5.

బీహార్

పాట్నా జిల్లా విక్రమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దతియానా గ్రామం

విష్ణు ప్రతిమ

2022

      -

 6.

తమిళనాడు

కన్యాకుమారి జిల్లా విలావన్‌కోడ్‌లోని పార్వతీపురంలో గల పార్థసారథికృష్ణ ఆలయాలు

విష్ణు విగ్రహం

2024

తిరిగి స్వాధీనం చేసుకున్నారు

 ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ రాజ్యసభలో ఈ రోజు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలియజేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2227050) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी