గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వీబీ జీ రామ్ జీ అమలు

నాడు పోస్టు చేయడమైనది: 10 FEB 2026 5:51PM by PIB Hyderabad

నైపుణ్యం అవసరం లేని శారీరక శ్రమ చేసేందుకు సిద్ధంగా ఉన్న ప్రతి గ్రామీణ కుటుంబానికిఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 125 రోజుల పని దినాలను కల్పిస్తూ వికసిత భారత్ రోజ్‌గార్ఆజీవికా హామీ మిషన్ (గ్రామీణ్): వీబీజీ రామ్ జీ చట్టం - 2025, ఉపాధికి భరోసా ఇస్తోంది.

మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఎస్ పరిధిలో 100 పని దినాల ఉపాధి హామీ కల్పించాలనే నిబంధన ఉంటే.. కొత్త చట్టంలో 125 రోజులకు పెంచారురైతులతో పాటు శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి గ్రామీణ కుటుంబానికి ఈ ఉపాధి హామీ లభిస్తుందినిర్ణీత సమయంలోగా ఉపాధి కల్పించలేని పక్షంలో శ్రామికుడు నిరుద్యోగ భృతిని పొందే హక్కును ఈ చట్టం కల్పిస్తుందితద్వారా ఉపాధికిజీవనోపాధి భద్రతకు చట్టపరమైన హక్కులుగా రక్షణ లభిస్తుంది.

వికసిత భారత్ రోజ్‌గార్ఆజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (వీబీజీ రామ్ జీచట్టం కేవలం ఉపాధి కల్పన కార్యక్రమంగానే తన పరిధిని పరిమితం చేసుకోలేదుఇది నాలుగు ప్రధాన విభాగాలైన జల భద్రతప్రధాన గ్రామీణ మౌలిక వసతులుజీవనోపాధి సంబంధిత కార్యకలాపాలువిపరీత వాతావరణ పరిస్థితులను తగ్గించేందుకు చేపట్టే పనులతో గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసేందుకు రూపొందించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికఈ విభాగాల్లో చేపట్టే అనేక పనులు వ్యవసాయాన్ని బలోపేతం చేసిరైతులకు తోడ్పాటు అందిస్తాయివ్యవసాయ పనుల సమయంలో శ్రామికులు అందుబాటులో ఉండేలా చేసి రైతులకు ఈ చట్టం అండగా నిలుస్తుందినాట్లుకోతల సమయంలో శ్రామికుల కొరతను రైతులు ఎదుర్కొంటున్నారనిఇది పంట నష్టానికి దారి తీస్తోందని గుర్తించారుదీనిని పరిష్కరించడానికి రైతులకు కూలీల అవసరం ఎక్కువగా ఉండే సాగు పనుల సీజన్లో ఏడాదిలో మొత్తంగా 60 రోజుల పాటు పనులను నిలిపివేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించారుఇది వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా సాగేలారైతులకు అవసరమైన సమయంలో శ్రామికుల సహకారం లభించేలా భరోసాను ఇస్తుందిఈ నిబంధన కర్షక వర్గానికి పెద్ద ఉపశమనం అందిస్తుంది.

వ్యవసాయానికి ప్రాథమిక అవసరమైన జల భద్రతపై కొత్త చట్టం ప్రధాన దృష్టి సారిస్తుందిచెరువులుచెక్ డ్యాములునీటి కుంటలుకాలువలుభూగర్భ జలాలను పెంచే నిర్మాణాలుసూక్ష్మ నీటి పారుదల వ్యవస్థలు తదితరమైన వాటికి ప్రాధాన్యమిస్తారుఇవి సాగు విస్తృతిని పెంచుతాయిఅనిశ్చితమైన వర్షపాతంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయితద్వారా పంట నిలబడే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయిఈ విధానం ప్రస్తుత అవసరాల కోసం మాత్రమే కాకుండాదీర్ఘకాలంలో సుస్థిరత సాధించడానికిభవిష్యత్తు తరాల కోసం రూపుదిద్దుకుంది.

పంట దిగుబడితోనే రైతుల సమస్యలు తీరిపోవని ఈ చట్టం గుర్తించిందిదిగుబడి అనంతర నిర్వహణ కూడా అత్యంత కీలకమైనదిఅందుకేవ్యవసాయ క్షేత్ర స్థాయి నిల్వగోదాములుగ్రామీణ సంతలుశీతల గిడ్డంగులు తదితర మౌలికవసతుల కల్పన పనులను అనుమతించిన జాబితాలో చేర్చారుఇవి రైతులు తమ పంట దిగుబడిని నిల్వ చేసుకోవడానికితక్కువ ధరకే అమ్మాల్సిన పరిస్థితిని తొలగించడానికిమెరుగైన మార్కెట్ ధరలను పొందడానికి రైతులకు వీలు కల్పిస్తాయితద్వారా సాగు ఆదాయాన్ని మెరుగుపరుస్తాయి.

వీటికి అదనంగా మారుతున్న వాతావరణ పరిస్థితులుప్రకృతి వైపరీత్యాల కారణంగా పెరుగుతున్న ముప్పుల విషయంలోనూ ఈ చట్టం ప్రతిస్పందిస్తుందివరద నియంత్రణకట్టలునీటి పరిరక్షణవిపత్తు ఆశ్రయ భవనాలువిపత్తు అనంతర పునర్నిర్మాణం కూడా దీనిలో చేర్చారుఇది గ్రామాలువ్యవసాయ క్షేత్రాల స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుందిఅలాగే సంక్షోభ సమయాల్లో ఉపాధి కల్పిస్తుంది.

వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పశువుల పెంపకంమత్స్య సాగువర్మీ కంపోస్టునర్సరీలుఉద్యాన పంటలువిలువ జోడింపు కార్యకలాపాల్లో వైవిధ్యమైన జీవనోపాధిని ఈ చట్టం ప్రోత్సహిస్తుందిఇది వివిధ వనరుల నుంచి రైతులు తమ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికిస్థానికంగా అవకాశాలను కల్పించడానికివలసలను తగ్గించడానికిసుభిక్షమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి తోడ్పడుతుంది.                    

వికసిత భారత్ రోజ్‌గార్ఆజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (వీబీజీ రామ్ జీ)ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు సంబంధిత పథకాలను అధికారికంగా ప్రకటించివాటిని అమలు చేయాల్సి ఉంటుంది.

ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి శ్రీ కమలేష్ పాశ్వాన్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2226531) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी