కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

6Gలో ప్రపంచానికి నాయకత్వం వహించనున్న భారత్: కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా


ప్రధాని శ్రీ మోదీ నాయకత్వంలో 2030 నాటికి 1 బిలియన్ పౌరులకు అందుబాటులోకి రానున్న 5జీ కనెక్టివిటీ: శ్రీ సింధియా

22 నెలల్లో 99.9 శాతం జిల్లాలకు చేరిన 5జీ; ప్రపంచానికి ప్రామాణికంగా మారిన డిజిటల్ ఇండియా వేగం

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2026 5:59PM by PIB Hyderabad

కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా నేడు లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ..  దేశంలో వేగంగా మారుతున్న డిజిటల్ రంగం, భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ ఇకపై సాంకేతికతను అనుసరించే దేశం కాదని, ప్రపంచ డిజిటల్ నాయకుడిగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. కమ్యూనికేషన్‌ విప్లవం ఇకపై కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలకు చేరుతోందని ఆయన చెప్పారు. ఇది పౌరుల జీవనశైలిని, విద్యను, ఆరోగ్యాన్ని, జీవనోపాధిని సరికొత్తగా తీర్చిదిద్దుతోందని ఆయన వివరించారు.

5జీ వేగవంత విస్తరణ, 6జీ కోసం దార్శనిక ప్రోత్సాహం

ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చిన దేశంగా భారత్‌ నిలిచిందని కేంద్ర మంత్రి శ్రీ సింధియా తెలిపారు. కేవలం 22 నెలల స్వల్ప కాలంలోనే దేశంలోని 99.9 శాతం జిల్లాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇది ప్రపంచ దేశాలకు ఒక ప్రామాణికంగా  నిలిచిందని, ఈ విస్తరణ కోసం టెలికాం సేవా సంస్థలు దాదాపు రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాయని, దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా మొబైల్ సిగ్నల్స్ అందించే టవర్ల వ్యవస్థను (బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్లు) ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

‘ప్రస్తుతం 40 కోట్ల మంది పౌరులు 5జీ సేవలను పొందుతున్నారు, 2030 నాటికి ఈ సంఖ్య 100 కోట్లకు (1 బిలియన్) చేరుకుంటుందని అంచనా’ అన్నారు. దేశ భవిష్యత్తు దార్శనికతను వివరిస్తూ.. ‘4జీ విషయంలో ప్రపంచాన్ని అనుసరించిన భారత్, 5జీలో ప్రపంచంతో కలిసి నడిచింది. ఇక 6జీలో ప్రపంచానికే నాయకత్వం వహిస్తుంది’ అని పేర్కొన్నారు.

గ్రామీణ వైఫై విస్తరణమహారాష్ట్ర సాధించిన ఘనత

డిజిటల్ అనుసంధానాన్ని చివరి వ్యక్తి వరకు చేరవేసే ప్రయత్నాలను వివరిస్తూ.. గ్రామీణ భారతదేశంలో వైఫై వ్యవస్థల విస్తరణ ఒక కొత్త విప్లవాన్ని తీసుకువస్తోందని కేంద్ర మంత్రి శ్రీ సింధియా పేర్కొన్నారు. వైఫై హాట్‌స్పాట్‌ల ఏర్పాటులో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటిగా నిలిచిందని ఆయన వెల్లడించారు.

గత దశాబ్ద కాలంలో దేశంలో బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానం అనూహ్యంగా పెరిగిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. పదేళ్ల క్రితం కేవలం 6 కోట్లుగా (60 మిలియన్) ఉన్న కనెక్షన్‌ల సంఖ్య నేడు 100 కోట్లకు (1 బిలియన్) చేరుకుందని తెలిపారు. 2030 నాటికి ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా దేశం నలుమూలలా మరింత లోతుగా విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

(ఎల్‌ఎస్‌-నక్షత్ర గుర్తు గల ప్రశ్న సంఖ్య. 162; 11-02-2026)

మరిన్ని వివరాలకు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించండి:

ఎక్స్‌(ట్విట్టర్): https://x.com/DoT_India

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

ఫేస్‌బుక్: https://www.facebook.com/DoTIndia

యూట్యూబ్: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa


(రిలీజ్ ఐడి: 2226712) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी